మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

నయీ మంజిల్ పథకం కింద 98,712 మంది లబ్ధిదారులకు శిక్షణ

Posted On: 07 FEB 2024 6:08PM by PIB Hyderabad

అధికారికంగా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేని మైనారిటీ యువతకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో 2014-15 నుండి 2020-21 వరకు నయీ మంజిల్ పథకం అమలులో ఉంది. ఈ పథకం అధికారిక విద్య (తరగతి VIII లేదా X) మరియు నైపుణ్యాల కలయికను అందించింది మరియు లబ్ధిదారులకు మెరుగైన ఉపాధి మరియు జీవనోపాధిని పొందేందుకు వీలు కల్పించింది. పథకం ప్రారంభించినప్పటి నుండి 98,712 మంది లబ్ధిదారులు శిక్షణ పొందారు. 58,168 మందికి ఉపాధి లభించినట్లు నివేదించారు. మరియు 8,546 మంది తదుపరి విద్య లేదా నైపుణ్య శిక్షణ పొందారు. నై మంజిల్ పథకం కింద రాష్ట్రం/యూటీ మరియు లింగాల వారీగా లబ్ధిదారుల సంఖ్య ప్రారంభం నుండి అనుబంధంలో ఉంచబడింది.

ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల ద్వారా ఈ పథకం అమలు చేయబడింది. కాబట్టి నిధుల కేటాయింపుపై రాష్ట్రం/యూటీ వారీగా డేటా మంత్రిత్వ శాఖలో నిర్వహించబడదు. ప్రారంభం నుంచి ఈ పథకం కింద రూ.562.39 కోట్లు కేటాయించగా అందులో 2022-23 నాటికి రూ.456.19 కోట్లు వినియోగించబడ్డాయి.

అనుబంధం

 

నయీ మంజిల్ పథకం ప్రారంభం నాటి నుండి  రాష్ట్రం/యూటీ మరియు లింగం వారీగా లబ్ధిదారుల సంఖ్య

రాష్ట్రం

పురుషులు

స్త్రీలు

మొత్తం శిక్షణ పొందిన వారి సంఖ్య

అండమాన్ నికోబార్

154

259

413

ఆంధ్రప్రదేశ్

144

682

826

అరుణాచల్ ప్రదేశ్

393

427

820

అస్సాం

1641

4276

5917

బీహార్

4233

4987

9220

ఛత్తీస్‌గఢ్

663

1376

2039

ఢిల్లీ

2242

1640

3882

గోవా

70

343

413

గుజరాత్

679

2278

2957

హర్యానా

2291

1032

3323

హిమాచల్ ప్రదేశ్

555

413

968

జమ్మూ కాశ్మీర్

3187

4580

7767

జార్ఖండ్

2737

4176

6913

కర్ణాటక

805

1563

2368

కేరళ

983

1082

2065

మధ్యప్రదేశ్

1144

2500

3644

మహారాష్ట్ర

1858

746

2604

మణిపూర్

772

611

1383

మేఘాలయ

1021

1332

2353

నాగాలాండ్

359

467

826

ఒరిస్సా

320

920

1240

పంజాబ్

4350

2821

7171

రాజస్థాన్

1697

1069

2766

తమిళనాడు

1531

1379

2910

తెలంగాణ

3273

2604

5877

త్రిపుర

260

242

502

ఉత్తర ప్రదేశ్

4377

6469

10846

ఉత్తరాఖండ్

590

379

969

పశ్చిమ బెంగాల్

2150

3580

5730

మొత్తం

44,479

54,233

98,712


ఈ సమాచారాన్ని మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
 
****


(Release ID: 2003796) Visitor Counter : 120