నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

24 గంటల పునరుత్పాదక శక్తిని అందించడానికి గ్రీన్ హైడ్రోజన్ వాడకాన్ని ప్రోత్సహించదానికి త్వరలో ప్రభుత్వ విధానం

Posted On: 07 FEB 2024 11:22AM by PIB Hyderabad

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో ప్రతిపాదించిన విధంగా పునరుత్పాదక ఇంధన వాడకాన్ని ఎక్కువ చేయడానికి,   గ్రీన్ హైడ్రోజన్ వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వ  ప్రాధాన్యత కొనసాగించడానికి,24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడానికి  గ్రీన్ హైడ్రోజన్ వాడకాన్ని ప్రోత్సహించడానికి  పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ   విధి విధానాలు రూపొందిస్తోంది.   

24 గంటలూ పునరుత్పాదక ఇంధన సరఫరా  కోసం సౌరశక్తి, పవనశక్తి వంటి ఇతర వనరులతో కలిపి గ్రీన్ హైడ్రోజన్ ను ఉపయోగించే అంశాన్ని పరిశీలించడానికి  2424 ఫిబ్రవరి 6న కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ అధ్యక్షతన న్యూఢిల్లీలో    ఒక సమావేశం జరిగింది. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఎన్టీపీసీ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ కమిషన్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

24 గంటల విద్యుత్ సరఫరా,  గరిష్ట విద్యుత్ డిమాండ్ అవసరాలు తీర్చడానికి  గ్రీన్ హైడ్రోజన్ ను నిల్వ మాధ్యమంగా ఉపయోగించడం లాంటి వివిధ  అంశాలను  అధికారులు వివరంగా చర్చించారు. ఇటువంటి ప్రాజెక్టులకు ప్రభుత్వ సహాయాన్ని అందించడానికి వివిధ విధానాలు రూపొందించే అంశాన్ని  కూడా సమావేశంలో చర్చించారు. మార్కెట్ ధర ,అంగీకరించిన "స్ట్రైక్ ప్రైస్" మధ్య వ్యత్యాసం ఆధారంగా  కాంట్రాక్ట్ ఫర్ డిఫరెన్స్ (సిఎఫ్డి) పద్ధతి ని పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు.  
గ్రీన్ హైడ్రోజన్, విద్యుత్ రంగంలో ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం, ప్రస్తుత, భవిష్యత్ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఈ పథకం మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను, పునరుత్పాదక ఇంధన వ్యయాన్ని తగ్గించి చౌకగా అందించడంలో 24 గంటలూ పునరుత్పాదక శక్తి అవసరం ఉంటుందని  మంత్రి చెప్పారు.

ప్రయోగాత్మకంగా అమలు చేసిన ప్రాజెక్టులు సాధించిన విజయాలు ఆధారంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

***



(Release ID: 2003762) Visitor Counter : 114