ప్రధాన మంత్రి కార్యాలయం

‘వికసిత్ భారత్, వికసిత్ గోవా 2047’ కార్యక్రమం లో భాగం గా 1330 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల కు గోవా లో ప్రారంభం మరియుశంకుస్థాపన లు చేసిన ప్రధాన మంత్రి


నేశనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోవా యొక్క శాశ్వత భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు

నేశనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వాటర్‌స్పోర్ట్‌స్ తాలూకు నూతన కేంపస్ ను దేశ ప్రజల కు అంకితమిచ్చారు

పేసింజర్ రోప్ వే కు, తత్సంబంధి పర్యటక కార్యకలాపాల కు మరియు 100 ఎమ్ఎల్‌డి సామర్థ్యం కలిగిన జలశుద్ధి ప్లాంటు కుశంకుస్థాపన చేశారు

ఒక వంద టిపిడి సామర్థ్యం కలిగిన ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఫెసిలిటీ ని ప్రారంభించారు

రో‌జ్ గార్ మేళా లో భాగం గా వివిధ విభాగాల లో క్రొత్తగా నియామకం జరిగిన 1930 మంది కి నియామకం ఉత్తర్వుల ను అందజేశారు

వేరు వేరు సంక్షేమ పథకాల లబ్ధిదారుల కు మంజూరు లేఖలను ఇచ్చారు

‘‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ తాలూకు అనుభూతి ని గోవా లో ఏ కాలం లో అయినా సరే పొందవచ్చును’’

‘‘డబల్ ఇంజిన్ప్రభుత్వం వల్ల గోవా లో అభివృద్ధి శరవేగం గా ముందుకు సాగిపోతున్నది’’

‘‘ప్రభుత్వ పథకాలలబ్ధి అందరికీ కలగడం అనేది నిజమైన మతేతర వాదం, అదే సిసలైన సామాజిక న్యాయం; మరి ఈ విధానం గోవా కు, ఇంకా దేశాని కి మోదీ ఇచ్చేటటువంటిహామీ గా ఉన్నది’’

‘‘డబల్ ఇంజిన్ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకై రికార్డు స్థాయి లో పెట్టుబడిని పెడుతోంది, దీనితో పాటు పేదల సంక్షేమం కోసం పెద్ద పథకాల నునడుపుతున్నది’’

‘‘మా ప్రభుత్వంగోవా లో కనెక్టివిటీ ని మెరుగు పరచడానికి, గోవా ను ఒక లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దడానికి కూడా పాటుపడుతోంది’’

‘‘భారతదేశం లోఅన్ని రకాలైన పర్యటనలు ‘వన్ కంట్రీ, వన్ వీజా’ ప్రాతిపదిక న లభ్యమవుతున్నాయి’’

Posted On: 06 FEB 2024 4:12PM by PIB Hyderabad

వికసిత్ భారత్, వికసిత్ గోవా 2047’ కార్యక్రమం లో భాగం గా 1330 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోవా లో ఈ రోజు న ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను శ్రీ నరేంద్ర మోదీ పరిశీలించారు. ఈ రోజు న చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల లో విద్య, క్రీడలు, నీటి శుద్ధి ట్రీట్‌మెంట్, వ్యర్థాల నిర్వహణ మరియు పర్యటన రంగాల లో మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడం కూడా చేరి ఉంది. రోజ్ గార్ మేళా లో భాగం గా వివిధ విభాగాల లో క్రొత్త గా ప్రభుత్వ నియామకాలు జరిగినటువంటి 1930 మంది కి నియామక ఉత్తర్వుల ను కూడా ప్రధాన మంత్రి అందజేశారు. ఆయన వేరు వేరు సంక్షేమ పథకాల లబ్ధిదారుల కు మంజూరు లేఖల ను కూడా ప్రదానం చేశారు.

 

ప్రధాన మంత్రి గోవా యొక్క ప్రాకృతిక శోభ మరియు బీచ్ ల ను గురించి ప్రముఖం గా ప్రకటిస్తూ, తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షల కొద్దీ పర్యటకుల కు గోవా అభిమాన పాత్రమైన సెలవు దినాల లో విహారాని కి అనువైన ప్రాంతం గా ఉంది అని ఆయన అన్నారు. ‘‘ ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ను గోవా లో ఏ కాలం లో అయినా సరే అనుభూతి చెందవచ్చును’’ అని ఆయన అభివర్ణించారు. గోవా లో జన్మించినటువంటి మహా మునులు ప్రఖ్యాత కళాకారులు మరియు పండితుల ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భం లో సంత్ సోహిరోబానాథ్ అంబియే గారు, నాటక కర్త శ్రీ కృష్ణ భట్ బండ్‌కర్, గాయని కేసర్‌బాయి కేర్‌కర్ గారు, ఆచార్య ధర్మానంద్ కోసాంబి గారు మరియు రఘునాథ్ అనంత్ మశేల్‌కర్ లను ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు. భారత రత్న లత మంగేశ్‌కర్ గారి కి ప్రధాన మంత్రి ఆమె వర్థంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని స్మర్పించడం తో పాటుగా, దగ్గరలోనే నెలకొన్న మంగోశి దేవాలయం తో ఆమెకు గల సన్నిహిత అనుబంధాన్ని గురించి సైతం ప్రముఖం గా ప్రస్తావించారు. ‘‘స్వామి వివేకానంద్ గారు మార్‌గావో లోని దమోదర్ సాల్ నుండి నూతన ప్రేరణ ను పొందారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రధాన మంత్రి లోహియా మైదాన్ ను గురించి, అలాగే, కూన్‌కోలిమ్ లోని చీఫ్‌టెన్‌స్ మెమోరియల్ ను గురించి కూడా మాట్లాడారు.

 

‘‘గోయిచో సాయిబ్’’ గా ప్రసిద్ధి గాంచిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారి పవిత్ర అవశేషాల వెల్లడి ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఆ ఘటన ఈ సంవత్సరం లో చోటు చేసుకోనుందన్నారు. ఈ పరిణామం శాంతి, మరియు సమగ్రత లకు ఒక ప్రతీక గా ఆయన పేర్కొన్నారు. జార్జియా కు చెందిన సెయింట్ క్వీన్ కేటేవన్ ను గురించి ప్రధాన మంత్రి స్మరించుకొంటూ, ఆమె కు చెందిన పవిత్రమైన అవశేషాల ను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జార్జియా కు తీసుకు వెళ్ళారన్నారు. క్రైస్తవులు మరియు ఇతర సముదాయాల కు చెందిన ప్రజలు శాంతియుతం గా మనుగడ సాగిస్తూ ఉండటం అనేది ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్కు ఒక ఉదాహరణగా ఉంది అని ఆయన అన్నారు.

 

ఈ రోజు న ప్రారంభం జరిగినటువంటి లేదా శంకుస్థాపన పూర్తి అయినటువంటి సుమారు 1300 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఈ ప్రాజెక్టులు విద్య, ఆరోగ్యం మరియు పర్యటన రంగాల కు సంబంధించినవి. ఇది గోవా యొక్క అభివృద్ధి కి నూతన ఉత్తేజాన్ని అందిస్తాయి అన్నారు. నేశనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి శాశ్వత భవన సముదాయం మరియు నేశనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ కు ఒక కేంపస్, ఇంకా ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఫెసిలిటీ లతో పాటు 1930 మంది కి ఉద్యోగ నియామక లేఖల అందజేత.. ఇవి రాష్ట్రం యొక్క అభివృద్ధి ని క్రొత్త శిఖరాల కు చేర్చుతాయి అని ఆయన అన్నారు.

 

‘‘విస్తీర్ణం పరం గా మరియు జనాభా పరం గా గోవా చిన్నదే అయినప్పటికీ, సామాజికం గా వైవిధ్యభరితం అయినటువంటిది గా ఉంది. ఇక్కడ వేరు వేరు సమాజాలు మరియు ధర్మాల ను అవలంభించే ప్రజలు అనేక తరాల తరబడి శాంతియుతం గా మనుగడ సాగిస్తూ వస్తున్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్మంత్రాన్ని గురించి ప్రముఖం గా ప్రకటిస్తూ, రాష్ట్ర సద్భావన కు భంగం కలిగించడాని కి యత్నించిన వారికి ప్రతి సారి ధీటైన జవాబును ఇచ్చినటువంటి గోవా ప్రజల యొక్క స్ఫూర్తి ని ప్రశంసించారు.

 

 

స్వయంపూర్ణ గోవా ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, అభ్యున్నతి తాలూకు పరామితుల లో గోవా ప్రజలు అగ్ర భాగాన నిలచేందుకు కారణమైన గోవా ప్రభుత్వ సుపరిపాలన నమూనా ను ప్రశంసించారు. ‘‘డబల్ ఇంజిన్ ప్రభుత్వం కారణం గా గోవా లో అభివృద్ధి శరవేగం గా ముందుకు కదులుతున్నది’’ అని ఆయన అన్నారు. హర్ ఘర్ నల్ సే జల్’ (‘ప్రతి ఇంటికీ నల్లా నీరు’) అందరికీ చేరువ కావడం, విద్యుత్తు కనెక్శన్ లు, ఎల్‌పిజి లభ్యత, కిరోసిన్ ఉపయోగం నుండి స్వేచ్ఛ, ఆరుబయలు ప్రాంతాల లో మలమూత్రాదుల విసర్జన కు తావు లేకుండా చేయడం, మరి అలాగే, కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేకం లక్షిత లబ్ధిదారులు అందరికీ ఉపయోగపడుతూ ఉండడం వంటి అంశాల ను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘‘సంక్షేమ పథకాలు అందరికీ దక్కినప్పుడు వివక్ష సమసిపోతుంది, ప్రయోజనాలు పూర్తి గా లబ్ధిదారులు అందరికీ అందుతాయి, ఈ కారణం గానే నేను ఏమని చెబుతానంటే, సాచ్యురేశన్ (ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ లభించడం) అనేది నిజమైన మతేతర వాదం, సాచ్యురేశన్ అనేది సిసలైన సామాజిక న్యాయం; సాచ్యురేశన్ అనేది గోవా కు మరియు దేశ ప్రజల కు మోదీ ఇస్తున్న గ్యారంటీ’’ అని ప్రధాన మంత్రి అన్నారు. గోవా లో 30 వేల మంది కి పైగా ప్రజలు వేరు వేరు ప్రయోజనాల ను అందుకొన్నటువంటి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

 

ఈ  సంవత్సరం బడ్జెటు ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అది ప్రభుత్వ పథకాల సాచ్యురేశన్ తాలూకు ప్రభుత్వ సంకల్పాని కి ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిన నాలుగు కోట్ల పక్కా ఇళ్ళ లక్ష్యాని కి తరువాయి గా ప్రస్తుతం పేదల కు రెండు కోట్ల గృహాల ను సమకూర్చడాని కి పూచీ ని ఇస్తున్నది అని ఆయన ప్రకటించారు. పక్కా ఇళ్ళ ను అందుకోవడం లో వెనుకపట్టున మిగిలిపోయిన వారి లో చైతన్యాన్ని ఏర్పరచవలసింది గా గోవా ప్రజల కు ఆయన విజ్ఞప్తి చేశారు. సంవత్సరం బడ్జెటు లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ను మరియు ఆయుష్మాన్ యోజన ను మరింత గా విస్తరించడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.

 

   ఈ ఏడాది బడ్జెట్‌లో మత్స్య సంపద యోజన కేటాయింపుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇది మత్స్యకార సమాజానికి సహాయం అందించడంతోపాటు వనరుల లభ్యతను మరింత పెంచుతుందని చెప్పారు. తద్వారా సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెరిగి, మత్స్యకారుల ఆదాయం కూడా ఇనుమడిస్తుందని తెలిపారు. ఈ దిశగా చేపట్టిన పలు చర్యలతో మత్స్య రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని ఆయన అన్నారు.

   చేపల పెంపకందారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేసిన కృషిని వివరిస్తూ- కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. అలాగే పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యం, బీమా మొత్తం రూ.5 లక్షలకు పెంపు, పడవల ఆధునికీకరణకు సబ్సిడీ తదితరాలు వారికి అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

   ‘‘ద్వంద్వ చోదక ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం భారీ పథకాల అమలుసహా మౌలిక సదుపాయాల కల్పనలో రికార్డుస్థాయి పెట్టుబడులు పెడుతోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు వేగంగా అభివృద్ధి చెందుతుండటాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. పదేళ్ల కిందట మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులు రూ.2 లక్షల కోట్లకన్నా తక్కువని గుర్తుచేశారు. దానితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.11 లక్షల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. దీంతో కొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయని, అభివృద్ధి ప్రాజెక్టుల పనులు సాగుతున్న చోట ప్రతి వ్యక్తికీ ఆదాయంలో పెరుగుదల తప్పక కనిపిస్తుందని చెప్పారు.

   అనుసంధానం పెంపు, గోవాను రవాణా కూడలిగా రూపుదిద్దడం వగైరాలపై ప్రభుత్వ కృషిని వివరిస్తూ- ‘‘గోవాలో అనుసంధానం మెరుగుతోపాటు రాష్ట్రాన్ని రవాణా కూడలిగా తీర్చిదిద్దడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆ మేరకు గోవాలో మనోహర్ పరికర్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం పూర్తయింది. దీంతో జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఇప్పుడు నిరంతరం సాగుతున్నాయి’’ అని తెలిపారు. అలాగే గత సంవత్సరం జాతికి అంకితం చేయబడిన దేశంలోనే అత్యంత పొడవైన ‘న్యూ జువారీ’ రెండో కేబుల్ వంతెన గురించి కూడా ప్రస్తావించారు. కొత్త రోడ్లు, వంతెనలు, రైలు మార్గాలు, విద్యా సంస్థల ఏర్పాటుసహా గోవాలో మౌలిక సదుపాయాలు వేగంగా పెరుగుతున్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘‘ఈ అభివృద్ధి ప్రాజెక్టులతో గోవా వృద్ధి కొత్త శిఖరాలకు చేరుతోంది’’ అని పేర్కొన్నారు.

   భారతదేశ సుసంపన్న సాంస్కృతిక-ప్రాకృతిక వారసత్వం గురించి ప్రధానమంత్రి మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. దేశాన్ని సమగ్ర పర్యాటక కేంద్రంగా రూపొందించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని నొక్కిచెప్పారు. ‘‘మన దేశంలో అనేక స్వరూపాల్లో పర్యాటక రంగం అందుబాటులో ఉంది. ఒకే వీసాతో అన్ని ప్రాంతాలనూ పర్యటించవచ్చు. కానీ, మునుపటి ప్రభుత్వాలకు పర్యాటక ప్రదేశాలు, తీరప్రాంతాలు, ద్వీపాల అభివృద్ధిపై శ్రద్ధ లేదు’’ అన్నారు. గోవా గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ పర్యాటకం సామర్థ్యాన్ని వివరిస్తూ- స్థానికులకు ప్రయోజనం చేకూర్చడంలో భాగంగా గోవాలోని అత్యంత మారుమూల ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని నొక్కిచెప్పారు. గోవాలో పర్యాటక మౌలిక సదుపాయాల పెంచేందుకు చేపట్టిన చర్యల గురించి వెల్లడించారు. ఇందులో భాగంగా ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, వెయిటింగ్ రూములు వంటి ఆధునిక సౌకర్యాల అభివృద్ధితో గోవాను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చామని పేర్కొన్నారు.

   ‘‘కాన్ఫరెన్స్ టూరిజం కూడలిగా గోవాను రూపుదిద్దడంపై ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఇక్కడ ప్రారంభమైన ‘ఇండియా ఎనర్జీ వీక్-2024’ గురించి ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా గోవాలో జి-20 సంబంధిత అనేక కీలక సదస్సులు, భారీస్థాయి దౌత్య సమావేశాలు వంటివాటిని ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. అలాగే వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్, వరల్డ్ బీచ్ వాలీబాల్ టూర్, ఫిఫా అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్, 37వ జాతీయ క్రీడలు వంటి టోర్నమెంట్లు ఇక్కడ నిర్వహించబడ్డాయని గుర్తుచేశారు. రాబోయే సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమాలకు గోవా కీలక కేంద్రం కాగలదని ఆయన హామీ ఇచ్చారు.

   ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధిలో గోవాలో పోషిస్తున్న పాత్రను ప్రధాని ప్రశంసించారు. ఈ మేరకు అమూల్య కృషి చేసిన కి బ్రహ్మానంద్ శంఖ్వాల్కర్‌ను పద్మ అవార్డుతో ఆయన సత్కరించారు. ఇక్కడి క్రీడాకారులు తమ కలలు సాకారం చేసుకోవడంలో రాష్ట్రంలో జాతీయ క్రీడల కోసం అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలు ఎంతగానో దోహదం చేయగలవని ప్రధాని చెప్పారు.

   అలాగే విద్యారంగంపై ప్రభుత్వ శ్రద్ధను వివరిస్తూ- గోవాలో అనేక ఉన్నత విద్యా సంస్థలను స్థాపించినట్లు ప్రధాని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రం ఒక ప్రధాన విద్యా కేంద్రంగా మారిందని తెలిపారు. సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడానికి, యువత సహా పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పరిశోధన-ఆవిష్కరణల కోసం రూ.1 లక్ష కోట్లతో నిధిని బ‌డ్జెట్‌లో ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.

   చివరగా- గోవా వేగంగా పురోగమించేలా చేపట్టిన సమష్టి చర్యలను ప్రధానమంత్రి వివరించారు. ప్రభుత్వ కృషితోపాటు ప్రతి ఒక్కరూ తోడ్పాటునివ్వాలని, తద్వారా రాష్ట్రం శరవేగంగా పురోగమించగలదని చెబుతూ ఆయన తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ శ్రీ పి.ఎస్.శ్రీధరన్ పిళ్ళై, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్, కేంద్ర పర్యాటక-ఓడరేవులు-షిప్పింగ్-జలమార్గాల శాఖ మంత్రి శ్రీ శ్రీపాద యశోనాయక్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాశ్వత ప్రాంగణాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ కొత్త ప్రాంగణంలో ట్యుటోరియల్, డిపార్ట్‌ మెంటల్, సెమినార్, అడ్మినిస్ట్రేటివ్, హాస్టల్స్, హెల్త్ సెంటర్, స్టాఫ్ క్వార్టర్స్, ఫెమిటీ సెంటర్ భవన సముదాయాలున్నాయి. అలాగే ఆట మైదానంతోపాటు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అవసరాలు తీర్చడానికి కావాల్సిన ఇతర సౌకర్యాలు కల్పించబడ్డాయి.

   ఈ పర్యటన సందర్భంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్‌స్పోర్ట్స్ కొత్త ప్రాంగణాన్ని కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. ఇక్కడ వాటర్‌స్పోర్ట్స్, వాటర్ రెస్క్యూ కార్యకలాపాల అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో 28 అనువైన కోర్సులను ప్రవేశపెడుతున్నారు. కాగా, దక్షిణ గోవాలో ప్రధానమంత్రి 100 టిపిడి ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంటును కూడా ప్రారంభించారు. ఇది 60 టిపిడి తడి వ్యర్థాలతోపాటు 40 టిపిడి పొడి వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయగలదు. అంతేకాకుండా 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా అదనపు విద్యుత్తును ఉత్పత్తి అవుతుంది.

   పణజి, రీస్ మాగోస్‌లను అనుసంధానించే అనుబంధ పర్యాటక కార్యకలాపాలతో పాటు ప్రయాణిక  రోప్‌వేకి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే దక్షిణ గోవాలో 100 ఎంఎల్‌డి నీటిశుద్ధి కర్మాగారం నిర్మాణానికి పునాది వేశారు. అంతేకాకుండా ఉపాధి సమ్మేళనం కింద ఆయన వివిధ ప్రభుత్వ విభాగాల కోసం ఎంపిక చేసిన 1930 కొత్త అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. వీటితోపాటు వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు లేఖలను కూడా ప్రదానం చేశారు.

 

 

***

DS/TS



(Release ID: 2003371) Visitor Counter : 59