రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అరుణాచల్‌ప్రదేశ్‌లో సార్లి-హురి సెక్షన్‌ను కలుపుతూ ప్యాకేజీ-1 నిర్మాణానికి రూ.626.92 కోట్లు మంజూరు చేసిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 06 FEB 2024 3:20PM by PIB Hyderabad

అరుణాచల్‌ప్రదేశ్‌ ఎన్‌హెచ్‌-913లోని (ఫ్రాంటియర్ హైవే) సార్లి-హురి సెక్షన్‌ను కలుపుతూ ప్యాకేజీ-1 నిర్మాణానికి రూ. 626.92 కోట్లను కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మంజూరు చేశారు.

ఈ విషయం గురించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న శ్రీ గడ్కరీ, కురుంగ్ కుమే జిల్లాలో ఈపీసీ పద్ధతిలో నిర్మించే 35 కి.మీ. పొడవైన ఈ రహదారి వల్ల అంతరాయం లేని, సురక్షితమైన వాహన రాకపోకలు సాధ్యమవుతాయని వివరించారు. అంతేకాదు, వాతావరణంతో సంబంధం లేకుండా ఆ ప్రాంతంలోని గ్రామాలకు ఏడాది పొడవునా అనుసంధానతను ఏర్పరుస్తుంది, కురుంగ్ కుమే జిల్లాలోని కొండ ప్రాంతాల్లో సామాజిక-ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని వెల్లడించారు.

***


(Release ID: 2003367) Visitor Counter : 95