వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
5 మసాలా దినుసుల నాణ్యతా ప్రమాణాలు ఖరారు ఖరారు చేసిన కొచ్చిలో జరిగిన సుగంధ ద్రవ్యాలు, వంటల్లో ఉపయోగించే మూలికలపై ఏర్పాటైన కోడెక్స్ కమిటీ 7 వ సమావేశం
సమావేశానికి హాజరైన 31 దేశాలకు చెందిన ప్రతినిధులు
Posted On:
03 FEB 2024 12:55PM by PIB Hyderabad
సుగంధ ద్రవ్యాలు, వంటల్లో ఉపయోగించే మూలికలపై ఏర్పాటైన కోడెక్స్ కమిటీ (సిసిఎస్ హెచ్) 7 వ సమావేశం 2024 జనవరి 29 నుంచి 2024 ఫిబ్రవరి 2 వరకు కొచ్చిలో జరిగింది. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత భౌతికంగా జరిగిన సిసిఎస్ హెచ్ సమావేశంలో 31 దేశాలకు చెందిన 109 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సిసిఎస్ హెచ్ సమావేశంలో సభ్య దేశాలు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాయి. చిన్న యాలకులు, పసుపు, నల్ల మిరియాలు, పచ్చి బిర్యానీ ఆకు, అనాస పువ్వు వంటి 5 మసాలా దినుసుల నాణ్యత ప్రమాణాలను ఖరారు చేశారు. ఖరారు చేసిన ప్రమాణాలు అమలు చేయాలని సిఫార్సు చేస్తూ కోడెక్స్ అలిమెంటరియస్ కమిషన్ (సీఏసీ)కు సిసిఎస్ హెచ్ తీర్మానం పంపింది. 8వ దశలో ప్రమాణాలు అమలు లోకి వస్తాయి.
తొలిసారిగా సుగంధ ద్రవ్యాల సమూహీకరణ వ్యూహాన్ని సిసిఎస్ హెచ్ సమావేశం ఆమోదించింది. నల్ల మిరియాలు, పచ్చి బిర్యానీ ఆకు, అనాస పువ్వు ను ఒక తరగతిగా గుర్తించాలని సమావేశం నిర్ణయించింది.మరాఠీ మొగ్గ ముసాయిదా ప్రమాణం 5 వ దశకు చేరుకుంది. ఈ అంశం కమిటీ తదుపరి సమావేశంలో చర్చకు తీసుకునే ముందు సభ్య దేశాలు మరో సారి ప్రతిపాదనను పరిశీలిస్తాయి.
ఎండిన కొత్తిమీర విత్తనాలు, పెద్ద యాలకులు,మరువము దాల్చిన చెక్క లకు సం కోడెక్స్ ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి అందిన ప్రతిపాదనలను కమిటీ పరిశీలించి ఆమోదించింది. ఈ కమిటీ తదుపరి సమావేశంలో ఈ నాలుగు సుగంధ ద్రవ్యాల ముసాయిదా ప్రమాణాలను రూపొందిస్తారు.
లాటిన్ అమెరికా దేశాలకు చెందిన ప్రతినిధులు సిసిఎస్ హెచ్ సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
18 నెలల తర్వాత కమిటీ మరోసారి సమావేశం అవుతుంది.
ఈ మధ్యకాలంలో వివిధ దేశాల నేతృత్వంలోని ఎలక్ట్రానిక్ వర్కింగ్ గ్రూపులు (ఈడబ్ల్యూజీలు) సైన్స్ ఆధారిత ఆధారాలపై ఆధారపడి ప్రమాణాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తాయి.
ఎఫ్ఏఓ, డబ్ల్యూహెచ్ఓ సంయుక్తంగా స్థాపించిన కోడెక్స్ అలిమెంటరియస్ కమిషన్ (సిఎసి)లో 194 కి పైగా దేశాలు సభ్యత్వం పొందాయి. అంతర్జాతీయ, అంతర్ ప్రభుత్వ సంస్థగా పనిచేస్తున్న కోడెక్స్ అలిమెంటరియస్ కమిషన్ ప్రధాన కేంద్రం రోమ్ లో ఉంది. ఆహార పదార్థాలకు అంతర్జాతీయంగా ఆమోదించబడిన ప్రమాణాలను రూపొందించే ప్రక్రియను కోడెక్స్ అలిమెంటరియస్ కమిషన్ అమలు చేస్తోంది.
వివిధ సభ్య దేశాలు ఆతిథ్యం ఇచ్చే సిసిఎస్ హెచ్ తో సహా వివిధ కోడెక్స్ కమిటీల ద్వారా కోడెక్స్ అలిమెంటరియస్ కమిషన్ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
సుగంధ ద్రవ్యాలు, వంటల్లో ఉపయోగించే మూలికలపై కోడెక్స్ కమిటీ (సిసిఎస్ హెచ్) 2013 లో కోడెక్స్ అలిమెంటరియస్ కమిషన్ (సిఎసి) భాగంగా ఏర్పాటయింది. భారతదేశం మొదటి నుండి ఈ ప్రతిష్టాత్మక కమిటీకి ఆతిథ్యం ఇస్తోంది. స్పైసెస్ బోర్డ్ ఇండియా కమిటీ సమావేశాలు నిర్వహించే సెక్రటేరియట్ గా పనిచేస్తుంది.
ఆహార భద్రత, వినియోగదారుల రక్షణకు సంబంధించిన వాణిజ్య వివాదాల పరిష్కారానికి సీఏసీ ప్రమాణాలను డబ్ల్యూటీవో అంతర్జాతీయ రిఫరెన్స్ పాయింట్లుగా గుర్తించింది. సిసిఎస్ హెచ్ తో సహా సిఎసి కింద కమిటీలు అభివృద్ధి చేసిన ప్రమాణాలు స్వచ్ఛంద స్వభావాన్ని కలిగి ఉంటాయి, వీటిని సిఎసిలోని సభ్య దేశాలు తమ జాతీయ ప్రమాణాలను సమతుల్యం చేయడానికి రిఫరెన్స్ ప్రమాణాలుగా ఉపయోగిస్తాయి.ఈ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రమాణాల సమన్వయానికి దోహదం చేస్తాయి, ఆహారంలో న్యాయమైన ప్రపంచ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి ప్రపంచ వినియోగదారుల ఆరోగ్యాన్ని రక్షించడానికి ఆహార భద్రతను పెంచుతాయి.
***
(Release ID: 2002447)
Visitor Counter : 136