ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించే నాలుగు ప్రధాన కులాలు 'గరీబ్' (పేదలు), 'మహిళాయన్' (మహిళలు), 'యువ' (యువత), 'అన్నదాత' (రైతులు): కేంద్ర ఆర్థిక మంత్రి


"సామాజిక న్యాయం అనేది ఒక ప్రభావవంతమైన, అవసరమైన పాలన నమూనా"

వికసిత్ భారత్ అంటే ప్రజల సామర్థ్యాన్ని, సాధికారతను మెరుగుపరచడమే: కేంద్ర ఆర్థిక మంత్రి

Posted On: 01 FEB 2024 12:39PM by PIB Hyderabad

గౌరవనీయ ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, నాలుగు ప్రధాన కులాలు 'గరీబ్' (పేదలు), 'మహిళాయన్' (మహిళలు), 'యువ' (యువత), 'అన్నదాత'లపై (రైతులు) దృష్టి పెట్టిందని, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మల సీతారామన్‌ చెప్పారు. ఈ రోజు పార్లమెంట్‌లో, 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టారు. "ఆ నాలుగు వర్గాల అవసరాలు, ఆకాంక్షలు, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తాం. వారు అభివృద్ధి చెందుతున్నప్పుడే దేశం పురోగమిస్తుంది. తమ జీవితాలను మెరుగుపరుచుకునేందుకు ఆ నలుగురు చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వ మద్దతు అందుతుంది. వారి సాధికారత, శ్రేయస్సు దేశాన్ని ముందుకు నడిపిస్తుంది” అని ఆర్థిక మంత్రి చెప్పారు.

 

సామాజిక న్యాయం అనేది ప్రభావవంతమైన, అవసరమైన పాలన నమూనా అని నిర్మలా సీతారామన్ చెప్పారు. అవినీతికి అడ్డుకట్ట వేయడం ద్వారా పారదర్శకతతో పాటు, ప్రయోజనాలను అర్హులందరికీ అందించామని అన్నారు. ‘ప్రత్యక్ష ప్రయోజన బదిలీ’ని దీనికి ఉదాహరణగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దృష్టి ఫలితాలపైనే ఉంటుంది తప్ప ఖర్చులపై కాదని స్పష్టం చేశారు.

భారతదేశాన్ని 2047 నాటికి  ‘వికసిత్‌ భారత్‌’గా మార్చేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి విధానాల కోసం అందరినీ కలుపుకుపోయే పద్ధతిని అనుసరిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజల సామర్థ్యాన్ని మెరుగుపరచాలి, సాధికారత కల్పించాలని ఆమె అన్నారు.

 

***



(Release ID: 2001341) Visitor Counter : 121