ఆర్థిక మంత్రిత్వ శాఖ

2023-24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ వరకు కేంద్ర ప్రభుత్వ ఖాతాల నెలవారీ సమీక్ష

Posted On: 31 JAN 2024 6:11PM by PIB Hyderabad

2023-24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వ నెలవారీ ఆదాయ, వ్యయాల ఖాతాల్లో ముఖ్యాంశాలు:

2023 డిసెంబర్‌ వరకు భారత ప్రభుత్వానికి ₹20,71,939 కోట్ల (మొత్తం రసీదుల్లో బీఈ 2023-24లో 76.3%) ఆదాయం వచ్చింది. ఇందులో, ₹17,29,931 కోట్ల పన్ను ఆదాయం (నికరం), ₹3,12,358 కోట్ల పన్నుయేతర ఆదాయం, ₹29,650 కోట్ల రుణేతర మూలధన రశీదులు ఉన్నాయి. రుణేతర మూలధన రసీదుల్లో ₹19,597 కోట్ల రుణాల వసూళ్లు, రూ.10,053 కోట్ల ఇతర మూలధన రసీదులు ఉన్నాయి. సమీక్ష కాలం వరకు, పన్నుల వాటా రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ₹7,47,288 కోట్లను భారత ప్రభుత్వం బదిలీ చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలం కంటే ఇది ₹1,37,851 కోట్లు ఎక్కువ.

భారత ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయం ₹30,54,217 కోట్లు (సంబంధిత బీఈ 2023-24లో 67.8%). ఇందులో ₹23,80,587 కోట్లు రెవెన్యూ ఖాతాలో, ₹6,73,630 కోట్లు మూలధన ఖాతాలో వ్యయమయ్యాయి. మొత్తం రెవెన్యూ వ్యయంలో ₹7,48,207 కోట్లు వడ్డీ చెల్లింపుల కోసం, ₹2,76,804 కోట్లు ప్రధాన రాయితీల కోసం ఖర్చు చేయడం జరిగింది.

***



(Release ID: 2001134) Visitor Counter : 236