రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సోమాలియా సముద్ర దొంగల బారి నుంచి 19 మంది పాకిస్తాన్ జాతీయులను రక్షించిన భారత నౌకా దళం


2వ సారి విజయవంతంగా రక్షణ కార్యక్రమాలు నిర్వహించిన ఐఎన్ఎస్ సుమిత్ర

Posted On: 30 JAN 2024 9:34AM by PIB Hyderabad

సముద్ర దొంగల బారి నుంచి  ఇరాన్ కు చెందిన మత్స్యకార ఓడ ఇమాన్ ను రక్షించిన భారత నౌకా దళానికి చెందిన  ఐఎన్ఎస్ సుమిత్ర మరోసారి రంగంలోకి దిగి సోమాలియా తూర్పు తీరంలో పాకిస్తాన్ కు చెందిన మత్స్యకార ఓడ ఇమాన్ ను,దానిలో పనిచేస్తున్న 19 మంది పాకిస్తాన్ జాతీయులను రక్షించింది. 

తూర్పు  సోమాలియా, గల్ఫ్ ఆఫ్ అడెన్  ప్రాంతంలో తీవ్రవాద కార్యక్రమాలు నిరోధించి, సముద్ర జలాల్లో రక్షణ చర్యలు చేపట్టడానికి భారత నౌకాదళం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆఫ్ షోర్  పెట్రోలింగ్ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర ను  మోహరించింది. జనవరి 28న పీఎం 28న ఇరాన్ కు చెందిన మత్స్యకార ఓడ (ఎఫ్ వీ) ని  ఇమాన్ ను  సముద్రపు దొంగలు హైజాక్ చేసి సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారని ఐఎన్ఎస్ సుమిత్ర కు అత్యవసర సందేశం అందింది. దీనికి స్పందించిన ఐఎన్ఎస్ సుమిత్ర రంగంలోకి దిగి  మత్స్యకార ఓడ ఇమాన్ ను అడ్డుకుంది.  ఎస్ఓపిలు , హెచ్చరికల ద్వారా నౌకను, నౌకలో పనిచేస్తున్న సిబ్బందిని (17 ఇరానియన్ జాతీయులు) జనవరి 29 తెల్లవారుజామున సురక్షితంగా రక్షించింది. నౌకను తనిఖీ చేసిన అనంతరం ప్రయాణం కొనసాగించడానికి అనుమతించారు. . ఎఫ్వీ ఇమాన్ను శానిటైజ్ చేసి డిశ్చార్జ్ చేశారు.

తాజాగా  ఐఎన్ఎస్ సుమిత్రకు  ఇరాన్ కు చెందిన మరో ఫిషింగ్ నౌక అల్ నయీమ్ ని సముద్ర దొంగలు స్వాధీనం చేసుకుని దానిలో పనిచేస్తున్న  సిబ్బంది (19 మంది పాకిస్తానీ జాతీయులు) ని బందీలుగా తీసుకున్నట్టు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన ఐఎన్ఎస్ సుమిత్ర అత్యంత వేగంగా స్పందించింది. హైజాక్ అయిన నౌకను   జనవరి 29న ఐఎన్ఎస్ సుమిత్ర  అడ్డుకుంది.  ఎస్ఓపిలు , హెచ్చరికలు జారీ చేసి  సమర్థవంతమైన మోహరింపు ద్వారా సిబ్బందిని, నౌకను దొగల బారి నుంచి రక్షించింది. ఇరాన్ కు చెందిన నౌకలోకి ప్రవేశించిన   ఐఎన్ఎస్ సుమిత్ర సిబ్బంది   సోమాలియా సముద్రపు దొంగల చెర నుంచి బయటపడిన   సిబ్బంది యోగక్షేమాలను తెలుసుకునేందుకు,నౌక పరిస్థితి తెలుసు కున్నారు.  

36 గంటల కంటే తక్కువ సమయంలో ఐఎన్ఎస్ సుమిత్ర చేపట్టిన  వేగవంతమైన, నిరంతర , అలుపెరగని ప్రయత్నాల ద్వారా  కొచ్చికి పశ్చిమాన సుమారు 850 నానోమీటర్ల దూరంలో దక్షిణ అరేబియా సముద్రంలో హైజాక్ అయిన  రెండు ఫిషింగ్ నౌకలకు  (17 మంది ఇరాన్ జాతీయులు  19 పాకిస్తాన్ జాతీయాలు ) సండ్ర దొంగల నుంచి విముక్తి కలిగింది.  వాణిజ్య నౌకలపై దాడి చేయడానికి హైజాక్ చేసిన రెండు నౌకలను ఉపయోగించడానికి జరిగిన ప్రయత్నాలను ఐఎన్ఎస్ సుమిత్ర, భగ్నం చేసింది. 

సముద్రంలో నావికులు, నౌకల భద్రతను నిర్ధారించడానికి అన్ని సముద్ర ముప్పులకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి భారత నావికాదళం ఈ ప్రాంతంలో తన నిబద్ధతను మరోసారి నిరూపించింది.

 

 

***



(Release ID: 2000537) Visitor Counter : 141