యు పి ఎస్ సి
ఐఈఎస్, ఐఎస్‌ఎస్ పరీక్ష 2023 తుది ఫలితాలు వెల్లడి
Posted On:
25 JAN 2024 11:35AM by PIB Hyderabad
గత ఏడాది జూన్ 23-25 తేదీల్లో నిర్వహించిన ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ 2023 రాత పరీక్ష ఫలితాలు & డిసెంబర్ 18-21 తేదీల్లో నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.
ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నివేదించిన ఖాళీల సంఖ్య ఇది:
సర్వీస్
|
జనరల్
|
ఈడబ్ల్యూఎస్
|
ఓబీసీ
|
ఎస్సీ
|
ఎస్టీ
|
మొత్తం
|
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్
|
07
|
03
|
05
|
03
|
00
|
18
[01 పీడబ్ల్యూబీడీ-1తో కలిపి]
|
ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్
|
14
|
04
|
10
|
05
|
02
|
35
[01 పీడబ్ల్యూబీడీ-4&5తో కలిపి]
|
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్‌లో నియామకం కోసం సిఫార్సు చేసిన అభ్యర్థుల సంఖ్య ఇది:
సర్వీస్
|
జనరల్
|
ఈడబ్ల్యూఎస్
|
ఓబీసీ
|
ఎస్సీ
|
ఎస్టీ
|
మొత్తం
|
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్
|
07
[Inc.01 PwBD-1]
|
03
|
05
|
03
|
00
|
18
[01 పీడబ్ల్యూబీడీ-1తో కలిపి]
|
ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్
|
07
|
06
|
13
|
05
|
02
|
33*
|
* పీడబ్ల్యూబీడీ-4 & 5 అభ్యర్థులు అందుబాటులో లేనందున, జనరల్ విభాగంలో 01 ఉద్యోగాన్ని ఖాళీగా ఉంచారు.
ప్రస్తుత నియమాలు, అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యకు అనుగుణంగా నియామకాలు జరుగుతాయి.
ఈ కింది రోల్ నంబర్లు ఉన్న అభ్యర్థుల సిఫార్సు తాత్కాలికం:
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (03)
ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (04)
0670085
|
0871179
|
2670013
|
2670214
|
|
|
ఐఎస్‌ఎస్ పరీక్ష 2023లో ముగ్గురు అభ్యర్థుల ఫలితాలను సీల్డ్ కవర్‌లో ఉంచారు. దానికి కారణాలు:
ఎ. న్యూదిల్లీలోని క్యాట్ ప్రిన్సిపల్ బెంచ్ ఎదుట ఉన్న కేసు ఏవో నం. 4161/2023 తీర్పునకు లోబడి ఒక అభ్యర్థి ఫలితాన్ని సీల్డ్ కవర్‌లో ఉంచారు.
బి. న్యూదిల్లీలోని క్యాట్ ప్రిన్సిపల్ బెంచ్ ఎదుట ఉన్న కేసు ఏవో నం. 4113/2023 తీర్పునకు లోబడి ఒక ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి ఫలితాన్ని సీల్డ్ కవర్‌లో ఉంచారు.
సి. న్యూదిల్లీలోని క్యాట్ ప్రిన్సిపల్ బెంచ్ ఎదుట ఉన్న కేసు ఏవో నం. 4174/2023 తీర్పునకు లోబడి ఒక ఓబీసీ అభ్యర్థి ఫలితాన్ని సీల్డ్ కవర్‌లో ఉంచారు.
అభ్యర్థుల అసలు ధృవపత్రాలను కమిషన్ పరిశీలించే వరకు, తాత్కాలిక స్థితిలో ఉన్న అభ్యర్థులకు నియామక పత్రం జారీ చేయరు. తుది ఫలితం ప్రకటించిన తేదీ నుంచి మూడు నెలల వరకు మాత్రమే ఆ అభ్యర్థుల తాత్కాలిక స్థితి చెల్లుబాటు అవుతుంది. ఆ గడువులోగా కమిషన్ కోరిన అవసరమైన పత్రాలను అభ్యర్థి సమర్పించాలి. ఇందులో విఫలమైతే ఆ వ్యక్తి అభ్యర్థిత్వం రద్దవుతుంది. ఈ విషయంలో తదుపరి సంప్రదింపులకు తావుండదు.
యూపీఎస్‌సీ ప్రాంగణంలోని పరీక్ష కేంద్రానికి సమీపంలో 'సహాయక కేంద్రం' ఉంది. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉన్నా, సమాచారం కోసమైనా పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నేరుగా వచ్చిగానీ, 011-23385271, 23381125 టెలిఫోన్ నంబర్లకు కాల్ చేసి గానీ సమాధానాలు పొందొచ్చు. ఈ ఫలితాలు యూపీఎస్‌సీ వెబ్‌సైట్ www.upsc.gov.inలో కూడా అందుబాటులో ఉంటాయి. ఫలితాల ప్రచురణ తేదీ నుంచి 15 రోజుల్లోగా అభ్యర్థుల మార్కులను వెబ్‌సైట్‌లో ఉంచడం జరుగుతుంది.
ఐఈఎస్ తుది ఫలితం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐఎస్‌ఎస్ తుది ఫలితం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***
(Release ID: 1999527)
Visitor Counter : 121