ప్రధాన మంత్రి కార్యాలయం

మేఘాలయ లోని రీ భోయీ నివాసి అయిన సిల్మే మరాక్ గారి తో‘మీ పల్లె లో మీరే మోదీ’ అని పలికిన ప్రధాన మంత్రి

Posted On: 18 JAN 2024 3:47PM by PIB Hyderabad

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రయొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా భేటీ అయ్యి, వారితో మాట్లాడారు. ఈ కార్యక్రమం లో దేశవ్యాప్తం గా వేల కొద్దీ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రతాలూకు లబ్ధిదారులు పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, విధాన సభ లతో పాటు స్థానిక ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

మేఘాలయ లోని రీ భోయీ అనే ఊరి లో ఉంటున్న సిల్మే మరాక్ గారు తాను నడుపుతున్న ఒక చిన్న దుకాణం స్థాయి నుండి ఒక స్వయం సహాయ సమూహం (ఎస్‌హెచ్‌జి) స్థాయి కి వృద్ధి చెందడం తో ఆమె యొక్క జీవనం మేలు మలుపు తిరిగింది. ప్రస్తుతం ఆమె స్థానిక మహిళల కు స్వయం సహాయ సమూహాల ను ఏర్పాటు చేసుకోవడం లో సాయ పడుతున్నారు. మరి, 50 కి పైగా స్వయం సహాయ సమూహాల ఏర్పాటు లో తన వంతు సాయాన్ని అందించారు. ఆమె పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి, బీమా, ఇతర పథకాల లబ్ధిదారుల లో ఒకరు గా ఉన్నారు.

సిల్మే గారు ఇటీవల తన కార్య విస్తరణ కోసం ఒక స్కూటీ ని కొనుగోలు చేశారు. ఆమె తన బ్లాకు పరిధి లో వినియోగదారుల సేవా కేంద్రాన్ని కూడా నడుపుతూ, ప్రభుత్వ పథకాల ను అందుకోవడం లో ప్రజల కు సాయపడుతున్నారు. ఆమెకు చెందిన సమూహం ఫూడ్ ప్రాసెసింగ్ లోను, బేకరీ నిర్వహణ లోను చురుకు గా పని చేస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ప్రధాన మంత్రి ఆమె గౌరవార్థం చప్పట్లు చరిచారు.

ప్రభుత్వ పథకాల పట్ల సిల్మే గారి కి ఉన్న వ్యావహారిక అనుభవాన్ని మరియు హిందీ భాష మీద ఆమె కు ఉన్న పట్టు ను ప్రధాన మంత్రి గుర్తించి, ‘‘మీరు చాలా చక్కగా, బహుశా నా కంటే కూడా మెరుగ్గా మాట్లాడుతున్నారు’’ అన్నారు. సామాజిక సేవ పట్ల ఆమె తీసుకొంటున్న శ్రద్ధ ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ‘‘మీ వంటి వ్యక్తుల యొక్క సమర్పణ భావమే ప్రభుత్వ పథకాల ప్రయోజనాల ను ప్రతి ఒక్క పౌరుని కి/ప్రతి ఒక్క పౌరురాలి కి చేరవేయాలి అన్న మా సంకల్పాని కి శక్తి ని ప్రసాదిస్తున్నది. మీ వంటి వారి వల్ల నా పని చాలా సులువయిపోతోంది. ‘మీ పల్లె లో మీరే మోదీ’ ’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

***



(Release ID: 1997519) Visitor Counter : 125