ప్రధాన మంత్రి కార్యాలయం
హరియాణా రైతు కు అండగా నిలచిన పిఎమ్ కిసాన్ సమ్మాన్నిధి
Posted On:
18 JAN 2024 3:46PM by PIB Hyderabad
‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా భేటీ అయ్యి, వారితో మాట్లాడారు. ఈ కార్యక్రమం లో దేశవ్యాప్తం గా వేల కొద్దీ ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ తాలూకు లబ్ధిదారులు పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, విధాన సభ లతో పాటు స్థానిక ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
హరియాణా లోని రోహ్‌తక్ కు చెందిన రైతు శ్రీ సందీప్ పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి తాలూకు లబ్ధిదారుల లో ఒకరు. ఆయన 11 మంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబం లో ఒక సభ్యుడు.
డబ్బులు వారి ఖాతా ల లో నేరు గా జమ అవుతున్న సంగతి తెలియని వ్యక్తులు ఉన్నారన్న విషయాన్ని గురించి ప్రధాన మంత్రి తాను సమావేశం అయిన జన సమూహాని కి వివరించారు. అటువంటి వ్యక్తుల కు వారికి అందే సహాయాన్ని గురించి తెలియ జేయడం జరిగింది. సమ్మాన్ నిధి రూపం లో స్వీకరిస్తున్న నగదు ఎరువుల ను, విత్తనాల ను కొనుక్కోవడం లో ఉపయోగపడుతోందని, వ్యవసాయం చేయడం లో ఈ డబ్బు సాయపడుతోందని ప్రధాన మంత్రి తో శ్రీ సందీప్ చెప్పారు.
ఆహార పదార్థాల పంపిణీ సాఫీ గా సాగుతున్నట్లు ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు రావడమైంది. హరియాణా ముఖ్యమంత్రి ఈ పథకాన్ని తు.చ. తప్పక అమలు చేస్తున్నారని ప్రధాన మంత్రి గమనించారు. ‘మోదీ కీ గ్యారంటీ కీ గాడీ’ కి(‘మోదీ ఇస్తున్న హామీ తాలూకు వాహనాని’కి) ని ఊరి లో ఉత్సాహం గా స్వాగతం పలకడం జరిగింది.
సభా స్థలి కి మహిళ లు పెద్ద సంఖ్య లో తరలి రావడాన్ని శ్రీ నరేంద్ర మోదీ గమనించి, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాని కి వారు వారి యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
**
(Release ID: 1997516)
Visitor Counter : 138
Read this release in:
Assamese
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam