రైల్వే మంత్రిత్వ శాఖ
లిఫ్ట్‌లు లేదా ఎస్కలేటర్‌లను ఏర్పాటు చేయడం ద్వారా 597 రైల్వే స్టేషన్లు దివ్యాంగులకు ఉపయోగకరంగా మార్చబడ్డాయి
372 స్టేషన్లలో మొత్తం 1287 ఎస్కలేటర్లు డిసెంబర్ 2023 వరకు ఏర్పాటు చేయబడ్డాయి
డిసెంబర్ 2023 వరకు 497 స్టేషన్లలో మొత్తం 1292 లిఫ్టులు ఏర్పాటు చేయబడ్డాయి
Posted On:
17 JAN 2024 4:06PM by PIB Hyderabad
"సుగమ్య భారత్ మిషన్" లేదా భారత ప్రభుత్వ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్‌లో భాగంగా భారతీయ రైల్వే... స్టేషన్‌లు మరియు రైళ్లను దివ్యాంగులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తోంది. రైల్వే స్టేషన్లలో దివ్యాంగుల కోసం సౌకర్యాల మెరుగుదల/పెంపుదల నిరంతర ప్రక్రియ. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మరియు దివ్యాంగులు సులభంగా రాకపోకలు సాగించడానికి వీలుగా ప్రధాన రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫారమ్‌లకు చేరుకోవడానికి మరియు కదలిక సౌలభ్యం కోసం ‘సుగమ్య భారత్ అభియాన్’లో భాగంగా లిఫ్ట్‌లు/ఎస్కలేటర్లు ఏర్పాటు చేయబడుతున్నాయి.
లిఫ్టులు లేదా ఎస్కలేటర్లు అందించబడిన స్టేషన్లు మొత్తం 597 ఉన్నాయి.
ఎస్కలేటర్ల పరిస్థితి:
ఏర్పాటు చేయబడ్డవి (సంఖ్యలో)
వ్యాఖ్యలు
మార్చి 2014 వరకు ఏర్పాటు చేయబడ్డవి
143
372 స్టేషన్లలో మొత్తం 1287 ఎస్కలేటర్లు అందించబడ్డాయి
2014 నుండి 23 వరకూ ఏర్పాటు చేయబడ్డవి
1144
మొత్తం
1287
2023 క్యాలెండర్ సంవత్సరంలో 128 ఎస్కలేటర్లు అందించబడ్డాయి.
లిఫ్ట్‌ల స్థితి:
|
ఏర్పాటు చేసినవి (సంఖ్యలో) |
వ్యాఖ్యలు
|
మార్చి 2014 వరకు ఏర్పాటు చేసినవి
|
97
|
497 స్టేషన్లలో మొత్తం 1292 లిఫ్టులు ఏర్పాటు చేయబడ్డాయి
|
2014 నుండి 23 వరకూ ఏర్పాటు చేయబడ్డవి
|
1195
|
మొత్తం
|
1292
|
2023 క్యాలెండర్ సంవత్సరంలో 227 లిఫ్టులు ఏర్పాటు చేయబడ్డాయి.
భారతీయ రైల్వే వివిధ స్టేషన్లలో ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌ల వద్ద ఎస్కలేటర్‌లు మరియు లిఫ్ట్‌లను ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణీకుల నిష్క్రమణ/ప్రవేశం మెరుగుపడుతుంది మరియు ప్రయాణీకుల భద్రతను మెరుగుపరచడానికి ఇది తదుపరి దశ.
***
(Release ID: 1997022)
Visitor Counter : 211