సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
అనుభవ్ అవార్డుల పథకం, 2024
అనుభవ్ పోర్టల్‌పై రచనలు సమర్పించటానికి ఆఖరు తేదీ 31 మార్చి 2024, అనుభవ్ పోర్టల్‌పై తమ రచనలను సమర్పించేందుకు పింఛనర్లను సంప్రదించనున్న అన్ని లైన్ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు
పదవీవిరమణ చేసిన ఉద్యోగులు ప్రభుత్వంలో పని చేస్తున్నప్పుడు దేశ నిర్మాణానికి అందించిన తోడ్పాటును గుర్తించడం, రాతపూర్వక ఇతివృత్తాల ద్వారా భారతీయ పాలనా చరిత్రను లిఖితపూర్వకం/ ప్రమాణ పత్రం చేయడం
నేటివరకు 54 అనుభవ్ అవార్డులను ప్రదానం చేసిన పింఛన్లు, పింఛనర్ల సంక్షేమ విభాగం
Posted On:
12 JAN 2024 2:39PM by PIB Hyderabad
ప్రభుత్వంలో పని చేస్తున్నప్పుడు పదవీ విరమణ చేస్తున్న/ పదవీవిరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ అనుభవాలను పంచుకునేందుకు అనుభవ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయమని భారత ప్రధానమంత్రి జారీ చేసిన ఆదేశాల మేరకు 2015లో డిఒపిపిడబ్ల్యు ఈ ఆన్‌లైన్ వేదికను ప్రారంభించింది. పదవీవిరమణ చేసిన సిబ్బంది తమ అనుభవాలను పంచుకోవడమన్న సంస్కృతి భవిష్యత్‌లో సుపరిపాలనకు, పాలనా సంస్కరణలకు పునాదిరాయి కాగలదని భావనతో దీనిని ప్రారంభించారు.
ప్రభుత్వం అనుభవ్ అవార్డ్స్ పథకం 2024కు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకంలో పాలుపంచుకునేందుకు, పదవీవిరమణ చేసిన సిబ్బంది/ పింఛనర్లు తమ అనుభవ్ రచనలను పదవీవిరమణకు 8 నెలల ముందు, పదవీవిరమణ చేసిన తర్వాత ఒక సంవత్సరంలో సమర్పించవలసి ఉంటుంది. సంబంధిత మంత్రిత్వశాఖలు/ విభాగాలు వాటిని పరిశీలించి, మదింపు చేసిన అనంతరం వాటిని ప్రచురిస్తారు. అలా ప్రచురితమైన రచనలను అనుభవ్ అవార్డులకు, జ్యూరీ సర్టిఫికెట్లకు ఎంపిక చేస్తారు. అనుభవ్ అవార్డ్స్ పథకం కింద తమ రచనలను సమర్పించవలసిన ఆఖరు తేదీ 31.3.2024. పథకం ప్రకారం, 31 జులై, 2023 నుంచి 31 మార్చి 2024 వరకు అనుభవ్ పోర్టల్‌లో ప్రచురితమైన అనుభవ్ రచనలను 05 అనుభవ్ అవార్డులకు, 10 జ్యూరీ సర్టిఫికెట్లకు పరిగణనలోకి తీసుకుంటారు.
అనుభవ్ అవర్డుల పథకం 2024లో విస్త్రతమైన భాగస్వామ్యం కోసం డిఒపిపిడబ్ల్యు ప్రతి పెన్షనర్ తన అనుభవ్ అనుభవాన్ని సమర్పించమని విస్త్రత ప్రచారాన్ని చేపట్టింది. ఈ విషయంలో, మంత్రిత్వ శాఖల / విభాగాల నోడల్ అధికారులతో, సిఎపిఎఫ్‌లతో సమావేశాన్ని నిర్వహించింది. పింఛనర్లు తమ అనుభవ్ అనుభవాలను సరైన సమయంలో సమర్పించేందుకు వారిని సంప్రదించమని అధికారులను కోరింది. అవార్డు కోసం నామినేషన్లకు అవసరమైన నమూనా పత్రంపై నాలెడ్జ్ షేరింగ్ సెషన్ కూడా ఏర్పాటు చేశారు.
అనుభవ్ అవార్డీలు తమ అనుభవాలను అనుభవ్ అవార్డీస్ స్పీక్ వెబినార్ సిరీస్ కింద ఒక జాతీయ వేదికలో తమ అనుభవాలను పంచుకుంటారు.
***
(Release ID: 1996020)
Visitor Counter : 176