గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు -2023 ప్రదానోత్సవం


"క్లీనెస్ట్ సిటీ" జాబితాలో సూరత్ ఇండోర్ సరసన చేరిన సూరత్

24 జాతీయ, 20 జోనల్, 54 రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రకటన

Posted On: 11 JAN 2024 3:34PM by PIB Hyderabad

 

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం ఒ హెచ్ యు ఎ) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో 2023 సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.

 

క్లీన్ సిటీస్, క్లీనెస్ట్ కంటోన్మెంట్, సఫాయిమిత్ర సురక్ష, గంగా టౌన్స్, బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ కేటగిరీల కింద 13 మంది అవార్డు గ్రహీతలు సత్కారాలు అందుకున్నారు. ఈ ఏడాది క్లీనెస్ట్ సిటీ అవార్డు వరుసగా ఆరేళ్ల పాటు విజేతగా నిలిచిన ఇండోర్ తో పాటు రేవు నగరం సూరత్ కూడా కలసి పంచుకోవడం విశేషం. లక్ష లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో సస్వాద్, పటాన్, లోనావాలా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మధ్యప్రదేశ్ లోని మోవ్ కంటోన్మెంట్ బోర్డు క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుగా ఎంపికైంది. పరిశుభ్రమైన గంగా పట్టణాల్లో వారణాసి, ప్రయాగ్ రాజ్ మొదటి రెండు అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.  చండీగఢ్ కు ఉత్తమ సఫాయిమిత్ర సురక్షిత్ షెహర్ అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 110 అవార్డులను ప్రదానం చేశారు.

స్వచ్ఛ సర్వేక్షణ్-  2023 డ్యాష్ బోర్డును రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ,  స్వచ్ఛ సర్వేక్షణ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం ఒక ముఖ్యమైన ముందడుగు అని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో రాష్ట్రాలు, యు ఎల్ బి ల పనితీరును ప్రశంసించిన ఆమె, 2023 సంవత్సర  'వేస్ట్ టు వెల్త్ ' థీమ్ ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశమని అన్నారు. వ్యర్థాల నుండి సంపదను సృష్టించాలని,  ఎందుకంటే ఇది మొత్తం పరిశుభ్రతకు సహాయపడుతుందని పరిశుభ్రతను పవిత్ర ప్రక్రియగా చేసుకోవాలని అన్నారు. 2030 నాటికి పర్యావరణ పరంగా  వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి, వ్యర్థాల   ఉత్పత్తిని గణనీయంగా తగ్గించడానికి,  జీరో వేస్ట్ కార్యక్రమాల ప్రాముఖ్యతను తెలియ చెప్పడానికి జి 20 లీడర్స్ ఢిల్లీ డిక్లరేషన్ కట్టుబడి ఉందని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, యు ఎల్ బిలు, పౌరులు పరిశుభ్రత ద్వారా శ్రేయస్సు మార్గంలో ముందుకు సాగుతున్నారని ,  మిషన్ ద్వారా స్వావలంబనను సృష్టిస్తున్నారని గౌరవ రాష్ట్రపతి ప్రశంసించారు. సఫాయిమిత్ర సురక్ష గురించి ప్రస్తావిస్తూ, "సఫాయిమిత్ర  ల భద్రత, గౌరవం, శ్రేయస్సును నిర్ధారించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నారని తెలుసుకోవడం  చాలా సంతోషంగా ఉంది‘ అని అన్నారు.

సర్క్యులర్ ఎకానమీ ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన రాష్ట్రపతి ‘ స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశలో సర్క్యులర్ వేస్ట్ మేనేజ్ మెంట్ ను అనుసరించడం, ఎక్కువ వస్తువులను రీసైక్లింగ్ చేసి పునర్వినియోగం చేసే సర్క్యులర్ ఎకానమీ ప్రక్రియ సుస్థిర అభివృద్ధికి దోహదపడుతుండటం అభినందనీయమని‘ అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ దూతలుగా ఉండి అవగాహన కల్పించాలని గౌరవ రాష్ట్రపతి కోరారు. అందరూ  పరిశుభ్రత సర్వే -2024 కోసం వ్యర్థాలను తగ్గించడం, పునర్వినియోగం,  రీసైకిల్ అనే ఇతివృత్తాన్ని నిర్దేశించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, "ఈరోజు భారత దేశంలోని ప్రతి నగరం బహిరంగ మల విసర్జన రహితం (ఒడిఎఫ్) గామారింది.  స్వచ్ఛ భారత్ మిషన్ ప్రభుత్వ కార్యక్రమం నుంచి జన ఆందోళన్ గా మారడం వల్లే ఇది సాధ్యమైంది. అంతోదయ సే సర్వోదయ దార్శనికతకు ఈ మిషన్ నిదర్శనం‘ అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, 2014 లో వ్యర్థాల శాస్త్రీయ ప్రాసెసింగ్ 15-16% మాత్రమే ఉండేదని, నేడు ఈ సంఖ్య దాదాపు 76% ఉందని, రాబోయే 2 నుండి 3 సంవత్సరాలలో, 100% సాధిస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ మిషన్ ముగిసేనాటికి మనం పూర్తిగా మ్యాన్ హోల్ నుంచి మెషిన్ హోల్ కు మారిపోతామని అన్నారు. ఎస్ బి ఎం ప్రజలలో గణనీయమైన ప్రవర్తనా మార్పును తీసుకువచ్చిందని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పై ఆయన మాట్లాడుతూ,  స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛత విషయంలో నగరాల మధ్య కఠినమైన ప్రక్రియను, క్రమశిక్షణను ఏకీకృతం చేసిందన్నారు. ‘2016లో ఒక మోస్తరు గా ప్రారంభమైన స్వచ్ఛ సర్వేక్షణ్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక సర్వేగా రూపుదిద్దుకుంది. ఇది నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించింది. ఇంకా బలమైన థర్డ్ పార్టీ అంచనా గా ఉంది‘ అన్నారు.

అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ప్రతినిధులకు స్వాగతం పలికిన ఎం ఒ హెచ్ యు ఎ  కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి మాట్లాడుతూ,  ‘గత తొమ్మిదేళ్లలో స్వచ్ఛత పరంగా చాలా మార్పు కనిపిస్తోంది. . నేడు ప్రతిచోటా, ప్రతి ఒక్కరికీ మరుగుదొడ్డి ఉంది. దేశంలో 90 శాతం పరిశుభ్రత సాధించాం. ప్మిగిలిన 10 శాతాన్ని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది‘ అన్నారు.  వ్యర్థాల నిర్వహణలో సర్క్యులారిటీ ని పెంపొందించడం , వ్యర్థాల నుండి విలువను వెలికితీసే సామర్థ్యాన్ని ఉపయోగించడం అనే ఎస్ బి ఎమ్-యు 2.0 లక్ష్యానికి అనుగుణంగా వ్యర్థాల నుండి సంపద సృష్టి  సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛ సర్వేషన్ 2023 ప్రత్యేకతను ఆయన వివరించారు. 2016లో 73 ప్రధాన నగరాల్లో ఓ మోస్తరు మదింపుతో ప్రారంభించి, ప్రస్తుత ఎడిషన్ లో 4477 నగరాలకు విస్తరించడంతో స్వచ్ఛ సర్వేక్షణ్ పరిమాణం విపరీతంగా పెరిగింది. ఈ సంవత్సరం, క్లీన్ సిటీ అవార్డులను ఏళ్ల తరబడి పేరుకు పోయిన డంప్ సైట్లను పరిష్కరించడం, ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్వహించడం, వ్యర్థాల తగ్గింపు-  పునర్వినియోగం, రీసైకిల్ సూత్రాలను అమలు చేయడం, సఫాయిమిత్రలకు భద్రత కల్పించడం అంశాల ఆధారంగా ఎంపిక చేశారు. ఎస్ఎస్-2023 వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చడంపై దృష్టి సారించింది 3,000 మందికి పైగా మదింపుదారుల బృందం మూల్యాంకనం చేసింది.

మధ్యతరహా, చిన్న నగరాలకు 20 జోనల్ అవార్డులు దక్కాయి. విజేతల జాబితా, జి ఎఫ్ సి, ఒ డి ఎఫ్ ఫలితాలు డ్యాష్ బోర్డ్ ను.ఇక్కడ చూడండి.

ఏక్ తరీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్ ప్రచారంపై ఆడియో విజువల్ ప్రజెంటేషన్, 2024 స్వచ్ భారత్ మిషన్ గీతం విడుదల ద్వారా గౌరవ రాష్ట్రపతి సమక్షంలో తొమ్మిదేళ్ల స్వచ్ఛ భారత్ మిషన్ మిషన్ స్ఫూర్తిని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. నేపథ్య గాయకుడు కైలాష్ ఖేర్ 'నయా సంకల్ప్ హై, నయా ప్రకల్ప్ హై' పాటకు తన గాత్రాన్ని అందించారు.

ఈ ఏడాది ఎంతగానో ఎదురు చూసిన ఈఅవార్డుల ప్రదానోత్సవం 3000 మందికి పైగా అతిథుల సమక్షంలో జరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి, , డిప్యూటీ సిఎం ,  యుఎడి మంత్రి శ్రీ అర్జున్ సావో, మధ్య ప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కైలాష్ విజయ్ వర్గీయ, ఉత్తర ప్రదేశ్ యుడి మంత్రి శ్రీ అరవింద్ కుమార్ శర్మ వీరిలో ఉన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మేయర్లు, రాష్ట్ర, నగర పాలకులు, ఈ రంగానికి చెందిన భాగస్వాములు, విషయ నిపుణులు, యువజన సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు, పారిశుధ్య, వ్యర్థాల నిర్వహణ రంగంలోని స్టార్టప్ లు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సి ఎస్ ఒ లు,  సఫాయిమిత్రలు, స్వయం సహాయక బృందాలు కూడా పాల్గొన్నారు.

అవార్డుల ప్రదానోత్సవాన్ని ఇక్కడ వీక్షించండి.

పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్, ఆయన బృందం స్వచ్ఛభారత్ ప్రయాణాన్ని, మైలురాళ్లను, స్ఫూర్తిని ప్రతిబింబించే లైవ్ శాండ్ ఆర్ట్ సృష్టితో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమానికి మరో ప్రధాన ఆకర్షణ స్వయం సహాయక బృంద సభ్యులు ఏర్పాటు చేసిన ఆకర్షణీయ స్టాల్స్, వారు వ్యర్థాలతో తయారు చేసిన హస్తకళలు, కళాఖండాలు, ఇతర ఉత్పత్తులను విక్రయించారు. ఈ స్టాల్స్ లో అప్ సైకిల్డ్ క్లాత్ బ్యాగుల నుంచి అరటి ఆకుల వస్తువులప్ వరకు, వెదురు ఉత్పత్తుల నుంచి వ్యర్థాలతో తయారు చేసిన ఆభరణాల వరకు ప్రదర్శించారు. ఇంకా వ్యర్థాల నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను ప్రదర్శించే ఎగ్జిబిషన్ సందర్శకుల దృష్టిని ఆకట్టుకుంది. మెకానికల్ స్వీపింగ్ మెషీన్ల నుంచి మురుగునీటిని శుభ్రపరిచే రోబోల వరకు, వ్యర్థాల సేకరణ, రవాణా వాహనాల నుంచి అత్యాధునిక రోబోల వరకు పటిష్టమైన యంత్రాలతో కూడిన ఈ ఎగ్జిబిషన్ వివిధ నగరాలలో వినియోగానికి ఉన్న అవకాశాలను అన్వేషించడానికి దోహదపడింది.

నగరాలు, పౌరులు నూతన సంకల్పంతో, ఉత్సాహంతో చెత్త రహిత నగరాలను సాధించాలనే లక్ష్యానికి పునరంకితం కావటానికి ఈ అవార్డు ప్రదానోత్సవం ఒక వేదికగా ఉపయోగపడింది.

***



(Release ID: 1995736) Visitor Counter : 223