ప్రధాన మంత్రి కార్యాలయం
వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ యొక్క పదో సంచిక ను ప్రారంభించినప్రధాన మంత్రి
‘‘ఇది క్రొత్త కలల, క్రొత్త సంకల్పాల మరియు నిరంతర కార్యసాధనల కాలం’’
‘‘ ‘ఒక ప్రపంచం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే సూత్రాలు ప్రస్తుతం ప్రపంచ సంక్షేమాని కి జరూరు గా అయిపోయాయి’’
‘‘శర వేగం గామార్పులు చెందుతున్న ప్రపంచం లో ఒక ‘విశ్వ మిత్ర’ వంటి పాత్ర లోభారతదేశం మునుముందుకు సాగిపోతోంది’’
‘‘భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి విషయం లో ప్రపంచ సంస్థలు ఉత్సాహం తో ఉన్నాయి’’
‘‘గడచిన 10 సంవత్సరాల లో జరిగిన నిర్మాణాత్మక సంస్కరణ లు ఆర్థికవ్యవస్థ యొక్క పరిమాణం, సామర్థ్యం మరియు పోటీ తత్వం వృద్ధి చెందేటట్టు చేశాయి’’
Posted On:
10 JAN 2024 2:02PM by PIB Hyderabad
వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 2024 యొక్క పదో సంచిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గాంధీనగర్ లోని మాహత్మ మందిర్ లో ప్రారంభించారు. ‘భవిష్యత్తు కు ప్రవేశ ద్వారం’ అనేది ఈ సంవత్సరం లో శిఖర సమ్మేళనం తాలూకు ఇతివృత్తం గా ఉంది. మరి, ఈ కార్యక్రమం లో 34 భాగస్వామ్య దేశాలు, ఇంకా 16 భాగస్వామ్య సంస్థలు పాలుపంచుకొంటున్నాయి. దేశం లోని ఈశాన్య ప్రాంతాల లో పెట్టుబడి పెట్టడానికి ఉన్న అవకాశాల ను వివరించడానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ శిఖర సమ్మేళనాన్ని ఒక వేదిక గా కూడా ఉపయోగించుకొంటోంది.
పరిశ్రమ రంగ సారథులు అనేక మంది ఈ కార్యక్రమం లో ప్రసంగించారు. సభికుల ను ఉద్దేశించి ఆర్సెలర్ మిత్తల్ యొక్క చైర్ మన్ శ్రీ లక్ష్మీ మిత్తల్, జపాన్ లో గల సుజుకి మోటర్ కార్పొరేశన్ యొక్క అధ్యక్షుడు శ్రీ తోశిహిరో సుజుకీ, రిలయన్స్ గ్రూపు నకు చెందిన శ్రీ ముఖేశ్ అంబాని, యుఎస్ఎ లోని మైక్రోన్ టెక్నాలజీస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ సంజయ్ మెహ్‌రోత్ర, అడాణి గ్రూప్ చైర్ మన్ శ్రీ గౌతమ్ అడాణి, దక్షిణ కొరియా లో సిమ్ టెక్ సంస్థ సిఇఒ శ్రీ జెఫ్‌రీ చూన్, టాటా సన్స్ లిమిటెడ్ చైర్ మన్ శ్రీ ఎన్. చంద్రశేఖరన్, డిపి వరల్డ్ యొక్క చైర్ మన్ శ్రీ సుల్తాన్ అహమద్ బిన్ సులేయమ్, ఎన్‌వీడియా యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంటు శ్రీ శంకర్ త్రివేది లతో పాటు జెరోధా యొక్క వ్యవస్థాపకుడు మరియు సిఇఒ శ్రీ నిఖిల్ కామత్ కూడా ప్రసంగించడం తో పాటుగా వారి యొక్క వ్యాపార ప్రణాళికల ను తెలియ జేశారు. ఈ వ్యాపార రంగ ప్రముఖులు ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణాన్ని ప్రశంసించారు.
వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ లో ప్రసంగించిన వారి లో జపాన్ కు చెందిన అంతర్జాతీయ వ్యవహారాల ఉప మంత్రి శ్రీ శిన్ హోసాకా, సౌదీ అరేబియా కు చెందిన పెట్టుబడి శాఖ సహాయ మంత్రి శ్రీ ఇబ్రాహిమ్ యూసఫ్ అలీ ముబారక్, మధ్య ప్రాచ్యానికి చెందిన సహాయ మంత్రి శ్రీ తారీక్ అహమద్, ఉత్తర ఆఫ్రికా, దక్షిణ ఆసియా, కామన్ వెల్థ్ మరియు ఐక్య రాజ్య సమితి, యుకె ల ప్రతినిధి శ్రీ వహన్ కెరోబియాన్, అర్మేనియా ఆర్థిక వ్యవహారాలు, సమాచార సాంకేతిక విజ్ఞానం శాఖ మంత్రి శ్రీ టీత్ రీసాలో, మొరాకో కు చెందిన పరిశ్రమ మరియు వాణిజ్య శాఖ మంత్రి శ్రీ రయద్ మిజూర్, నేపాల్ యొక్క ఆర్థిక మంత్రి శ్రీ ప్రకాశ్ శరణ్ మహత్, వియత్‌నామ్ ఉప ప్రధాని శ్రీ ట్రాన్ లూ కువాంగ్, చెక్ గణతంత్రం యొక్క ప్రధాని శ్రీ పీటర్ ఫియాల, మొజాంబిక్ యొక్క అధ్యక్షుడు శ్రీ ఫిలిప్ న్యూసీ లతో పాటు తిమోర్-లెస్తె యొక్క అధ్యక్షుడు శ్రీ జోస్ రామోస్-హోర్టా లు ఉన్నారు. శిఖర సమ్మేళనం యొక్క ఆరంభం లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అధ్యక్షుడు మరియు అబూ ధాబీ యొక్క పాలకుడు శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కూడా ప్రసంగించారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ముందు గా 2024వ సంవత్సరాని కి గాను శుభాకాంక్షల ను తెలియ జేశారు. రాబోయే ఇరవై అయిదు సంవత్సరాల లో 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశం గా తీర్చిదిద్దే ప్రతిజ్ఞ ను ఆయన పునరుద్ఘాటించారు. ‘‘క్రొత్త కలల ను కనడానికి, క్రొత్త సంకల్పాల ను తీసుకోవడాని కి మరియు నిరంతర కార్యసాధనల కు సంబంధించిన కాలం ఇది’’ అని ఆయన అన్నారు. ‘అమృత కాలం‘ లో ఒకటో వైబ్రాన్ట్ గుజరాత్ సమిట్ కు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు.
వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ ముఖ్య అతిథి గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) యొక్క అధ్యక్షుడు మరియు అబూ ధాబీ యొక్క పాలకుడు అయినటువంటి శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ పాలుపంచుకోవడం ఎంతో ప్రత్యేకమైంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ పరిణామం భారతదేశాని కి మరియు యుఎఇ కి మధ్య గాఢతరం గా మారుతున్నటువంటి సంబంధాల ను తెలుపుతోందని ఆయన అన్నారు. భారతదేశాన్ని గురించిన తన ఆలోచన లు మరియు మద్దతు స్నేహశీలత్వం తోను, సౌహార్దం తోను నిండి ఉన్నాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆర్థిక అభివృద్ధి మరియు పెట్టుబడి కి సంబంధించిన చర్చల తాలూకు ఒక ప్రపంచ వేదిక గా వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ మారుతోందని ఆయన అన్నారు. నవీకరణ యోగ్య శక్తి రంగం , నూతన ఆవిష్కరణల తో కూడిన ఆరోగ్య సంరక్షణ రంగాల కు తోడు భారతదేశం లో నౌకాశ్రయాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన లో కోటానుకోట్ల డాలర్ విలువైన పెట్టుబడులు వంటి అంశాల లో హెచ్చుతున్న సమర్ధన లో భారతదేశం-యుఎఇ భాగస్వామ్యాని ది కీలక పాత్ర అని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. యుఎఇ కి చెందిన సావరిన్ వెల్థ్ ఫండ్ తన కార్యకలాపాల ను జిఐఎఫ్‌టి సిటీ లో మొదలు పెట్టిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా విమానాల ను మరియు నౌకల ను లీజు కు ఇచ్చే కార్యకలాపాల లో ట్రాన్స్ వరల్డ్ కంపెనీ లు ముందుకు రావడాన్ని గురించి కూడా ఆయన వెల్లడించారు. భారతదేశాని కి మరియు యుఎఇ కి మధ్య సంబంధాలు అంతకంతకు వృద్ధి చెందుతున్నాయంటే ఆ ఖ్యాతి శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కే చెందుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
ఐఐఎమ్ అహమదాబాద్ లో పూర్వ విద్యార్థి మరియు మొజాంబిక్ అధ్యక్షుడైన శ్రీ ఫిలిప్ న్యూసీ ఈ కార్యక్రమం లో పాల్గొంటున్న విషయాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. జి-20 కి భారతదేశం అధ్యక్షత వహించిన కాలం లోనే ఆఫ్రికన్ యూనియన్ జి-20 లో శాశ్వత సభ్యత్వ దేశం గా చేరడం గర్వకారణం అని ప్రధాన మంత్రి అన్నారు. అధ్యక్షుడు శ్రీ న్యూసీ ఈ కార్యక్రమాని కి తరలి రావడం భారతదేశం-మొజాంబిక్ సంబంధాల తో పాటు, భారతదేశం-ఆఫ్రికా సంబంధాల ను కూడా గాఢతరం గా మార్చివేసింది అని ప్రధాన మంత్రి అన్నారు.
చెక్ రిపబ్లిక్ యొక్క ప్రధాని శ్రీ పీటర్ ఫియాల మొట్టమొదటిసారి గా తమ దేశాని కి ప్రధాని హోదా లో భారతదేశాన్ని సందర్శిస్తుండడాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఇది ఒక్క భారతదేశం తోనే కాకుండా వైబ్రాన్ట్ గుజరాత్ తో కూడా చెక్ గణతంత్రాని కి ఉన్నటువంటి పురాతన సంబంధాల ను సూచిస్తోందన్నారు. ఆటో మొబైల్ రంగం, సాంకేతిక విజ్ఞాన రంగం మరియు తయారీ రంగాల లో సహకారాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
నోబెల్ బహుమతి గ్రహీత మరియు తిమోర్-లెస్తె యొక్క అధ్యక్షుడైన శ్రీ జోస్ రామోస్-హోర్టా కు ప్రధాన మంత్రి స్వాగతం పలుకుతూ, వారి దేశం లో స్వాతంత్య్ర సమరం వేళ గాంధీ మహాత్ముని అహింస సిద్ధాంతాన్ని ఆచరణ లో పెట్టిన సంగతి ని ప్రముఖం గా ప్రకటించారు.
వైబ్రాన్ట్ గుజరాత్ సమిట్ యొక్క 20 వ వార్షిక కార్యక్రమాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఈ శిఖర సమ్మేళనం క్రొత్త క్రొత్త ఆలోచనల ను ప్రతిబింబించింది. పెట్టుబడుల కు మరియు ప్రతిఫలాల కు సరిక్రొత్త ప్రవేశ ద్వారాల ను తెరచింది అన్నారు. ఈ సంవత్సరం లో ‘భవిష్యత్తు కు ప్రవేశ ద్వారం’ అనేది ఇతివృత్తం గా ఉన్న సంగతి ని ప్రధాన మంత్రి వివరిస్తూ, 21 వ శతాబ్దం యొక్క భవితవ్యం ఉమ్మడి ప్రయాస ల వల్ల ప్రకాశవంతం అవుతుంది అన్నారు. భారతదేశం జి-20 కి అధ్యక్షత వహించిన కాలం లో భవిష్యత్తు కు సంబంధించిన ఒక మార్గసూచీ ని సమర్పించడమైంది. మరి, దీనిని వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ యొక్క దార్శనికత మరింత ముందుకు తీసుకుపోతున్నది అన్నారు. ఐ2యు2 తో మరియు ఇతర బహుపక్షీయ సంస్థల తో భాగస్వామ్యాన్ని బలపరచుకోవడం జరుగుతోందని , అదే కాలం లో ‘ఒక ప్రపంచం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ తాలూకు సూత్రాలు ప్రస్తుతం ప్రపంచ సంక్షేమాని కి ఒక ముందస్తు అవసరం గా మారిపోయాయన్న సంగతి ని కూడా ను ఆయన ప్రస్తావించారు.
‘‘శర వేగం గా మార్పుల కు లోనవుతున్న ప్రపంచం లో ఒక ‘విశ్వ మిత్ర’ వంటి పాత్ర ను భారతదేశం పోషిస్తూ మునుముందుకు కదులుతోంది. ఉమ్మడి సామూహిక లక్ష్యాల ను సాధించడం లో ప్రపంచాని కి ప్రస్తుతం భారతదేశం విశ్వాసాన్ని కలిగించింది. ప్రపంచ సంక్షేమానికై భారతదేశం యొక్క వచనబద్ధత, భారతదేశం నడుం కట్టినటువంటి ప్రయాస లు మరియు భారతదేశం చేస్తున్నటువంటి కఠోర శ్రమ ప్రపంచాన్ని సురక్షితం గా, సమృద్ధం గా మార్చుతున్నాయి. స్థిరత్వ స్థాపన లో ఒక ముఖ్యమైన స్తంభం గాను, నమ్మగలిగిన ఒక మిత్ర దేశం గాను, ప్రజలే కేంద్ర స్థానం లో నిలబడి ఉండే అభివృద్ధి సాధన పట్ల నమ్మకం కలిగిన ఒక భాగస్వామ్య దేశం గాను, ప్రపంచ హితం పట్ల విశ్వాసం ఉంచిన ఒక స్వరం గాను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో ఒక వృద్ధి చోదక శక్తి గాను, పరిష్కారాల ను కనుగొనడం లో సాంకేతిక విజ్ఞానం ప్రధానమైన దేశం గాను, ప్రతిభావంతులైన యువ శక్తి ని కలిగివున్న ఒక పవర్ హౌస్ గాను మరియు ఫలితాల ను అందించేటటువంటి ఒక ప్రజాస్వామ్య దేశం గాను భారతదేశం కేసి ప్రపంచం తన దృష్టి ని సారిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
‘‘దేశంలోని 140 కోట్లమంది పౌరుల ప్రాథమ్యాలు, ఆకాంక్షలు, మానవ-కేంద్రక ప్రగతిపై వారి విశ్వాసంతోపాటు సార్వజనీనత, సమానత్వంపై ప్రభుత్వ నిబద్ధతలు ప్రపంచ శ్రేయస్సుకు, అభివృద్ధికి ప్రధానాంశాలు’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అలాగే ఇవాళ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 10 సంవత్సరాల కిందట 11వ స్థానంలో ఉండేదని గుర్తుచేశారు. ప్రపంచంలోని వివిధ రేటింగ్ సంస్థల అంచనాల మేరకు రాబోయే కొన్నేళ్లలోనే ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఆవిర్భవిస్తుందని ఆయన నొక్కిచెప్పారు. ‘‘నిపుణులు దీనిపై తమ విశ్లేషణ చెప్పగలరు... కానీ, భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని నేను హామీ ఇస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచం అనేక భౌగోళిక-రాజకీయ అస్థిరతలను చవిచూసిన సమయాల్లో భారత్ ప్రపంచానికి ఆశాకిరణంగా మారిందని ఆయన గుర్తుచేశారు.
భారత ప్రాథమ్యాలు ఉజ్వల గుజరాత్ ప్రపంచ సదస్సులో ప్రతిఫలించటాన్ని ప్రస్తావిస్తూ- సుస్థిర పరిశ్రమలు, తయారీ, మౌలిక సదుపాయాలు, నవయుగ నైపుణ్యాలు, భవిష్యత్ సాంకేతికతలు, కృత్రిమ మేధ-ఆవిష్కరణలు, హరిత ఉదజని, పునరుత్పాదక ఇంధనం, సెమికండక్టర్స్ వగైరాలను ప్రధానమంత్రి ఉదాహరించారు. గుజరాత్‌లో వాణిజ్య ప్రదర్శనను ప్రతి ఒక్కరూ... ముఖ్యంగా పాఠశాలలు-కళాశాలల విద్యార్థులు సందర్శించాలని ప్రధాని మోదీ కోరారు. నిన్న గౌరవనీయ న్యుసి, రామోస్ హోర్టాలతో సంయుక్తంగా ఈ వాణిజ్య ప్రదర్శనను తిలకించడాన్ని ఆయన గుర్తుచేశారు. విద్యుత్ రవాణా (ఇ-మొబిలిటీ) వంటి రంగాల్లో అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఉత్పత్తులు ఇందులో ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. అంకుర సంస్థలు, నీలి ఆర్థిక వ్యవస్థ, హరిత ఇంధనం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు వంటి రంగాలన్నిటా పెట్టుబడులకు నిరంతరం కొత్త అవకాశాలు అందివస్తున్నాయని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ పురోగమన వేగం, పునరుత్థానానికి ప్రాతిపదికగా వ్యవస్థాగత సంస్కరణలపై భారత్ దృష్టి సారించడం గురించి ప్రధాని మోదీ వివరించారు. ఈ సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ శక్తి, సామర్థ్యం, పోటీతత్వం పెరిగాయని తెలిపారు. మూలధన పునర్వ్యవస్థీకరణ, ఆర్థిక అశక్తత-దివాలా స్మృతి (ఐబిసి) వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా రూపొందినట్లు ప్రధాని చెప్పారు. ఈ మేరకు దాదాపు 40 వేల అనవసర నిబంధనలను రద్దు చేయడంతో వాణిజ్య సౌలభ్యం ఏర్పడిందని, వస్తుసేవల పన్ను (జిఎస్‌టి)తో పన్ను సంబంధిత చిక్కులు తొలగి, ప్రపంచ సరఫరా వ్యవస్థలో వైవిధ్యభరిత వాతావరణం నెలకొందని వివరించారు.
ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)సహా మూడు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టిఎ)పై సంతకాలు పూర్తయ్యాయని తెలిపారు. వీటిద్వారా పలు రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్వయంచలితంగా ప్రవహించే వెసులుబాటు కలిగిందని చెప్పారు. మౌలిక సదుపాయాలపై రికార్డు స్థాయిలో పెట్టుబడులు, మూలధన వ్యయం 5 రెట్లు పెరగడం వంటివాటిని ఉదాహరించారు. అలాగే హరిత-ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధిలో అద్భుత పురోగమనం, పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 3 రెట్లు పెరగడం, సౌరశక్తి ఉత్పాదక సామర్థ్యం 20 రెట్లు పెరగడాన్ని గుర్తుచేశారు. ఇంటర్నెట్ డేటా చౌకగా లభిస్తుండటం డిజిటల్ సార్వజనీనతకు దోహదం చేసిందని చెప్పారు. ఇప్పుడు ప్రతి గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్ సంధానం ఉందని, దేశంలో 5జి సదుపాయం ప్రారంభంతోపాటు 1.15 లక్షల నమోదిత అంకుర సంస్థలతో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర పర్యావరణ వ్యవస్థగా రూపొందిందని వెల్లడించారు. అంతేకాకుండా ఎగుమతులలో రికార్డుస్థాయి పెరుగుదలను కూడా ప్రధాని ఉటంకించారు.
భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులతో జీవన సౌలభ్యం మెరుగుపడటమేగాక ప్రజలకు సాధికారత కలుగుతున్నదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. గడచిన ఐదేళ్లలో 13.5 కోట్ల మందికిపైగా ప్రజలు పేదరిక విముక్తులు కాగా, మధ్యతరగతి సగటు ఆదాయం నిరంతరం పెరుగుతోందన్నారు. దేశ శ్రామికశక్తిలో మహిళా భాగస్వామ్యం రికార్డు స్థాయిలో పెరుగుతున్నదని, భారత ఉజ్వల భవితకు ఇది సానుకూల సంకేతమని ప్రధాని చెప్పారు. ‘‘ఈ స్ఫూర్తితో భారత పెట్టుబడుల పయనంలో భాగస్వాములు కావాల్సిందిగా మీకందరికీ నా విజ్ఞప్తి’’ అని ప్రధానమంత్రి ఆహ్వానం పలికారు. తూర్పు ప్రాంతానికి ప్రాధాన్యంతో రవాణా రంగం పరంగా ఆధునిక విధానాల్లో మెరుగుదలను ఆయన వివరించారు. ఒక దశాబ్ద కాలంలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 149కి పెరిగిందని, జాతీయ రహదారుల నెట్‌వర్క్ రెట్టింపు కాగా, మెట్రో నెట్‌వర్క్ 3 రెట్లు పెరిగిందని తెలిపారు. అలాగే ప్రత్యేక రవాణా కారిడార్లు, జాతీయ జలమార్గాల అభివృద్ధిని ప్రధానమంత్రి ప్రముఖంగా వివరించారు. ఓడరేవులలో నౌకలు వేచి ఉండే సమయం కూడా తగ్గిందని, జి-20 సందర్భంగా భారత-మధ్యప్రాచ్య-ఐరోపా ఆర్థిక కారిడార్ ఏర్పాటు గురించి ప్రకటించామని గుర్తుచేస్తూ- ‘‘మీకందరికీ ఇవి భారీ పెట్టుబడి అవకాశాలు’’ అని సూచించారు.
చివరగా- భారతదేశంలో నలుమూలలా పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు అపారమని, ఇందుకు ఉజ్వల గుజరాత్ సదస్సు ముఖద్వారం.. భవిష్యత్తుకు సింహద్వారం వంటిదని అభివర్ణించారు. ‘‘మీరు భారతదేశంలో పెట్టుబడి పెట్టడమే కాకుండా నవతరం యువ సృష్టికర్తలతోపాటు వినియోగదారులను రూపొందిస్తారు. ఆ మేరకు భారత యువతరంతో మీ భాగస్వామ్యం మీకు అనూహ్య ఫలితాలనివ్వగలదు’’ అంటూ ప్రధాని మోదీ తన ప్రసంగం ముగించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్-అబుధాబి పాలకుడు గౌరవనీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, మొజాంబిక్ అధ్యక్షుడు మిస్టర్ ఫిలిప్ న్యుసి, తైమూర్-లెస్టే అధ్యక్షుడు మిస్టర్ జోస్ రామోస్-హోర్టా, చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి, మిస్టర్ పెత్ర్ ఫియాలా, వియత్నాం ప్రధానమంత్రి శ్రీ ట్రాన్ లూ క్వాంగ్, గుజరాత్ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
శ్రీ నరేంద్ర మోదీ 2003లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తన దార్శనిక నాయకత్వంలో ఉజ్వల గుజరాత్ ప్రపంచ సదస్సుకు రూపమిచ్చారు. ఈ వేదిక నేడు వ్యాపార సహకారం, విజ్ఞాన
భాగస్వామ్యంతోపాటు సమ్మిళిత-సుస్థిర అభివృద్ధి దిశగా వ్యూహాత్మక భాగస్వామ్యాలకు అత్యంత ప్రసిద్ధ ప్రపంచ వేదికగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో ఉజ్వల గుజరాత్ 10వ ప్రపంచ సదస్సు 2024 జనవరి 10-12 తేదీల మధ్య గాంధీనగర్‌లో నిర్వహించబడుతుంది. ఈసారి ‘భవిష్యత్తుకు సింహద్వారం’ (గేట్‌వే టు ది ఫ్యూచర్) ఇతివృత్తంగా జరిగే ఈ కార్యక్రమంలో ‘‘రెండు దశాబ్దాల ఉజ్వల గుజరాత్ సదస్సు విజయోత్సవం’’ కూడా నిర్వహిస్తారు.
ఈ ఏడాది సదస్సు నిర్వహణలో 34 భాగస్వామ్య దేశాలు, 16 భాగస్వామ్య సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈశాన్య భారతంలో పెట్టుబడి అవకాశాలను వివరించే వేదికగా సదస్సును సద్వినియోగం చేసుకుంటుంది.
ఈసారి సదస్సులో- పరిశ్రమ 4.0, సాంకేతికత-ఆవిష్కరణలు, సుస్థిర తయారీ రంగం, హరిత ఉదజని, విద్యుదాధారిత రవాణా, పునరుత్పాదక ఇంధనం, సుస్థిరత దిశగా పరివర్తన వంటి ప్రపంచ ప్రాధాన్యంగల అంశాలపై చర్చాగోష్ఠులు, సమావేశాలుసహా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
(Release ID: 1995028)
Visitor Counter : 172
Read this release in:
Kannada
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam