మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
జెద్దా,కెఎస్‌ఏలో జరిగిన హజ్ మరియు ఉమ్రా కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశానికి హాజరయ్యారైన కేంద్ర మహిళా, శిశుసంక్షేమం మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి. స్మృతి జుబిన్ ఇరానీ మరియు విదేశీ వ్యవహారాలు మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి శ్రీ వి. మురళీధరన్
ఉత్తమ ప్రపంచ పద్ధతులపై విలువైన అంశాలను ఈ సదస్సు అందించింది మరియు భారతీయ యాత్రికులకు హజ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో ఉపయోగకరంగా ఉండే ఆలోచనలు మరియు సమాచార మార్పిడిని సులభతరం చేసింది.
హజ్ 2024 సందర్భంగా భారతీయ యాత్రికుల సౌకర్యాలు మరియు సేవలను మెరుగుపరచడానికి మరింత సన్నిహిత సహకారం కోసం మక్కా రీజియన్ డిప్యూటీ గవర్నర్ మరియు హజ్ మరియు ఉమ్రా మంత్రి,కెఎస్‌ఏతో కూడా చర్చ జరిగింది.
प्रविष्टि तिथि:
09 JAN 2024 2:39PM by PIB Hyderabad
కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమం మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీతో పాటు విదేశీ వ్యవహారాలు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ. వి. మురళీధరన్ కెఎస్‌ఏ జెడ్డాలో నిర్వహించిన హజ్ మరియు ఉమ్రా కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్‌కు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి సీనియర్ అధికారుల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. 07.01.2024న భారతదేశం మరియు కెఎస్‌ఏ మధ్య హజ్ 2024 కోసం ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై సంతకం చేయబడిన ఈ సందర్భంగా ఈ భాగస్వామ్య సదస్సు జరిగింది.


హజ్ మరియు ఉమ్రా కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ అనేది ఏటా నిర్వహించబడే అంతర్జాతీయ కార్యక్రమం. ఈ అంతర్జాతీయ సమావేశం మరియు ప్రదర్శనకు సంబంధించిన 3వ ఎడిషన్ 08 నుండి 11 జనవరి వరకు జెడ్డాలో నిర్వహించబడుతోంది. ఈ ప్రపంచ సదస్సులో కీలక నిర్ణయాధికారులు, నిపుణులు, విద్యావేత్తలు మరియు పరిశోధకులచే సెషన్‌లు, వర్క్‌షాప్‌లు మరియు శిక్షణా సెమినార్‌లు ఉంటాయి. హజ్ మరియు ఉమ్రా సెక్టార్‌లో నిమగ్నమై ఉన్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే 200 కంటే ఎక్కువ సంస్థల హాజరుతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి మంత్రులు మరియు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
డబ్ల్యూసీడి మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కాన్ఫరెన్స్ ప్రారంభ సెషన్‌కు హాజరయ్యారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ అభ్యాసాలపై విలువైన విధానాలను అందించింది అలాగే భారతీయ యాత్రికులకు హజ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో ఉపయోగకరంగా ఉండే ఆలోచనలు మరియు సమాచార మార్పిడిని సులభతరం చేసింది.

సదస్సు సందర్భంగా శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, కేంద్ర సహాయమంత్రి శ్రీ మురళీధరన్.. మక్కా రీజియన్ డిప్యూటీ గవర్నర్ హెచ్.ఆర్.హెచ్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కెఎస్‌ఏ హజ్ మరియు ఉమ్రా మంత్రి హెచ్.ఈ. డా. తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్ రబియా కూడా హాజరయ్యారు. హజ్ 2024 సమయంలో భారతీయ హజ్ యాత్రికులకు అందించే సౌకర్యాలు మరియు సేవలను మెరుగుపరచడానికి కెఎస్‌ఏతో మరింత సన్నిహిత సహకారంపై చర్చ జరిగింది.
***
(रिलीज़ आईडी: 1994697)
आगंतुक पटल : 161