రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రంగా పిఎసిఎస్" అనే అంశంపై జాతీయ మెగా కాన్ క్లేవ్ లో ప్రసంగించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా , కేంద్ర రసాయనాలు ,ఎరువులు , ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


జన్ ఔషధి కేంద్రాలను తెరిచేందుకు పీఏసీఎస్ లకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలు సహకార సంఘాలకే కాకుండా సమాజంలో అట్టడుగు వర్గాలకు అందుతాయి: అమిత్ షా

‘జన ఔషధి కేంద్రాల నెట్వర్క్ ను విస్తరించడం ద్వారా, ఈ కేంద్రాల్లో నాణ్యమైన వివిధ మందులు అందుబాటులో ఉండేలా చూడటం ద్వారా కేంద్ర ప్రభుత్వం మందుల కొనుగోలు వ్యయాన్ని గణనీయంగా తగ్గించింది.’

పి ఎ పి ఎస్ ల ద్వారా జన ఔషధి కేంద్రాలను ప్రారంభించడం వల్ల సహకార సంస్థగా పి ఎ పి ఎస్ బలోపేతం అవుతుంది; దీనితో పాటు దేశంలో నాణ్యమైన, సరసమైన ఔషధాల లభ్యత పరిధి పెరుగుతుంది; డాక్టర్
మాండవీయ

‘దేశంలో 10,500కు పైగా పని చేస్తున్న జన ఔషధి కేంద్రాలు 1,965 పైగా అధిక నాణ్యత కలిగిన మందులు, 293 శస్త్రచికిత్స ఆవసర, ఇతర ఔషధ ఉత్పత్తులను మార్కెట్లో లభించే బ్రాండెడ్ మందుల ధరలో 50 నుంచి 90 శాతం ధరకే అందిస్తున్నాయి.

Posted On: 08 JAN 2024 2:29PM by PIB Hyderabad

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, కేంద్ర రసాయనాలు, ఎరువులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు ఢిల్లీలో "ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రంగా పిఎసిఎస్" అనే అంశంపై జాతీయ మెగా సదస్సులో ప్రసంగించారు. సహకార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ కూడా పాల్గొన్నారు.

సహకార మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు, ఇప్పటివరకు సాధించిన పురోగతిని వివరించడానికి "సహకార్ - సే - సమృద్ధి" అనే నినాదంతో ఈ భారీ సమ్మేళనాన్ని  నిర్వహించారు. సహకార మంత్రిత్వ శాఖ ఆమోదించిన కొత్త మోడల్ బైలాస్ ప్రకారం, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పిఎసిఎస్) పరిధి క్షేత్రస్థాయిలో వ్యవసాయ రుణాలతో వ్యవహరించే వాటి అసలు విధులకు మించి విస్తరించబడింది. జన ఔషధి కేంద్రాలను తెరవడం వంటి అనేక ఇతర అవకాశాలను ఆందిపుచ్చు కోవడానికి పిఎసిఎస్ లకు ఇప్పుడు అధికారం లభించింది.

జన్ ఔషధి కేంద్రాలను తెరిచేందుకు పిఎసిఎస్ లను అనుమతించాలన్న నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలు సహకార సంఘాలకే కాకుండా అట్టడుగు వర్గాలకు కూడా అందుతాయని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో జన ఔషధి కేంద్రాల ద్వారా సుమారు రూ.26 వేల కోట్ల పేద ప్రజల సొమ్మును ఆదా చేశామన్నారు. జనరిక్ మందులు ఈ కేంద్రాల్లో 50-90% మార్కెట్ ధర కంటే తక్కువకు లభ్యమవుతూ, ఆరోగ్య సంరక్షణకు భరోసా కల్పిస్తున్నాయి.

ఆయుష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనుష్, జల్ జీవన్ మిషన్, డిజిటల్ హెల్త్, మలేరియా నిర్మూలన మిషన్, టీబీ ముక్త్ భారత్ ఇనిషియేటివ్ వంటి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇతర ముఖ్యమైన కార్యక్రమాల గురించి కూడా శ్రీ అమిత్ షా వివరించారు. ఈ కార్యక్రమాలు దేశ ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చాయని ఆయన అన్నారు. పిఎం- పిఎంజెఎవై ద్వారా దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఎబి-పిఎంజెఎవై ద్వారా పేదలకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు, జన ఔషధి కేంద్రాల నెట్వర్క్ ను విస్తరించడం, ఈ కేంద్రాల్లో వివిధ రకాల నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చూడటం ద్వారా మందుల కొనుగోలు వ్యయాన్ని కూడా ప్రభుత్వం గణనీయంగా తగ్గించిందని వివరించారు. జన్ ఔషధి కేంద్రాల్లో రూ.65 ఖర్చయ్యే డయాలసిస్ మందులు కేవలం రూ.5 కే అందుబాటులో ఉన్నాయన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, మొదటి దశలో పిఎసిఎస్ ల ద్వారా రెండు వేల జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. దేశంలో జన ఔషధి కేంద్రాలను ప్రారంభించేందుకు పిఎసిఎస్ ల నుంచి ఇప్పటికే 2,300 దరఖాస్తులను ఫార్మాస్యూటికల్స్ శాఖ ఆమోదించిందని, వాటిలో 500 ఇప్పటికే పనిచేస్తున్నాయని తెలిపారు. పిఎసిఎస్ ల ద్వారా జన ఔషధి కేంద్రాలను ప్రారంభించడం వల్ల పిఎసిఎస్ లు  సహకార సంస్థగా బలోపేతమవుతాయని, దేశంలో నాణ్యమైన, చౌకైన ఔషధాల లభ్యత పెరుగుతుందని అన్నారు.

ముఖ్యంగా సమాజంలోని నిరుపేద వర్గాలకు జన్ ఔషధి పథకం గొప్పతనాన్ని కేంద్ర మంత్రి వివరించారు. వినియోగదారులకు నాణ్యమైన, మందులను తక్కువ ధరకు అందించడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. "దేశంలో 10,500 కి పైగా జన ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయి, ఇవి 1,965 కి పైగా అధిక-నాణ్యత మందులు  293 శస్త్రచికిత్స,  ఇతర ఉత్పత్తులను మార్కెట్లో లభించే బ్రాండెడ్ మందుల ధరలో 50 నుండి 90 శాతం తక్కువ ధరతో అందిస్తున్నాయి" అని ఆయన అన్నారు.

జమ్ముకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు పిఎసిఎస్ ప్రతినిధులకు కేంద్ర మంత్రులు స్టోర్ కోడ్ ల సింబాలిక్ సర్టిఫికెట్లను అందజేశారు. దేశవ్యాప్తంగా వివిధ పిఎసిఎస్ ల ప్రతినిధులతో కూడిన ఈ సమావేశంలో పాల్గొన్న వారు పీఏసీఎస్ లకు అమలు చేస్తున్న విధానాలపై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కొత్తగా తీసుకువచ్చిన మోడల్ బైలాస్ కింద తమ అనుభవాలను సదస్సులో పంచుకున్నారు.

సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ జ్ఞానేష్ కుమార్, ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ లోని ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్మెంట్ కార్యదర్శి శ్రీ అరుణిష్ చావ్లా,  కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రధాన మంత్రి జన ఔషధి పరియోజన, దేశవ్యాప్తంగా ఉన్న పి ఎ సి ఎస్ ప్రతినిధులు ఈ సమ్మేళనం లో పాల్గొన్నారు.

***


(Release ID: 1994250) Visitor Counter : 299