రక్షణ మంత్రిత్వ శాఖ
ఎన్‌సిసి గణతంత్ర దినోత్సవ శిబిరం 2024లో తొలిసారి పాల్గొననున్న ఈశాన్య ప్రాంతానికి చెందిన ఆల్ గర్ల్స్ బ్యాండ్
Posted On:
03 JAN 2024 5:05PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంతానికి చెందిన 45 మంది ఆడపిల్లలతో కూడిన నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సిసి) బ్యాండ్ తొలిసారి గణతంత్ర దినోత్సవ శిబిరం 2024లో పాలుపంచుకుంటోంది. ఈశాన్య ప్రాంత సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 13-15 వయస్సు మధ్య ఉన్న ఆడపిల్లలు, దేశంలోని నలుమూలలకు ఎన్‌సిసి వ్యాప్తిని ప్రదర్శించనున్నారు.
అత్యధికంగా 907మంది ఆడపిల్లలు సహా మొత్తం 2,274 కేబెట్లు దేశం నలు మూలలకు చెందిన కేడెట్లు నెలరోజుల పాటు జరిగే శిబిరంలో పాల్గొంటారని ఎన్‌సిసి డిజి లెఫ్టనెంట్ గురబీర్‌పాల్ సింగ్ జనవరి 03, 2024న ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఏర్పాటు చేసిన ఒక విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కేడెట్లలో 122మంది జమ్ము& కాశ్మీర్, లడాఖ్‌కు చెందిన వారు కాగా, 177మంది ఈశాన్యప్రాంతానికి చెందిన వారున్నారన్నారు. యూత్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ ర(వైఇపి) కింద అదనంగా, 25 స్నేహపూర్వక దేశాలకు చెందిన కేడెట్లు, అధికారులు పాలుపంచుకోనున్నారు.
దేశ సుసంపన్న సంప్రదాయాలకు బహిర్గతం చేయడం, క్యాడెట్ల విలువల వ్యవస్థను బలోపేతం చేయడం గణతంత్ర దినోత్సవ శిబిర శిబిర లక్ష్య అని డిజి ఎన్‌సిసి ఉద్ఘాటించారు. ఈ శిబిరం జాతీయ సమగ్రతను ప్రోత్సహించడమే కాక సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని బలోపేతం చేస్తుంది. ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి, రక్షణశాఖ సహాయ మంత్రి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రిసేవా దళాధిపతులు సహా ఈ శిబిరాన్ని సందర్శిస్తారు.
లెఫ్టనెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్ 2023లో ఎన్‌సిసి చేపట్టిన ప్రధాన కార్యకలాపాలను వివరించారు. రెండు వైబ్రెంట్ విలేజ్ ఏరియా క్యాంప్‌లు ( సచేతన గ్రామ ప్రాంత శిబిరాలు), మూడు డిఆర్‌డిఒ శిబిరాలు, ఒక ఎయిరోస్పేస్ శిబిరం సహా 39 ఏకభారత్ శ్రేష్ఠ భారత్ శిబిరాలను నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఇతర విజయాలలో మెగాసైక్లోథాన్, నారీ వందన్ రన్, క్రీడా కార్యక్రమాలలో అసాధారణ ప్రదర్శన, పర్వతారోహణ సాహస యాత్రలు, జి 20 కార్యక్రమాలలో ఉనికిని చెప్పుకోవచ్చు.
యువతలో మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా క్యాడెట్ల శిక్షణా తత్వాన్ని మెరుగుపరచామని డీజీ ఎన్‌సిసి ఉద్ఘాటించారు. వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, క్యాడెట్ల సాఫ్ట్ స్కిల్స్‌ను వారి భవిష్యత్తు అవసరాలకు సన్నద్ధం చేయడంపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది. వారిలో ముందుగా జాతీయ స్ఫూర్తిని పెంపొందిచి, మంచి పౌరులుగా మార్చడం అన్నది కీలక భావన అని ఆయన అన్నారు.
***
(Release ID: 1992932)
Visitor Counter : 269