ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన కార్యక్రమంలో కీలక మైలురాయి - కోటి మందికి పైగా సికిల్ సెల్ వ్యాధి పరీక్షలు
Posted On:
02 JAN 2024 2:50PM by PIB Hyderabad
జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన కార్యక్రమంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక కీలక మైలురాయిని అధిగమించింది. ఈ కార్యక్రమం కింద ఒక కోటి మందికి పైగా సికిల్ సెల్ వ్యాధి పరీక్షలు నిర్వహించింది.
3 సంవత్సరాల్లో 7 కోట్ల జనాభాను పరీక్షించడం ఈ కార్యక్రమం లక్ష్యం. సికిల్ సెల్ వ్యాధి అనేది జన్యుపరంగా వచ్చే రక్త సంబంధిత వ్యాధి. ఇది రోగిని జీవితాంతం బాధ పెడుతుంది. భారతదేశంలోని గిరిజన జనాభాలో ఈ వ్యాధి సర్వసాధారణం, గిరిజనేతరులకు కూడా వస్తుంది. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన కార్యక్రమాన్ని గౌరవనీయ ప్రధాన మంత్రి 2023 జులై 1న మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌లో ప్రారంభించారు. దేశంలోని అన్ని గిరిజన, వ్యాధి ప్రబలంగా ఉన్న గిరిజనేతర ప్రాంతాల్లో పరీక్షలు, నివారణ, నిర్వహణ కోసం అత్యవసర కార్యక్రమంగా దీనిని చేపట్టారు. వ్యాధి ఎక్కువగా ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అసోం, ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్, ఉత్తరాఖండ్ వంటి 17 రాష్ట్రాల్లోని 278 జిల్లాల్లో జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
***
(Release ID: 1992441)
Visitor Counter : 267