రక్షణ మంత్రిత్వ శాఖ
యుద్ధ నౌకల తయారీ, కొనుగోలు (వార్ షిప్ ప్రొడక్షన్ & అక్విజిషన్) కంట్రోలరు్‌గా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ బి. శివకుమార్, ఎవిఎస్ఎం, విఎస్ఎం
Posted On:
01 JAN 2024 1:52PM by PIB Hyderabad
యుద్ధనౌకల తయారీ, కొనుగోలుకు కంట్రోలర్‌గా 01 జనవరి 2024న వైస్ అడ్మిరల్ బి. శివకుమార్, ఎవిఎస్ఎం, విఎస్ఎం బాధ్యతలను స్వీకరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (70వ కోర్సు) పూర్వ విద్యార్ధి అయిన ఆయన 01 జులై 1987న భారతీయ నావికాదళంలోకి ఎలక్ట్రికల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఐఐటి చెన్నై నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు.
ఫ్లాగ్ ఆఫీసర్ నావల్, కమాండ్ హెడ్‌క్వార్టర్స్, డాక్ యార్డ్, శిక్షణా వ్యవస్థలలో సిబ్బంది, మెటీరియల్ శాఖలలో వివిధ ముఖ్యమైన పదవులను ఆయన నిర్వహించారు.
అంతేకాక ఆయన రంజిత్, కిర్పాణ్, అక్షయ్ వంటి యుద్ధ నౌకలపై ఫ్లాగ్ ఆఫీసర్‌గా వివిధ పదవులను నిర్వహించడమే కాక, ఐఎన్ఎస్ వల్సురాకు నాయకత్వం వహించారు. ఆయన ఆయన తన విశిష్ట సేవలకు గుర్తింపుగా అతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్‌ను ఆయన అందుకున్నారు.
యుద్ధనౌక, కొనుగోలు విభాగం కంట్రోలర్‌గా నియామకానికి ముందు ఆయన న్యూఢిల్లీలో ఎటివిపి కేంద్ర కార్యాలయంలో ప్రోగ్రామ్ డైరెక్టరుగా, నావికాదళ కేంద్ర కార్యాలయం, ఎఎస్‌డి (ముంబై)లో అసిస్టెంట్ చీప్ ఆఫ్ మెటీరియల్ (ఐటి&ఎస్)గా, డబ్ల్యుఎన్‌సి హెచ్‌క్యూ/ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (సాంకేతిక)గా సేవలను అందించారు.
***
(Release ID: 1992264)
Visitor Counter : 201