ప్రధాన మంత్రి కార్యాలయం

108 స్థలాల లో ఏక కాలం లో సూర్య నమస్కారాల ను అత్యంతఎక్కువ మంది పూర్తి చేసిన ప్రపంచ రికార్డు ను నెలకొల్పినందుకు గుజరాత్ కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 01 JAN 2024 2:01PM by PIB Hyderabad

నూట ఎనిమిది స్థలాల లో ఏక కాలం లో సూర్య నమస్కారాల ను పూర్తి చేసే కార్యక్రమం లో అత్యంత ఎక్కువ సంఖ్య లో ప్రజలు పాలుపంచుకొన్న అంశం లో గినీజ్ ప్రపంచ రికార్డు ను నెలకొల్పినందుకు గుజరాత్ కు అబినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తెలియ జేశారు.

సూర్య నమస్కారం వల్ల గొప్ప ప్రయోజనాల ను అందుకొనేందుకు ఆస్కారం ఉన్నందువల్ల రోజు వారీ పనుల లో సూర్య నమస్కారాన్ని ఒక పని గా మలచుకోవాలి అంటూ ప్రతి ఒక్కరి కి ఆయన విజ్ఞప్తి ని కూడా చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘‘గుజరాత్ ఒక ప్రశంసనీయమైనటువంటి కార్యం తో 2024 వ సంవత్సరాని కి స్వాగతం పలికింది.. అది ఏమిటి అంటే 108 స్థలాల లో ఏక కాలం లో ప్రజలు అత్యధిక సంఖ్య లో సూర్య నమస్కారాల కార్యక్రమం లో పాలుపంచుకోవడం ద్వారా ఈ అంశం లో గినీజ్ ప్రపంచ రికార్డు ను నెలకొల్పడమైంది. ఆ స్థలాల లో మొఢేరా సూర్య దేవాలయం కూడా ఒకటి గా ఉంది. ఇది నిజానికి యోగ మరియు మన సాంస్కృతిక వారసత్వం ల పట్ల మన యొక్క నిబద్ధత కు ఒక అచ్చమైన నిదర్శన అని చెప్పాలి.

సూర్య నమస్కారాలు చేయడాన్ని మీ యొక్క రోజువారీ పనుల లో ఒక పని గా మలచుకోవలసింది గా మిమ్ముల ను నేను కోరుతున్నాను. దీని ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/RT



(Release ID: 1992102) Visitor Counter : 225