రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
పొగమంచు పరిస్థితుల కారణంగా తగ్గిన దృశ్యమానతను ఎదుర్కొనేందుకు రహదారి భద్రతా చర్యలను చేపట్టిన ఎన్‌హెచ్ఎఐ
Posted On:
30 DEC 2023 3:02PM by PIB Hyderabad
శీతాకాలం కారణంగా జాతీయ రహదారులపై తగ్గిన దృగ్గోచరత సమస్యనను ఎదుర్కొనేందుకు పలు ఉపశమన చర్యలను తీసుకోవలసిందిగా ఎన్‌హెచ్ఎఐ క్షేత్ర స్థాయి కార్యాలయాలకు ఎన్‌హెచ్ఎఐ చైర్మనన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. పొగమంచు పరిస్థితుల కారణంగా దృశ్యమానత తగ్గుతూ జాతీయ రహదారులనను వినియోగించే వారి భద్రతకు ప్రధాన ముప్పుగా పరిణమిస్తున్న నేపథ్యంలో హైవేను ఉపయోగించే వారి భద్రతకు ముప్పును తెచ్చే సంభావ్య ప్రమాదాలను నివారించడానికి ఈ చర్యలు తోడ్పడతాయి.
పొగమంచు పరిస్థితుల్లో రహదారి భద్రతను పెంచేందుకు, ఉపశమన చర్యలను ఇంజినీరింగ్ చర్యలు, భద్రతా అవగాహన చర్యలు అన్న రెండు శీర్షికల కింద వర్గీకరించారు. ఇంజినీరింగ్ చర్యలలో రహదారులపై కనిపించని, పాడైన రోడ్డు సైన్లను తిరిగి ఏర్పాటు చేయడం, పేవ్‌మెంట్లపై వేసిన మార్కింగ్ వెలిసిపోయినా, సరిగాలేకపోయినా వాటిని సరి చేయడం, రిఫ్లెక్టివ్ మార్కర్లు, మీడియన్ తదితర భద్రతా పరికరాల ఏర్పాటు ద్వారా దఋశ్యమానతను పెంచడం, ఆవాసాలు, ప్రమాదాలకు ఆస్కారమునన్న ప్రాంతాల్లో అడ్డుగీతలతో మార్కింగ్‌లు, నిర్మాణ జోన్లలోనూ, ప్రమాదకర ప్రదేశాలలోని మీడియన్ మొదట్లో బ్లింకర్లు పని చేసేలా చూడటం, రహదారి విడిపోయే, కలిసే ప్రదేశాలలో దెబ్బతిన్న ప్రమాద మార్కర్ సంకేతాలను మార్చడం ఉన్నాయి.
జాతీయ రహదారులను వినియోగించే వారికి తగ్గిన దృశ్యమాన పరిస్థితుల గురించి అప్రమమత్తం చేసే చర్యలను భద్రతా అవగాహనా చర్యలలో పొందుపరిచారు. ఈ చర్యలలో పొగమంచు వాతావరణ అలెర్టులను ప్రదర్శించేందుకు, పొగమంచు ఉన్న ప్రాంతాలలో డ్రైవింగ్ స్పీడ్ పరిమితిని గంటకు 30కిమీలు మించకుండా ఉండాలని వాహనదారులకు హెచ్చరికలతో కూడిన వేరియబుల్ మెస్సేజ్ సైన్స్ (విఎంఎస్ - మారే సందేశ సంకేతాలు) లేదా ఎలక్ట్రానిక్ సంకేతాల ఏర్పాటు ఉంటాయి. పొగమంచు ఉన్న ప్రాంతాలలో డ్రైవింగ్ స్పీడ్ పరిమితిని గంటకు 30కిమీలు మించకుండా ఉండాలని వాహనదారులకు పబ్లిక్ అడ్రెస్ వ్యవస్థల ద్వారా హెచ్చరికలు, ఎలక్ట్రానిక్ బిల్ బోర్డులు, రేడియోలు, టోల్ ప్లాజాల వద్ద ప్రభుత్వ ప్రకటనలు, సోషల్ మీడియా, పొగమంచు పరిస్థితుల్లో రహదారి పక్కన సౌకర్యాలు, జాతీయ రహదారులపై వాహనాల విస్తీర్ణం మేరకు రిఫ్లెక్టివ్ టేపుల ఏర్పాటు వంటి ఏర్పాట్లు ఉంటాయి.
హైవేలపై ప్రయాణించే వాహనదారులకు బ్లింకర్లను ఉపయోగించి, ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా అవగాహన కల్పించేలా ఎన్‌హెచ్ఎఐ అధికారులనను ఈ మార్గదర్శకాలు ప్రోత్సహిస్తాయి. అదనంగా, భద్రతా అవగాహనకు సంబంధించిన కరపత్రాలను కూడా టోల్ ప్లాజాల వద్ద ప్రయాణీకులకు అందిస్తారు. ఇందులో పొగమంచు పరిస్థితుల గురించి సమాచారాన్ని పంచుకునేందుకు, ప్రమాదాలు జరిగినప్పుడు సహాయం కోసం ఒక కాంటాక్ట్ నెంబర్‌ను కూడా ఇస్తారు.
ఇందుకు అదనంగా, వారం వారం అన్నట్టుగా రాత్రి వేళ హైవేల తనిఖీ చేయవలసిందిగా కూడా ఎన్‌హెచ్ఎఐ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. తనిఖీ బృందంలో హైవేపై దృశ్యమానతను అంచనా వేసి, అవసరమైనట్లుగా అదనపు ఏర్పాట్లు చేసేందుకు ప్రదేశాలను గుర్తించేందుకు ఎన్‌హెచ్ఎఐ అధికారులు, స్వతంత్ర ఇంజినీర్లు, కన్సెషనైర్/ కాంట్రాక్టర్లు ఉంటారు. అంతేకాదు, దట్టంగా పొగమంచు ఉండే ప్రాంతాల వద్ద హైవే పాట్రోల్ వాహనాలను నిలిపి ఉంచుతారు. హైవేల నిర్వహణ, ఎక్కడైనా ప్రమాదం జరిగిన సందర్భంలోట్రాఫిక్‌ను మళ్ళించేందుకు, మార్గదర్శనం చేసేందుకు పపరేషన్ బృందం ఎరుపు/ ఆకుపచ్చ బ్లింకింగ్ బాటన్ (కర్రను)ను ఉపయోగిస్తూ, స్థానిక పాలన, పోలీసు అధికారులు, అంబులెన్స్ సేవలు, మునిసిపల్ అధికారులతో సాఫీ అయినా సహకారాన్ని కలిగి ఉంటుంది. పొగమంచు సంబంధ ఎమర్జెన్సీలలో ఈ సహకారం సమర్ధవంతంగా ఉండేలా నిర్ధారించేందుకు ఎన్‌హెచ్ఎఐ బృందం ఉమ్మడి డ్రిల్స్, వ్యాయామాలు నిర్వహిస్తుంది.
శీతాకాలంలో జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రయాణీకులకు ముప్పును తప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడమే కాక జాతీయ రహదారి వినియోగదారులకు సురక్షితమైన, సాఫీ అయిన ప్రయాణానుభవాన్ని కల్పించేందుకు ఎన్‌హెచ్ఎఐ కట్టుబడి ఉంది.
***
(Release ID: 1991935)
Visitor Counter : 105