ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వికసిత భారత్ సంకల్ప యాత్ర


ఒక లక్ష గ్రామ పంచాయితీలు, పట్టణాలలో మొత్తం ఆరోగ్య శిబిరాలను సందర్శించిన వారు 2 కోట్లకు పైచిలుకే...

8.5 లక్షల మందికి పైగా సికిల్ సెల్ డిసీజ్ కోసం పరీక్షించగా, 27,630 పైగా ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాలకు రిఫర్ చేయడం జరిగింది

Posted On: 29 DEC 2023 11:22AM by PIB Hyderabad

'అంత్యోదయ' సూత్రాన్ని  అనుసరించి చివరి మైలు వరకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలనే లక్ష్యంలో ఒక ముఖ్యమైన మైలురాయికి చేరుకుంది. వికసిత భారత్ సంకల్ప యాత్రలో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలకు 2 కోట్ల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు.

కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప్ యాత్ర కింద, ఇప్పటి వరకు 1,08,500 గ్రామ పంచాయతీలు,  పట్టణ స్థానిక సంస్థలలో పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య  2,10,24,874కి చేరుకుంది.

ఆరోగ్య శిబిరాల్లో వివిధ  కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు:

ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబి-పీఎంజే వై):  వికసిత భారత్ సంకల్ప యాత్ర కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ -ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ ఫ్లాగ్‌షిప్ పథకం కింద, ఆయుష్మాన్ యాప్‌ని ఉపయోగించి ఆయుష్మాన్ కార్డ్‌లు జారీ చేశారు. లబ్ధిదారులకు ఆ కార్డులను పంపిణీ చేస్తున్నారు. నలభై-నాల్గవ రోజు ముగిసే సమయానికి, 32,54,611 కంటే ఎక్కువ కార్డులు పంపిణీ చేశారు. ఎన్హెచ్ఏ నుంచి అందుకున్న డేటా ప్రకారం, శిబిరాలు జరిగిన జిల్లాల్లో ఇప్పటి వరకు 1,44,80,498 కార్డులు జారీ అయ్యాయి.

క్షయ వ్యాధి (టీబీ): లక్షణాలు కలిగి, కఫం పరీక్ష మరియు అందుబాటులో ఉన్న చోట నాట్ మెషీన్‌లను ఉపయోగించడం ద్వారా టీబీ  కోసం రోగుల స్క్రీనింగ్ చేస్తున్నారు. టీబీ ఉన్నట్లు అనుమానం ఉన్న కేసులను ఎక్కువ సౌకర్యాలు ఉన్న ఆస్పత్రికి రిఫర్ఉ చేస్తున్నారు. నలభై-నాల్గవ రోజు ముగిసే సమయానికి, 80,01,825 మందికి పైగా స్క్రీనింగ్ చేశారు. వీరిలో 4,86,043 మందికి పైగా ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాలకు సూచించడం జరిగింది.

ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ (పీఎంటీబీఎంఏ) కింద, టీబీతో బాధపడుతున్న రోగుల కోసం నిక్షయ్ మిత్ర నుండి సహాయం పొందడం కోసం సమ్మతి తీసుకోవడం జరుగుతోంది. అక్కడకు వచ్చిన వారిలో నిక్షయ్ మిత్రలుగా ఉండటానికి ఇష్టపడే హావారికి  ఆన్-స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నలభై-నాల్గవ రోజు ముగిసే సమయానికి, పీఎంటీబీఎంఏ కింద 1,40,852 మందికి పైగా రోగులు తమ సమ్మతిని అందించారు. 50,799 మందికి పైగా  కొత్త నిక్షయ్ మిత్రలుగా నమోదు అయ్యారు.

నిక్షయ్ పోషణ్ యోజన (ఎన్పివై) కింద, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా టీబీ రోగులకు ద్రవ్య సహాయం అందిస్తారు. ఇందుకోసం పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేస్తున్నారు. నలభై నాలుగు రోజులు ముగిసే సమయానికి 36,763 మంది లబ్ధిదారుల వివరాలను సేకరించారు.

సికిల్ సెల్ వ్యాధి (ఎస్సిడి): ప్రధానంగా గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో, ఎస్సిడి కోసం పాయింట్ ఆఫ్ కేర్ (పిఓసి) పరీక్షల ద్వారా లేదా సాల్యుబిలిటీ టెస్ట్ ద్వారా సికిల్ సెల్ డిసీజ్ (ఎస్సిడి) గుర్తింపు కోసం అర్హులైన జనాభాకు (40 సంవత్సరాల వయస్సు వరకు) స్క్రీనింగ్ జరుగుతుంది. పాజిటివ్‌గా వచ్చిన కేసులను నిర్వహణ కోసం ఉన్నత కేంద్రాలకు పంపుతున్నారు. నలభై-నాల్గవ రోజు ముగిసే సమయానికి, 8,51,194 మందికి పైగా వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారు, వారిలో 27,630 మందికి పాజిటివ్ గా  నమోదైంది. వారిని అధిక ప్రజారోగ్య సౌకర్యాలున్న ఆస్పత్రులకు సిఫార్సు చేయడం జరిగింది. 

అసంక్రమిత వ్యాధులు (ఎన్సిడి లు):

అధిక రక్తపోటు, మధుమేహం కోసం లక్షణాలున్న వారిని (30 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ) స్క్రీనింగ్ చేస్తున్నారు. పాజిటివ్‌గా ఉన్న కేసులను ఉన్నత సౌకర్యాలు గల ఆరోగ్య కేంద్రాలకు సిఫార్సు చేస్తున్నారు. నలభై-నాల్గవ రోజు ముగిసే సమయానికి, దాదాపు 15,694,596 మంది హైపర్‌టెన్షన్, డయాబెటిస్ కోసం పరీక్షించారు. 7,32,057 మందికి పైగా హైపర్‌టెన్షన్‌కు పాజిటివ్‌గాను,  5,28,563 మందికి పైగా డయాబెటిస్‌కు పాజిటివ్‌గాను అనుమానితులను గుర్తించారు. 11,56,927 మందికి పైగా ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాలకు రెఫర్ చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా , ఆంధ్రప్రదేశ్ 

లఖింపూర్, అస్సాం

 

ఖగరియా, బీహార్  

సుక్మా, ఛత్తీస్గఢ్ 

 

వడోదర, గుజరాత్ 

 

 

నేపథ్యం: 

వికసిత భారత్ సంకల్ప యాత్రను గౌరవ ప్రధానమంత్రి నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఖుంటి నుండి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను చేర్చే లక్ష్యంతో ప్రారంభించారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర కింద అక్కడికక్కడే అందించే సేవల్లో భాగంగా, గ్రామ పంచాయతీలలో ఐఈసి వ్యాన్ లను నిలిపి ఆ  ప్రదేశాలలో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.

 

****



(Release ID: 1991551) Visitor Counter : 293