ప్రధాన మంత్రి కార్యాలయం

ఆధునిక వ్యవసాయంపై ప్రధానమంత్రి మెప్పు పొందిన తిరువళ్లూరు రైతు

Posted On: 27 DEC 2023 2:21PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా వికసిత భారతం సంకల్ప యాత్ర లబ్ధిదారులతో సంభాషించార. దేశవ్యాప్తంగాగ‌ల‌ వేలాది లబ్ధిదారులతోపాటు కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థ‌ల  ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్య‌క్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరువళ్లూరుకు చెందిన శ్రీ హరికృష్ణన్ అనే రైతుకు ‘వణక్కం’ అంటూ ప్రధానమంత్రి అభివాదం చేశారు. కాగా, శ్రీ హరికృష్ణన్‌ ఆధునిక వ్యవసాయంలో ఉద్యాన-వ్యవసాయ శాఖ నుంచి శిక్షణ పొందారు. ఉన్నత విద్యావంతుడైనప్పటికీ వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్న ఈ రైతును ప్రధాని అభినందించారు. శ్రీ హరికృష్ణన్‌ రైతు సంక్షేమ సంబంధిత ప్రభుత్వ పథకాలతోపాటు ఆయుష్మాన్ భారత్ యోజన కింద కూడా లబ్ధిదారుగా ఉన్నారు. నానో యూరియాను అందుబాటులోకి తేవడం వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టడంపై ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, శ్రీ హరికృష్ణన్‌ డ్రోన్ల వినియోగం సహా అనేక ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. దీనిపై ప్రధానమంత్రి ఆయనను ప్రశంసిస్తూ- ‘‘ప్ర‌భుత్వం సదా మీకు అండదండగా నిలుస్తుంది’’ అని హామీ ఇచ్చారు.

 

****



(Release ID: 1991069) Visitor Counter : 70