వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేడు జార్ఖండ్‌లోని జంష‌డ్‌పూర్‌లో జ‌రిగిన వీర్‌బాల్ దివ‌స్‌ను పుర‌స్క‌రించుకొని చారిత్రాత్మ‌క‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ ముండా

Posted On: 26 DEC 2023 2:04PM by PIB Hyderabad

జార్ఖండ్‌లోని జంష‌డ్‌పూర్‌లో గ‌ల  సాహీబ్ బాబా దీప్ సింగ్ జీ గురుద్వారాలో మంగ‌ళ‌వారం వీర్‌బాల్ దివ‌స్ సంద‌ర్భంగా జ‌రిగిన చారిత్రాత్మ‌క కార్య‌క్ర‌మంలో కేంద్ర వ్య‌వ‌సాయ‌& రైతాంగ సంక్షేమం, గిరిజ‌న వ్య‌వ‌హారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా పాలు పంచుకున్నారు. 
సర్‌హింద్ మొగ‌ల్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న వ‌జీర్ ఖాన్ ద‌ర్బారులో 10వ సిక్కు గురువైన గురు గోవింద్ సింగ్‌జీ కుమారులైన బాబా ఫ‌తే సింగ్‌, జొరావ‌ర్ సింగ్‌ల‌ను   26 డిసెంబ‌ర్ 1704ను ఉరితీసిన రోజును వారి బ‌లిదానాన్ని గుర్తు చేసుకుంటూ, వారికి  స్మృత్యంజ‌లి ఘ‌టిస్తూ వీర్ బాల్ దివ‌స్‌ను జ‌రుపుకుంటారు. ష‌హీద్ దీప్ సింగ్‌జీ బ‌లిదాన స్మృత్య‌ర్ధం జంష‌డ్‌పూర్‌లో నిర్మించిన గురుద్వారా ఇది ఒక్క‌టే.  
అన్యాయానికి, విధ్వంసానికి వ్య‌తిరేకంగా పోరాటం చేయ‌డం అన్న‌ది సిక్కుల సుదీర్ఘ సంప్ర‌దాయంగా వ‌స్తున్న‌ది. ఇందుకోస‌మై వారు త‌ర‌త‌రాలుగా త్యాగాలు చేస్తున్నారు.  దేశం కోసం, మాన‌వాళి కోసం సిక్కు గురువులు చేసిన త్యాగాలు అస‌మాన‌మైన‌వి. నిస్వార్ధ సేవ‌, శాంతి సందేశాన్ని ఇచ్చే గురు గ్రంథ్ సాహిబ్ కేవ‌లం సిక్కు స‌మాజానికే కాక, భార‌త‌దేశంలోని అన్ని స‌మూహాల‌కూ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. 

 

***


(Release ID: 1990635) Visitor Counter : 88