యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
మైభారత్ పోర్టల్ లో 26లక్షల మందికి పైగా తమ పేర్లను నమోదుచేసుకున్న యువత
26 లక్షలమంది యువత మైభారత్ పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు విభాగాలతో సంప్రదించి యూత్ పోలీస్ ప్రయోగాత్మకంగా అధ్యయన కార్యక్రమంనిర్వహణ.
ప్రస్తుతానికి ఇంకానిధులు మంజూరు చేయలేదు.
प्रविष्टि तिथि:
21 DEC 2023 4:38PM by PIB Hyderabad
ఆజాది కా అమ్రుత్మహోత్సవ్ ముగింపు కార్యక్రమం సందర్భంగా జాతీయ స్థాయిలో 2023 అక్టోబర్ 31నన్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో మేరీ మాఠి మేరాదేశ్ ప్రచారానికి సంబంధించి అమ్రుత్ కలశ్యాత్ర జరిగింది.ఈ కార్యక్రమం సందర్భంగా మేరా యువ భారత్ (మై భారత్) ప్లాట్ ఫారం ను ప్రారంభించారు. ఇదోక స్వతంత్ర ప్లాట్ ఫారం.దీనిని యువతఅభివ్రుద్ధికి, కర్తవ్య బోధ, సేవా బోధతోయువత నాయకత్వంలో అభివ్రుద్ధి సాధనకునిర్ధేశించినది. అమ్రుత్ కాల్ సందర్భంగాదీనిని ప్రారంభించారు. మైభారత్ పోర్టల్ అనదిటెక్నాలజీ ఆధారితంగా యువత అభివ్రుద్ధికి, యువత నాయకత్వంలో అభివ్రుద్ధికినిర్దేశించినది. యువత సాధికారితకు, వారుతమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి ఇది ఉపకరించనుంది. తద్వారా వికసిత భారత్ కు ఇదిఎంతో తోడ్పడుతుంది. దేశవ్యాప్తంగా గల యువతమైభారత్ పోర్టల్ ద్వారా (https://www.mybharat.gov.in/)తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. తద్వారా అందుబాటులోకి వచ్చే పలు అవకాశాలను వారు అందిపుచ్చుకోవచ్చు.కమ్యూనిటీ పరివర్తనకు యువతను భాగస్వాములను చేసేందుకు యువభారత్ ప్లాట్ ఫారం ఫిజిటల్ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) వాతావరణాన్నికల్పిస్తుంది. డిజిటల్ నెట్ వర్క్ అందుబాటు, వివిధ అవకాశాలతో యువతకమ్యూనిటీ మార్పునకు ఉపకరించడానికి ఇది తోడ్పడుతుంది.ప్రభుత్వానికి, పౌరులకు మధ్య వీరు యవ సేతులా పనిచేసేందుకుప్రభుత్వం వీరికి వీలుకల్పిస్తొంది. ప్రస్తుతానికి దీనికింద 2024 జాతీయ యువజనఉత్సవాలలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర పోలీస్ డిపార్టమెంట్లోప్రయోగాత్మక అధ్యయనానికి కూడాపోర్టల్ అవకాశం కల్పిస్తుంది.ఈసమాచారాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ,రాజ్యసభలో సభ్యుడు శ్రీ లింగయ్య యాదవ్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వకసమాధానంలో తెలిపారు.
***
(रिलीज़ आईडी: 1989555)
आगंतुक पटल : 135