ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈశాన్య ప్రాంతపు విద్యార్థులకు ఎన్.ఈ.సీ స్కాలర్‌షిప్‌లు

Posted On: 21 DEC 2023 2:13PM by PIB Hyderabad

 

నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (ఎన్ఈసీ) ద్వారా భారత ప్రభుత్వం ఈశాన్య ప్రాంత విద్యార్థులకు ఉన్నత మరియు వృత్తిపరమైన విద్య స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌లు మెరిట్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయి. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో నిర్దేశించిన విధానాన్ని అనుసరించి అర్హత పరీక్షలలో అభ్యర్థులు పొందిన వారి మార్కుల ఆధారంగా ధ్రువీకరించబడిన దరఖాస్తుల నుండి జాబితాలు తీసుకోబడతాయి. వివిధ స్థాయిలలో సంబంధిత సబ్జెక్టులు/కోర్సుల కోసం ప్రస్తుత స్కాలర్‌షిప్ రేటు క్రింది విధంగా ఉంది:

అధ్యయన స్థాయి

తాజా మరియు పునరుద్ధరణ కేసుల కోసం స్కాలర్షిప్ మొత్తం

(ఇప్పటికే ఉన్న విద్యార్థులు)

గ్రాడ్యుయేట్

Rs. 22,000/- per annum

పోస్ట్ గ్రాడ్యుయేట్

Rs. 25,000/- per annum

ఎంఫిల్/పీహెచ్డీ

Rs. 30,000/- per annum

డిప్లమా

Rs. 20,000/- per annum

 

స్కాలర్షిప్ పంపిణీ 2021-22 సంవత్సరం నుండి డీబీటీ పోర్టల్ ద్వారా అమలు చేయబడుతోంది మరియు ఇప్పుడు క్రమబద్ధీకరించబడిన కొత్త పంపిణీ వ్యవస్థకు మారడం వల్ల జాప్యం జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇప్పడు వ్యవస్థ సజావుగా నడుస్తోంది. 2020-21 నుండి 2022-23 మధ్య కాలంలో మొత్తం 27,726 దరఖాస్తులు అందాయివాటిలో మొత్తం 4756 కేసులు ఎంపిక చేయబడ్డాయి. 2020-21 నుండి 2022-23 మధ్య కాలంలో వివిధ కేటగిరీలలో ఎంపికైన అభ్యర్థుల సంఖ్య రాష్ట్రాల వారీగా క్రింది పట్టికలో ఇవ్వబడింది:

క్రమ సంఖ్య

రాష్ట్రం

కోర్సుల వారీగా ఎంపికైన అభ్యర్థుల సంఖ్య

గ్రాడ్యుయేట్

పోస్ట్ గ్రాడ్యుయేట్

ఎంఫిల్/పీహెచ్డీ

డిప్లమా

మొత్తం

1

అరుణాచల్ ప్రదేశ్

103

47

3

11

164

2

అస్సాం

1206

397

54

218

1875

3

మణిపూర్

644

238

37

69

988

4

మేఘాలయ

133

114

4

14

265

5

మిజోరాం

61

36

1

2

100

6

నాగాలాండ్

50

40

2

1

93

7

సిక్కిం

81

91

0

5

177

8

త్రిపుర

722

238

4

130

1094

 

మొత్తం

3000

1201

105

450

4756

 

 

 రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ లిఖితపూర్వకంగా అందించిన ఒక సమాధానంలో  సమాచారం అందించారు.

***


(Release ID: 1989459) Visitor Counter : 96