ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గుండెపోటు వచ్చినప్పుడు అందించాల్సిన తక్షణ వైద్య సౌకర్యం( సీపీఆర్) పై దేశవ్యాప్తంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


గుండెపోటుకు గురైన రోగికి తక్షణ చికిత్స అందించడం అత్యవసరం.... ప్రతి ఒక్కరికి సీపీఆర్ పై అవగాహన, తగిన శిక్షణ చాలా ముఖ్యం: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి సీపీఆర్ పై శిక్షణ

Posted On: 06 DEC 2023 1:40PM by PIB Hyderabad

" గుండెపోటుకు గురైన  రోగికి తక్షణ చికిత్స అందించడం అత్యవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని  ప్రతి ఒక్కరికి  సీపీఆర్ పై అవగాహన, తగిన శిక్షణ చాలా అవసరం ఉంది" అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గుండెపోటు వచ్చినప్పుడు అందించాల్సిన తక్షణ వైద్య సౌకర్యం( సీపీఆర్) పై దేశవ్యాప్తంగా  నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్  నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ మాండవీయ ఈరోజు  ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో  కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ సహాయ  మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్  కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ సహాయ  మంత్రి  డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు. 

ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగిన ఈ ప్రచారంలో 20 లక్షల మందికి పైగా ప్రజలు  పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన  శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు  సీపీఆర్ నిర్వహించారు. 
గుండెపోటు అంశంపై  ప్రజలకు శిక్షణ అందించడానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ చేపట్టిన కార్యక్రమం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. “ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం. దీనికోసం  సమతుల్య ఆహారం,  తగిన వ్యాయామం  సమగ్ర విధానాన్ని ఆరోగ్య విధానాన్ని పాటించాలి. మనకు సమీపంలో గుండెపోటుకు గురైన వ్యక్తికి  తక్షణ చికిత్స అందించడానికి  సీపీఆర్  టెక్నిక్‌లో శిక్షణ పండాలి. సీపీఆర్ ప్రాణాలు రక్షించడానికి  సహాయపడుతుంది" అని డాక్టర్ మాండవీయ అన్నారు. 

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రశంసించిన డాక్టర్ మాండవీయ  “ఇది చాలా ముఖ్యమైనది, కార్డియాక్ అరెస్ట్ బాధితుడికి అత్యవసరంగా సహాయం అందించాల్సి ఉంటుంది, తగిన జ్ఞానం, శిక్షణతో ప్రజల్లో అవగాహన పెరగడం చాలా ముఖ్యం. దీనివల్ల మరొకరికి ప్రాణాలు కాపాడ గలుగుతాము." అని అన్నారు.జాతీయ స్థాయిలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అవగాహన పెంపొందిస్తాయని మంత్రి అన్నారు. .  దేశంలో మారుమూల ప్రాంతాలలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. 

దేశంలోనే జాతీయ స్థాయిలో నిర్వహించిన తొలి సీపీఆర్‌ అవగాహన కార్యక్రమం ఇదే. ఈ కార్యక్రమంలో పాల్గొనే  విద్యార్థులు, నిపుణులు,పారామెడికల్ సిబ్బందితో సహా పాల్గొనేవారికి ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా ఒకే సిట్టింగ్‌లో శిక్షణ ఇస్తారు. ప్రజలకు శిక్షణ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ మాండవీయ  "ఎవరైనా ఏ సమయంలోనైనా కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.  మెరుగైన జ్ఞానం  సరైన  శిక్షణ ద్వారా ఒక జీవితాన్ని రక్షించవచ్చు. ప్రతి ఒక్కరూ  శిక్షణ పొందాలి" అని మంత్రి అన్నారు. 
సీపీఆర్ నిర్వహణ విధానాన్ని డాక్టర్లు  వివరించారు. సందేహాలకు సమాధానమిచ్చారు. శిక్షణ పొందిన వారికి  నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్  సర్టిఫికెట్  జారీ చేసింది. 
ఈ సదస్సులో ఎన్‌బీఈఎంఎస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ అభిజాత్‌ షెథ్‌, ఎన్‌బీఈఎంఎస్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ నిఖిల్‌ టాండన్‌, ఎన్‌బీఈఎంఎస్‌ పాలకమండలి సభ్యుడు డాక్టర్‌ ఎస్‌ఎన్‌ బసు, సీనియర్‌ పాలకమండలి సభ్యుడు డాక్టర్‌ రాకేష్‌ శర్మ, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

 

***



(Release ID: 1983233) Visitor Counter : 66