బొగ్గు మంత్రిత్వ శాఖ

నవంబర్‌ మాసంలో క్యాప్టివ్, కమర్షియల్ బొగ్గు బ్లాక్‌ల నుండి అత్యధిక బొగ్గు పంపిణీ


-ఉత్పత్తి & పంపిణీ వరుసగా 37 % మరియు 55% పెరిగింది

Posted On: 02 DEC 2023 12:37PM by PIB Hyderabad

నవంబర్ 2023లో క్యాప్టివ్వాణిజ్య బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి 37 శాతం వృద్ధితో 11.94 మిలియన్ టన్నులకు (ఎంటీలకుచేరింది. బొగ్గు ఉత్పత్తి నవంబర్ 2022లో 8.74 ఎంటీలుగా నిలిచింది.  అదే సమయంలో (నవంబర్ 2023లో) క్యాప్టివ్/వాణిజ్య బొగ్గు గనుల నుండి బొగ్గు పంపిణీ 12.92 ఎంటీలుగా ఉందిగత ఏడాది ఇదే సంవత్సరం పంపిణీ 8.36 ఎంటీలుగా ఉంది. అంటే ఈ విభాగంలో 55% వృద్ధి నమోదు అయింది. నవంబర్ 2023 నెలలో గనుల నుండి రోజువారీ సగటు బొగ్గు పంపిణీ రోజుకు 4.3 లక్షల టన్నుల అత్యధికానికి చేరింది. 2023 ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య కాలంలో బొగ్గు ఉత్పత్తి, క్యాప్టివ్ మరియు కమర్షియల్ బొగ్గు బ్లాకుల నుండి పంపిణీ విశేషమైన వృద్ధి కనబడింది.  ఏప్రిల్ 2023 నుండి 30 నవంబర్ 2023 వరకు క్యాప్టివ్ & కమర్షియల్ బొగ్గు గనుల నుండి మొత్తం బొగ్గు ఉత్పత్తి సుమారు 83.90 ఎంటీలు కాగామొత్తం బొగ్గు పంపిణీ 89.67 ఎంటీలుగా ఉందిఇది అదే కాలాన్ని ఏడాది ప్రాతిపదికన పోలిస్తే వరుసగా 24% మరియు 31% వృద్ధి నమోదు అయింది. బొగ్గు ఉత్పత్తిలో అత్యధిక పెరుగుదల అసంఘటిత

సెక్టార్ మరియు వాణిజ్య బొగ్గు గనుల నుండి వరుసగా 101% మరియు 98% వృద్ధితో కనిపించింది. భారత దేశం యొక్క ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధిని నడిపించడంలో కీలకమైన అడుగు అయిన బొగ్గు ఉత్పత్తి మరియు పంపిణీ లక్ష్యాన్ని సాధించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.    

***



(Release ID: 1982200) Visitor Counter : 71