ప్రధాన మంత్రి కార్యాలయం

దేవఘర్ లో జన్ ఔషది కేంద్ర ఆపరేటర్, లబ్ధిదారులతో పీఎం సంభాషణ


బాబా ధామ్‌లో 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషించదగ్గ విషయం: ప్రధాని

నాణ్యమైన మరియు సరసమైన వైద్యం ఒక పెద్ద సేవ: పీఎం

Posted On: 30 NOV 2023 1:23PM by PIB Hyderabad

దేవఘర్ లోని ఎయిమ్స్ లో లబ్దిదారురు, ఆపరేటర్ రుచికుమారి తో ప్రధాని సంభాషించారు. బాబా ధామ్ దేవఘర్లో ఈ మైలురాయిని సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్బంగా ప్రధాని ఆమెను అభినందించారు. జన్ ఔషధి కేంద్రానికి సంబంధించి ఆమె నిర్ణయం గురించి అడిగినప్పుడు, ఆమె పేద, మధ్యతరగతితో జరుపుతున్న సంభాషణ వివరించారు. మార్కెట్లో 100 రూపాయలకు లభించే ఔషధం 10 నుండి 50 రూపాయలకు కేంద్రంలో దొరుకుతుంది కాబట్టి సరసమైన మందుల ఆవశ్యకతను ఆమె వివరించారు. ఈ ప్రాంతంలోని జన్ ఔషధి కేంద్రాల గురించి అవగాహన కల్పించడాన్ని కూడా వివరించారు. పథకం ప్రచారం కోసం సోషల్ మీడియాను ఉపయోగించడం గురించి రుచి కుమారి ద్వారా తెలియజేసారు.

జన్ ఔషధి యోజన లబ్ధిదారుడు, శ్రీ సోనా మిశ్రా జన్ ఔషధి కేంద్రం నుండి తక్కువ ధరలకు మందులను కొనుగోలు చేయడం ద్వారా నెలకు దాదాపు 10,000 రూపాయలు ఆదా చేయగలిగానని ప్రధాన మంత్రికి తెలియజేశారు. శ్రీ మిశ్రా తన దుకాణంలో జన్ ఔషధి కేంద్ర అనుభవాల గురించి ఒక బోర్డు పెట్టవలసిందిగా మరియు తక్కువ ధరలో ఔషధాల లభ్యత గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రధాన మంత్రి సూచించారు.

ఈ పథకాల గురించి స్థానిక ప్రజలకు అవగాహన ఉన్నందుకు ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. "నాణ్యమైన మరియు సరసమైన వైద్యం ఒక పెద్ద సేవ",  ప్రజలు దీని గురించి తెలుసుకోవాలని ప్రధాన మంత్రి అన్నారు.

***



(Release ID: 1981351) Visitor Counter : 68