విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సుబంసిరి దిగువ జలవిద్యుత్ ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర విద్యుత్, నూతన ,పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి


హైడల్ ప్రాజెక్టుల ప్రాముఖ్యత పెరిగింది, జల విద్యుత్ లేకుండా 24 గంటలపాటు పునరుత్పాదక ఇంధన సరఫరా సాధ్యం కాదు: కేంద్ర విద్యుత్, నూతన ,పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కే. సింగ్

“ 1.4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో అరుణాచల్‌లో ఏర్పాటు కానున్న 13 హైడల్ ప్రాజెక్టులు రాష్ట్ర తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచడంతోపాటు దేశానికి 13,000 మెగావాట్ల పరిశుద్ధ ఇంధనాన్ని సరఫరా చేస్తాయి. ”

Posted On: 28 NOV 2023 10:40AM by PIB Hyderabad

 అరుణాచల్ ప్రదేశ్ / అస్సాంలో ఉన్న 2000 మెగావాట్ల  సుబంసిరి దిగువ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను కేంద్ర విద్యుత్, నూతన ,పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్ నిన్న (2023 నవంబర్ 27) సందర్శించారు. మంత్రి సుబంసిరి ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న డ్యామ్, ఇతర నిర్మాణ కార్యక్రమాలను  పరిశీలించారు. నీటిని మళ్లించడానికి  అస్సాంలోని గెరుకాముఖ్‌లో నిర్మిస్తున్న సొరంగాల నిర్మాణ పనులను పరిశీలించి ప్రగతిని సమీక్షించారు.  అనంతరం విద్యుత్ శాఖ మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు,  ప్రాజెక్టు నిర్మాణ నిర్మాణ ప్రగతిని, సవాళ్లను పరిష్కరించడానికి తీసుకున్న వివిధ చర్యలను మంత్రికి అధికారులు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అధికారులు , ప్రధాన పనుల కాంట్రాక్టర్ల ప్రతినిధులను మంత్రి  ఆదేశించారు.

జల విద్యుత్ లేకుండా 24 గంటలపాటు పునరుత్పాదక ఇంధన సరఫరా  సాధ్యం కాదు

ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతి పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన మంత్రి  మాట్లాడుతూ జలవిద్యుత్‌ ప్రాధాన్యత పెరిగిందని, జల విద్యుత్ లేకుండా 24 గంటలపాటు పునరుత్పాదక ఇంధన సరఫరా  సాధ్యం కాదని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిని పరిశీలించామని తెలిపిన మంత్రి లక్ష్యాల మేరకు నిర్మాణ పనులు సాగుతున్నాయని తెలిపారు.  ఇంధన పరివర్తన సాధించడానికి, కర్బన  ఉద్గారాలను తగ్గించడం ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో  పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాధాన్యత పెరిగిందన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో జల విద్యుత్ పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. . పునరుత్పాదక శక్తిగా  సౌర, పవన  కూడా ఉన్నప్పటికీ జల విద్యుత్ లేకుండా 24 గంటల ఇంధన సరఫరా సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జల విధ్యుత్ సామర్థ్యాన్ని ఎక్కువ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని శ్రీ సింగ్ వివరించారు. 

"అరుణాచల్‌లో ఏర్పాటు కానున్న 13,000 మెగావాట్ల హైడల్ పవర్ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర , తలసరి ఆదాయాన్ని 4 రెట్లు పెరుగుతుంది"

భారతదేశ జల విద్యుత్ సామర్థ్యం పెరుగుతోందని  మంత్రి తెలిపారు.  సుబన్‌సిరి  ప్రాజెక్ట్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 13 ప్రాజెక్టుల నిర్మాణం  కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే అరుణాచల్‌ ప్రదేశ్ లో 13,000 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుందని  చెప్పారు. “ఈ ప్రాజెక్టులు దాదాపు 1.4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు అవుతాయి. దీనివల్ల రాష్ట్ర  తలసరి ఆదాయం నాలుగు రెట్లు పెరుగుతుంది.  దేశం స్వచ్ఛమైన ఇంధనం సరఫరా అవుతుంది.  అదేవిధంగా, జమ్మూ కాశ్మీర్‌లో ఐదు జల విధ్యుత్  ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌  జల ఇంధన రంగంలో  ముందుకు సాగుతోంది.  పెట్టుబడులు వస్తున్నాయి" అని  శ్రీ సింగ్ తెలిపారు.

"అందుబాటులో ఉన్న మా హైడల్ పవర్‌ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి"

దేశంలో అందుబాటులో ఉన్న జల విద్యుత్ సామర్థ్యాన్ని మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు తీసుకుంటున్న ప్రయత్నాలను మంత్రి వివరించారు. " ప్రస్తుతం  జల విద్యుత్ సామర్థ్యం 47,000 మెగావాట్లుగా ఉంది.  అందుబాటులో ఉన్న జల విద్యుత్ సామర్థ్యంలో  35%.మాత్రమే వినియోగంలోకి వచ్చింది.  అయితే అభివృద్ధి చెందిన దేశాలు తమకు  అందుబాటులో ఉన్న హైడ్రో పొటెన్షియల్‌లో దాదాపు 70% - 80% ఉపయోగించుకున్నాయి." అని శ్రీ సింగ్ తెలిపారు. 

దేశంలో పెరుగుతున్న  విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని ఎక్కువ చేయాల్సి ఉంటుందని   శ్రీ సింగ్  చెప్పారు. “గత సంవత్సరంతో పోలిస్తే 2023 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లలో  విద్యుత్ డిమాండ్ 20% పెరిగింది. నీతి ఆయోగ్ అంచనాల  ప్రకారం మన ఆర్థిక వ్యవస్థ రాబోయే రెండు దశాబ్దాల్లో 7.5%  వృద్ధి చెందుతుంది. అదే స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది.  2013లో గరిష్ట డిమాండ్ 1.35 లక్షల మెగావాట్లు ఉండగా, నేడు అది 2.31 లక్షల మెగావాట్లకు చేరుకుంది.  2030 నాటికి విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుంది; ఈ రోజు మొత్తం వినియోగం 1,600 బిలియన్ యూనిట్లు వరకు ఉంది. డిమాండ్  3,000 బిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం ఉంది  అయితే, ఇప్పుడు కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన విద్యుత్ వినియోగం తక్కువ.  యూరప్ లో  తలసరి విద్యుత్ వినియోగం ఈ రోజు మన కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది.  విద్యుత్ డిమాండ్‌ ఎంత వేగంగా వృద్ధి చెందుతుందో అంతే వేగంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని జోడించాల్సి ఉంటుంది. 

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోండి అని తెలిపిన మంత్రి   పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ సవాలును పరిష్కరించడానికి విద్యుత్ సామర్థ్యాన్ని ఎక్కువ చేస్తున్నామని వివరించారు.   “గతంలో దేశంలో  విద్యుత్ లోటు ఉండేది. కేంద్ర  ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో 1.9 లక్షల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని జోడించింది. ప్రస్తుతం దేశంలో అవసరాల మేరకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.  బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాలకు కూడా విద్యుత్ ఎగుమతి అవుతోంది.  పునరుత్పాదక రంగంలో దాదాపు 70,000 మెగావాట్లు , జల విద్యుత్ రంగంలో థర్మల్‌లో  27,000 మెగావాట్లు సామర్ధ్యం గల ప్రాజెక్టులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి.  2030 విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి 53,000 మెగావాట్ల  థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల విద్యుత్ అవసరాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీ స్పష్టం చేశారు.

ఇంధన పరివర్తనలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా మారిందని, భారతదేశం బాధ్యతాయుతమైన అభివృద్ధి పథంలో పయనిస్తోందని శ్రీ సింగ్ అన్నారు. “పారిస్‌లో జరిగిన  COP21 సమావేశంలో  2030 నాటికి ఇంధన అవసరాలను  40%  శిలాజేతర  ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేయడానికి భారతదేశం అంగీకరించింది.   ఈ లక్ష్యాన్ని తొమ్మిదేళ్ల ముందుగానే 2021లో భారతదేశం సాధించింది.  అభివృద్ధి చెందిన దేశాల కంటే వేగంగా భారతదేశం అభివృద్ధి సాధిస్తోంది. . అభివృద్ధి చెందిన దేశాలు శిలాజ ఇంధనాలను ఉపయోగించడం ద్వారా అభివృద్ధి చెందాయి. అందువల్ల, మన పెరుగుదలకు శిలాజ ఇంధనాలను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. భారతదేశ  తలసరి కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటులో మూడింట ఒక వంతు వరకు ఉన్నాయి.  అభివృద్ధి చెందిన దేశాల తలసరి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు ఉన్నాయి. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ లోడ్‌లో 80% అభివృద్ధి చెందిన దేశాల ఉద్గారాల కారణంగా ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతోంది.  ప్రపంచ జనాభాలో  17% జనాభా కలిగి ఉన్న భారతదేశంలో కర్బన ఉద్గారాల విడుదల శాతం మూడు వరకు మాత్రమే ఉంది " అని మంత్రి వివరించారు. 

సుబంసిరి దిగువ జలవిద్యుత్ ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా మంత్రితో పాటు  కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ అగర్వాల్ ,నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ సీఎండీ  శ్రీ. విష్ణోయ్, విద్యుత్ మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి  శ్రీ మహమ్మద్ అఫ్జల్; నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శ్రీ బిస్వజిత్ బసు, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ డైరెక్టర్ (టెక్నికల్) శ్రీ ఆర్.కే.  చౌదరి, సుబంసిరి దిగువ ప్రాజెక్ట్ హెచ్ఓపీ  శ్రీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు.

ఇవి  కూడా చదవండి:

 

 

***



(Release ID: 1980410) Visitor Counter : 91