ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనుభవజ్ఞుడైనగుజరాతీ ఫోటో జర్నలిస్టు శ్రీ జవేరీలాల్ మెహతా కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపినప్రధాన మంత్రి

Posted On: 27 NOV 2023 10:23PM by PIB Hyderabad

చిరకాల అనుభవం కలిగినటువంటి గుజరాతీ ఫోటో జర్నలిస్టు శ్రీ జవేరీలాల్ మెహతా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ఫోటో జర్నలిజం రంగం లో ఆయన దీర్ఘకాలం పాటు మరియు చక్కనైన వృత్తి లో అందించినటువంటి తోడ్పాటు ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు -

 

‘‘గుజరాత్ యొక్క ప్రసిద్ధ ఫోటో జర్నలిస్టు శ్రీ జవేరీలాల్ మెహతా యొక్క కన్నుమూత వార్త విని తీవ్ర దు:ఖం కలిగింది. పత్రికా ప్రపంచం లో దీర్ఘ వృత్తి జీవనాన్ని సాగించినటువంటి కాలం లో ఫోటో జర్నలిజం రంగం లో ఆయన అందించిన తోడ్పాటు ను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన ఆత్మ కు శాంతి ని ప్రసాదించవలసింది గా ఆ ఈశ్వరుడి ని ప్రార్థించడం తో పాటు గా శోక మగ్నులు అయిన ఆయన యొక్క కుటుంబాని కి ఇదే నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను..

ఓమ్ శాంతి.’’

 

 

***

DS/AK


(Release ID: 1980335) Visitor Counter : 93