సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
1 8

శాంతి సాధన కోసం కృషి:54 ఐఎఫ్ఎఫ్ఐలో ప్రతిష్టాత్మక ఐసీఎఫ్టీ- యునెస్కో గాంధీ మెడల్ కోసం పోటీ పడుతున్న పది చిత్రాలు


గాంధీ భావాలు, సిద్ధాంతాలు కథాంశాలుగా శాంతి, సహనం, అహింస, కరుణ ప్రాధాన్యత వివరించే విధంగా నిర్మాణం అయిన 54 ఐఎఫ్ఎఫ్ఐ ఐసీఎఫ్టీ- యునెస్కో చలనచిత్రాలు

గోవా

ఐసీఎఫ్టీ- యునెస్కో గాంధీ మెడల్ కోసం నామినేట్ అయిన పది అంతర్జాతీయ చలనచిత్రాలను 54వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్నారు.గాంధీ మెడల్ కోసం ఈ పది చిత్రాలు పోటీ పడుతున్నాయి.యునెస్కో గుర్తించిన  గాంధీ భావాలు, సిద్ధాంతాలు కథాంశాలుగా శాంతి, సహనం, అహింస, కరుణ ప్రాధాన్యత వివరించే విధంగా చిత్రాలను నిర్మించారు. గాంధీ ప్రబోధించిన  భావాలు, సిద్ధాంతాలు, తత్త్వం, ప్రపంచ శాంతి నేపథ్యంలో చలన చిత్రాలు రూపొందాయి. 

గాంధీ మెడల్ కోసం అందిన చిత్రాలను వడబోసిన అనంతరం పది చిత్రాలు తుది పోటీకి ఎంపిక అయ్యాయి.  శాంతి, సహనం, అహింస, కరుణ భావాలను నూతన కోణంలో చూపించడానికి చిత్రాల ద్వారా ప్రయత్నం జరిగింది.  సంఘర్షణలు, గందరగోళ పరిస్థితులతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో  శాంతి, సహనం, అహింస, కరుణ ద్వారా పరిష్కార మార్గాలు చూపించే ప్రయత్నం ఈ చిత్రాల ద్వారా జరిగింది. 

వివిధ దేశాలలో నిర్మాణం అయిన చిత్రాలు ఈ ఏడాది  ఐసీఎఫ్టీ- యునెస్కో గాంధీ మెడల్ కోసం పోటీ పడ్డాయి. తుది పోటీలో నిలిచిన చిత్రాలు : 

1.  ‘ఎ హౌస్ ఇన్ జెరూసలేం'

   ‘ఎ హౌస్ ఇన్ జెరూసలేం’కు ముయాద్ అలయన్ దర్శకత్వం వహించారు. (పాలస్తీనా, యూకే , జర్మనీ, నెదర్లాండ్స్, ఖతార్, 2022).

జెరూసలేంలో పాటిస్తున్న విభిన్న  సంస్కృతులు, నమ్మకాల నేపథ్యంలో మానవ సంబంధాలు ఎదుర్కొంటున్న  సంక్లిష్టత పరిస్థితులను  ఈ చిత్రం వివరిస్తుంది. జెరూసలేం   నగర చారిత్రక, రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రజలు వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలు, ఆకాంక్షలను చిత్రం  ద్వారా వివరించే ప్రయత్నం జరిగింది. 

2. సిటిజన్ సెయింట్’  (జార్జియా, 2023).

 సిటిజన్ సెయింట్ చిత్రానికి  టినాటిన్ కజ్రిష్విలి దర్శకత్వం వహించారు. జార్జియాలో నిర్మించిన  ఈ చిత్రం సామాజిక సవాళ్ల మధ్య నైతిక సమగ్రతను నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందింది. వ్యక్తిగత త్యాగం, ధర్మం కోసం జరిగిన  అన్వేషణ అంశాలు చిత్రంలో కనిపిస్తాయి. 

3. ‘డ్రిఫ్ట్’(యూకే,ఫ్రాన్స్, గ్రీస్, 2023)

 ఆంథోనీ చెన్  దర్శకత్వంలో  ‘డ్రిఫ్ట్’ రూపొందింది. 

వివిధ దేశాలతో ముడిపడి ఉన్న జీవితాలు ఆధారంగా చిత్రం నిర్మాణం అయ్యింది. గుర్తింపు, నాది అనే భావన, సంబంధాల  కోసం జరిగే  మానవ ప్రయత్నాలు ఆధారంగా చిత్రం రూపొందింది. . జీవితంలో చోటు చేసుకున్న అనుకోని సంఘటనల వల్ల  ఊహించని బంధాలు ఎలా ఏర్పాటు అవుతాయి అనే అంశాలను  ఈ చిత్రంలో చూపించారు. 

4. “ఇట్స్ సిరా” (ఫ్రాన్స్, జర్మనీ, సెనెగల్, 2023) 

 “ఇట్స్ సిరా” చిత్రం అపోలినే ట్రొరే దర్శకత్వంలో రూపొందింది. భౌగోళిక, సాంస్కృతిక సరిహద్దులను దాటి బలపడే  భాగస్వామ్య మానవ అనుభవాలు,, స్థితిస్థాపకత కథ ఆధారంగా చిత్ర నిర్మాణం జరిగింది. 

5.'కలేవ్'(ఎస్టోనియా, 2022)

 ఓవ్ మస్టింగ్  'కలేవ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎస్టోనియా దేశంలో నిర్మాణం అయిన  ఈ చిత్రం ఆ దేశ సాంస్కృతిక సారాంశం తో కూడిన కథ ఆధారంగా రూపొందింది.  జాతీయ చరిత్ర తో ముడిపడి ఉన్న వ్యక్తిగత ప్రయాణాలను చిత్రీకరిస్తుంది, వ్యక్తిగత, సామూహిక గుర్తింపు అంశాలను ప్రతిబింబిస్తుంది. 

6.‘ది ప్రైజ్’ (ఇండోనేషియా, 2022).

పాల్ ఫౌజాన్ అగస్టా దర్శకత్వంలో ‘ది ప్రైజ్’ (ఇండోనేషియా, 2022) నిర్మాణం జరిగింది. ఆశయ సాధన, లక్ష్యాలను సాధించే అంశాలలో ఎదురయ్యే సంక్లిష్టత పరిస్థితులను చిత్రంలో దర్శకుడు వివరిస్తాడు. ఇండోనేషియా కథ ఆధారంగా రూపొందిన  ఈ చిత్రం గుర్తింపు, సాధన కోసం చేసే ప్రయత్నాలలో  వ్యక్తులు ఎదుర్కొనే నైతిక సందిగ్ధ తలను పరిశీలిస్తుంది.

7.  ‘ది షుగర్ ఎక్స్‌పెరిమెంట్’ (స్వీడన్, 2022).

‘ది షుగర్ ఎక్స్‌పెరిమెంట్’ చిత్రానికి  జాన్ టోర్న్‌బ్లాడ్ దర్శకత్వం వహించారు. స్వీడన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం సామాజిక నిబంధనలు, వ్యక్తిగత ఎంపికల ప్రాధాన్యత తెలియజేస్తుంది. . సామాజిక నిర్మాణాలతో వ్యక్తిగత ప్రయోగాలు స్థాపించబడిన నమూనాలను ఎభావోద్వేగం,లా సవాలు చేస్తాయి అన్న అంశాన్ని చిత్రంలో ప్రస్తావించారు. 

8. ‘మండలి’ (భారతదేశం, 2023).

 రాకేష్ చతుర్వేది ఓం దర్శకత్వం  ‘మండలి’ (భారతదేశం, 2023) నిర్మాణం జరిగింది. భారతదేశంలో నిర్మించిన  ఈ చిత్రం స్నేహం, విధేయత, వ్యక్తిగత ఎదుగుదల అంశాలను ప్రస్తావిస్తుంది.చిత్రంలో  మానవ సంబంధాల  పరివర్తన శక్తి, మానవ సంబంధాల ప్రయోజనాలు చిత్రంలో కనిపిస్తాయి. 

9.మాలికాపురం’ (భారతదేశం, 2022).

విష్ణు శశి శంకర్ దర్శకత్వంలో మాలికాపురం నిర్మాణం జరిగింది. భారతదేశంలోని కేరళ సాంస్కృతిక నేపథ్యంలో రూపొందిన  ఈ చిత్రం సామాజిక అంచనాలు  మానవ  సంబంధాలపై చూపే ప్రభావాన్ని  చిత్రం వివరిస్తుంది. మానవ సంబంధాల మధ్య ఉండే భావోద్వేగం , తలెత్తే సంఘర్షణలను చిత్రంలో తెరకెక్కించారు. 

10. ‘రవీంద్ర కబ్యా రహస్య’.(భారతదేశం, 2023)

రవీంద్ర కబ్యా రహస్య’ చిత్రానికి సయంతన్ ఘోసన్ దర్శకత్వం వహించారు. భారతదేశం బెంగాల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వం  సారాంశాన్ని, మానవ భావోద్వేగాలు, మానవ  సంబంధాలలో అంతర్లీనంగా ఉన్న రహస్యాలను వివరిస్తుంది. 

 ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాలు రూపొందాయి. శాంతి ప్రధాన అంశంగా రూపొందిన ఈ చిత్రాలు శాంతి సాధన , నూతన ప్రపంచ అభివృద్ధి, , మానవత్వం సారాంశాన్ని హృదయాలకు హత్తుకునేలా రూపొందాయి. 

శాంతి, అహింస పై  మహాత్మా గాంధీ  దృక్పథాన్ని ఉత్తమంగా ప్రతిబింబించే చిత్రానికి ఐసీఎఫ్టీ పారిస్, యునెస్కో  గాంధీ మెడల్ ప్రదానం చేస్తారు.  ప్రతి సంవత్సరం  ఐఎఫ్ఎఫ్ఐలో అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. 1994 నుంచి ఐసీఎఫ్టీ- యునెస్కో గాంధీ మెడల్ అందిస్తున్నారు. 

 

***




(Release ID: 1979882) Visitor Counter : 101