సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మలయాళ చిత్రం ఆటమ్ ఐ ఎఫ్ ఎఫ్ ఐ 54లో భారతీయ పనోరమా ఫీచర్ ఫిల్మ్ విభాగాన్ని ప్రారంభించింది
ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రారంభ చిత్రం ఆటమ్‌కి దర్శకుడిగా గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు ఆనంద్ ఎకర్షి
ఆటం చాలా వ్యక్తిగతమైనది, ఇది కుటుంబ ప్రాజెక్ట్, నా హృదయానికి దగ్గరగా ఉంటుంది: నటుడు వినయ్ ఫోర్ట్
పోస్ట్ చేసిన తేదీ: 22 నవంబర్ 2023 మధ్యాహ్నం 2:43, పీ ఐ బీ ముంబై ద్వారా
ఐ ఎఫ్ ఎఫ్ ఐ 54లోని ఇండియన్ పనోరమా విభాగం సినీ-ప్రియులకు అద్భుతమైన సినిమా అనుభూతిని అందిస్తుంది, ఇది నిన్న మలయాళ చిత్రం ఆట్టంతో ప్రారంభం అయ్యింది.ఆనంద్ ఎకర్షి దర్శకత్వం వహించిన అట్టం ఒక వ్యక్తి మరియు సమూహం మధ్య కొన్ని అసౌకర్య పరిస్థితులలోని సంఘర్షణ ను అన్వేషిస్తుంది.
గోవాలో జరిగిన 54వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో మీడియాతో మాట్లాడుతూ ఆటమ్ సినిమా దర్శకుడు ఆనంద్ ఎకర్షి , “ఈ చిత్రం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏ లింగం లేదా పితృస్వామ్యానికి సంబంధించినది కాదు. ఇది వ్యక్తి మరియు సమూహం మధ్య సంఘర్షణ పొరలలో రూపొందించబడింది, ఇక్కడ సమూహం పురుషులు మరియు వ్యక్తి ఒక మహిళ. కథాంశం లింగ అధ్యయనంకి సంబంధించినదని, అయితే చిత్రం ప్రాంతం లేదా లింగ నిర్ధిష్టమైనది కాదని అన్నారు.
వినయ్ ఫోర్ట్ మరియు జరీన్ షిహాబ్ నేతృత్వంలోని తారాగణానికి మార్గనిర్దేశం చేస్తూ 140 నిమిషాల నిడివి గల ఈ సినిమ దృశ్య కావ్యానికి ఎకర్షి దర్శకత్వం వహించారు. చిత్రం యొక్క కథాంశం గురించి మాట్లాడుతూ, ఇది ఒక వ్యక్తి మరియు సమూహం మధ్య పెరుగుతున్న సంఘర్షణ ని ప్రదర్శిస్తుందని ఆయన చెప్పారు. "ఇది 12 యాంగ్రీ మెన్ నుండి ప్రేరణ పొందలేదు, కానీ ఇది సహజమైన పురోగతి, కానీ ఆ సినిమాతో పోల్చడం గౌరవంగా ఉంది" అని ఒక ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ ఆయన జోడించారు. కోవిడ్ మహమ్మారి కాలంలో స్నేహితులతో ఒక పర్యటనలో సాధారణ సంభాషణలో ఈ చిత్రం యొక్క ఆలోచన వచ్చిందని సినిమా ఎలా రూపొందించబడింది అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన వివరించారు.
కథానాయకుడు వినయ్ ఫోర్ట్, ఈ చిత్రం యొక్క కథా వస్తువు పుట్టుక గురించి మాట్లాడుతూ, అతను తన 20 సంవత్సరాల థియేటర్ స్నేహితులతో కలిసి ఒక పర్యటనలో ఉన్నానని పేర్కొన్నాడు, అక్కడ "మా స్నేహం, కలయిక మరియు కళను ఏదో ఒక విధంగా సూచించాలని మేము నిర్ణయించుకున్నాము. సినిమా చేయాలనే తలంపు రావటం" గ్రూప్‌లో అత్యంత "సృజనాత్మకంగా మరియు బాగా చదివే" ఆనంద్‌పై దాని బాధ్యత పడింది, అని ఫోర్ట్ జోడించారు. ఈ ఆలోచనే ఎట్టకేలకు ఆట్టం సినిమాగా రూపుదిద్దుకుంది. "అట్టం చాలా వ్యక్తిగతమైనది మరియు ఇది నా హృదయానికి దగ్గరగా ఉండే కుటుంబ ప్రాజెక్ట్" అని ఆయన చెప్పారు.
"ప్రతి నటుడి బలం మరియు పరిమితిని ఆయన అర్థం చేసుకున్నారు మరియు ఒక వీక్షకుడిగా అది గొప్ప ప్రదర్శనగా మార్చబడింది" అని ఆనంద్ దర్శకత్వ ప్రతిభ ను ఫోర్ట్ మెచ్చుకున్నారు. నటుడిగా అతనిని ఏది ప్రేరేపిస్తుంది అనే ప్రశ్నకు సమాధానం గా "ఉత్తేజకరమైన స్క్రిప్ట్, సవాలు చేసే పాత్ర మరియు ఇతర అంశాలు ముఖ్యమైనవి", అని ఫోర్ట్ వ్యాఖ్యానించాడు.
ఈ చిత్రం గురించి జరీన్ షిహాబ్ మాట్లాడుతూ, "సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది" అని అన్నారు. ఆమె దర్శకుడిని మెచ్చుకుంటూ, “చిత్రం కోసం థియేటర్ ఆర్టిస్టులు కలిసి రావడం చాలా బాగుంది మరియు ఆనంద్ చాలా తెలివిగా నాటక రంగ పరికరాలు మరియు అంశాలను సినీ తెరకు ఉపయోగించారు.”
దర్శకుడు ఎకర్షి మాట్లాడుతూ, తొమ్మిది మంది నటీనటులకు ఇది తొలి చిత్రం అని మరియు “థియేటర్ నుండి సినిమాకి మారడం ఒక ప్రక్రియ మరియు ఒక షాట్ కోసం నటించడం రంగస్థల నటులకు సవాలు. కెమెరాకు, సెట్‌కి అలవాటు పడేందుకు షూట్‌కు ముందు 35 రోజుల సీన్ రిహార్సల్స్ చేశాం, కాబట్టి రిహార్సల్స్ చాలా ముఖ్యమైనవి”.
సినిమా సౌండ్ డిజైనర్, రంగనాథ్ రవి ఒకే లొకేషన్‌లో 13 మంది నటీనటులతో షూటింగ్ చేయడంలోని సవాళ్ల గురించి మాట్లాడాడు, అయితే సౌండ్ డిజైన్ దానిని ఎలా ఆసక్తికరంగా మార్చింది, చిత్రానికి సూక్ష్మమైన పొరను ఎలా జోడించిందో వివరించారు.
ఆటం: ఈ డ్రామా చిత్రం అరంగు అనే నాటకాలు ఆడుకునే బృందం సభ్యులైన ఒక స్త్రీ మరియు పన్నెండు మంది పురుషుల చుట్టూ తిరుగుతుంది. గతంలో వినయ్ పోషించిన ప్రధాన పాత్ర నుండి భర్తీ చేయబడిన నటుడు హరి స్నేహితులైన క్రిస్ మరియు ఎమిలీ ద్వారా వారికి ఆఫర్ వచ్చినప్పుడు వారు అంతర్జాతీయంగా గుర్తింపు పొందే అవకాశం పొందుతారు. నాటకంలోని ఏకైక మహిళా కళాకారిణి అయిన అంజలి, వినయ్‌తో ప్రేమలో ఉంది మరియు క్రిస్ మరియు ఎమిలీ ఆతిథ్యం ఇచ్చిన పార్టీలో హరి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అతనికి చెప్పింది. వినయ్ ఈ విషయాన్ని మదన్‌తో పంచుకోవడం ద్వారా హరి యొక్క నిజమైన రంగును బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు, అతను మిగిలిన టీమ్‌తో చర్చించడానికి అంగీకరిస్తాడు మరియు చివరికి హరిని బహిష్కరించాడు. స్నేహాలు ప్రమాదంలో ఉన్నాయి కానీ డబ్బు స్వార్దం మరియు విజయం ప్రజల నైతిక నైతికతకు ప్రతిఫలమివ్వడానికి మరియు లంచం ఇవ్వడానికి ఒక సాధనంగా ఉపయోగించబడతాయి. సంఘటనలు కొనసాగుతున్నప్పుడు, వాస్తవాలు పొట్టవిప్పినప్పుడు సత్యం వింతగా అనిపిస్తుంది.
తారాగణం మరియు సాంకేతిక వర్గం
దర్శకుడు: ఆనంద్ ఎకర్షి
నిర్మాత: జాయ్ మూవీ ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పీ
రచయిత: ఆనంద్ ఎకర్షి
డిఓపి: అనురుధ్ అనీష్
ఎడిటర్: మహేష్ భువనంద్
తారాగణం: వినయ్ ఫోర్ట్, జరిన్ షిహాబ్
***
(Release ID: 1979365)
Visitor Counter : 126