ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఐటీ హార్డ్వేర్ కోసం పీఎల్ఐ పథకం - 2.0 కింద 27 తయారీదారులను ప్రభుత్వం ఆమోదం
Posted On:
18 NOV 2023 4:33PM by PIB Hyderabad
మొబైల్ ఫోన్ల ఉత్పత్తి కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్ఐ) విజయవంతమైన నేపథ్యంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 17మే 2023న ఐటీ హార్డ్వేర్ కోసం పీఎల్ఐ స్కీమ్ – 2.0ని ఆమోదించింది. ఈ పథకం ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ పీసీలను, సర్వర్లు మరియు అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ పరికరాలను కవర్ చేస్తుంది. 27 ఐటీ హార్డ్వేర్ తయారీదారుల దరఖాస్తులు ఈ రోజు ఆమోదించబడ్డాయి. ఏసర్, ఆసూస్, డెల్, హెచ్పీ, లెనోవో మొదలైన ప్రసిద్ధ బ్రాండ్ల ఐటీ హార్డ్వేర్లు భారతదేశంలోనే తయారు చేయబడతాయి. ఈ పథకం యొక్క కాలవ్యవధిలో ఈ ఆమోదం యొక్క ఆశించిన ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి:
• ఉపాధి: మొత్తం సుమారు 02 లక్షల మందికి
• దాదాపు 50,000 మందికి ప్రత్యక్షంగా మరియు దాదాపు 1.5 లక్షలు పరోక్షంగా
• ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తి విలువ: 3 లక్షల 50 వేల కోట్ల రూపాయలు (42 బిలియన్ US డాలర్లు)
• కంపెనీల ద్వారా పెట్టుబడి: 3,000 కోట్ల రూపాయలు (360 మిలియన్ US డాలర్లు)
పరిశ్రమల అధినేతలు మరియు మీడియాను ఉద్దేశించి, రైల్వే, కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ “అనుమతి పొందిన 27 మందిలో 23 మంది దరఖాస్తుదారులు జీరో రోజున తయారీని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు” అని తెలియజేశారు.
***
(Release ID: 1978068)