ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

డిజిటల్ ఇండియా ఆర్‌ఐఎస్‌సి-వి (డిఐఆర్-వి) ప్రోగ్రామ్‌పై దేశవ్యాప్తంగా రోడ్‌షోను ప్రారంభించిన మంత్రి రాజీవ్ చంద్రశేఖర్


“ ఆర్‌ఐఎస్‌సి-వి (డిఐఆర్-వి) ప్రోగ్రామ్ భారతదేశంలోని సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను మరింత ఉత్ప్రేరకపరిచేలా విద్యార్థులు, స్టార్టప్‌లు, వ్యవస్థాపకులకు అవకాశాలను అందిస్తుంది”: కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

శక్తి, వేగా ప్రాసెసర్లు డిఐఆర్-వి ఎకోసిస్టమ్ తో జతకూడి, స్టార్ట్-అప్‌లు, వ్యవస్థాపకులతో సహకారాన్ని ఏర్పరుస్తాయి

ఆవిష్కరణ, కార్యాచరణ, పనితీరు — ఇవి ఆర్‌ఐఎస్‌సి-వి (డిఐఆర్-వి) ప్రోగ్రామ్ భవిష్యత్తు కోసం మంత్రాలు

“భవిష్యత్తు ఉజ్వలమైనది, భవిష్యత్తు భారతదేశానికి డిఐఆర్-వి”: కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 17 NOV 2023 1:06PM by PIB Hyderabad

కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ డిజిటల్ ఇండియా  ఆర్‌ఐఎస్‌సి-వి (డిఐఆర్-వి) ప్రోగ్రామ్‌పై దేశవ్యాప్తంగా రోడ్‌షోను ప్రారంభించారు. ఈ రోడ్‌షోను సి-డాక్, ఐఈఈఈ ఇండియా కౌన్సిల్,  ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా   ఆర్‌ఐఎస్‌సి-వి డిజైన్ ఏరియాలోని గ్లోబల్ లీడర్‌ల భాగస్వామ్యంతో 17-18 నవంబర్ 2023న నిర్వహిస్తోంది.  

2022లో మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించిన డిజిటల్ ఇండియా ఆర్‌ఐఎస్‌సి-వి (డిఐఆర్-వి) కార్యక్రమంలో భాగంగా - (ఏ) 32-బిట్/ 64-బిట్ శక్తి ప్రాసెసర్‌లు 180ఎన్ఎం (ఎస్సిఎల్ ఫౌండరీ), 22ఎన్ఎం, (ఇంటెల్ ఫౌండ్రీ) ఐఐటీ మద్రాస్ ద్వారా, (బి) ఐఐటీ బాంబే ద్వారా 180ఎన్ఎం వద్ద 32-బిట్ అజిత్ ప్రాసెసర్ (ఎస్సిఎల్ ఫౌండ్రీ), (సి) 130ఎన్ఏఎం వద్ద 32-బిట్ వెగా ప్రాసెసర్‌లు (సిల్టెర్రా ఫౌండ్రి), 180ఎన్ఎం వద్ద 64-బిట్ వెగా ప్రాసెసర్‌లు ( ఎస్సిఎల్ మొహాలి) సి-డాక్  ద్వారా విజయవంతమైన ఫలితాలు బయటకొచ్చాయి.  

సి-డాక్ ఇప్పుడు వెగా  ప్రాసెసర్ చిప్ ఆధారంగా అరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్‌ల శ్రేణిని సృష్టించింది. అరీస్ మైక్రో, అరీస్ వి2, అరీస్ వి3, అరీస్ ఐఓటి, అరీస్ డాట్. ఈ పూర్తి స్వదేశీ, 'మేడ్ ఇన్ ఇండియా' డెవలప్‌మెంట్ కిట్‌లు బోధన,ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్, ఐఓటి అప్లికేషన్‌లను లక్ష్యంగా అభివృద్ధి జరిగాయి. బోర్డులు,  ఆర్‌ఐఎస్‌సి-వి ఐఎస్ఏ-కంప్లైంట్ వెగా ప్రాసెసర్‌పై నిర్మించారు. ఇవి సులభంగా ఉపయోగించగల హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌తో వస్తాయి.

 

ఓపెన్ సోర్స్ టెక్నాలజీలను రూపొందించడం మరియు స్వీకరించడంపై ప్రధాని మోదీ వేసిన విజన్‌ను సాకారం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ డిఐఆర్-వి ఫ్యామిలీ  చిప్స్, సిస్టమ్స్ చుట్టూ ఆవిష్కరింపజేయడంలో భారతదేశం అగ్రగామి దేశంగా ఉద్భవించాలనే లక్ష్యంతో డిఐఆర్-వి పర్యావరణ వ్యవస్థ వృద్ధిని సాధించడంపైనే మన ప్రధాన దృష్టి. ఈ కార్యక్రమం ఓపెన్ సోర్స్ టెక్నాలజీలను రూపొందించి, వాటిని అవలంబించాలనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ జి దృష్టిని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్టార్ట్-అప్‌లు, విద్యార్థులు, వ్యవస్థాపకులు  డిఐఆర్-వి -ఆధారిత చిప్‌లు, సిస్టమ్‌లను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు, చివరికి భారతదేశం సెమీకండక్టర్ నేషన్‌గా మారడానికి దోహదపడుతుంది.

ఈ కార్యక్రమం  డిఐఆర్-వి - ఆధారిత చిప్‌లు, సిస్టమ్‌లు మనం రోజూ ఉపయోగించే వివిధ డిజిటల్ ఉత్పత్తులలో ఏవిధంగా అనుసంధానం చేయబడిందో కూడా మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. "గత 50 సంవత్సరాలలో, కంప్యూటర్ ప్రాసెసర్‌లు అనేక ఆలోచనలతో అభివృద్ధి చెందాయి, చివరికి ప్రతి ఒక్కరూ అనుసరించే ఒక ప్రధాన డిజైన్‌పై స్థిరపడ్డారు. ఇప్పుడు, మా దృష్టి  డిఐఆర్-వి   ప్రోగ్రామ్‌పై ఉంది,  డిఐఆర్-వి - ఆధారిత చిప్‌లు, సిస్టమ్‌లు రోజువారీ ఉపయోగించే వివిధ డిజిటల్ ఉత్పత్తులలో విలీనం చేయబడిన భవిష్యత్తుకు మార్గం వేస్తుంది. భారతదేశం కూడా ప్రధాన ప్రభుత్వ ప్రాజెక్టులలో ఆర్ఐఎస్సి-వి ని స్వీకరించింది,  ఆర్ఐఎస్సి-వి చుట్టూ స్టార్టప్ పరిశోధన, ఆవిష్కరణలలో వృద్ధిని సాధించింది.  ఆర్ఐఎస్సి-వి -ఆధారిత డిజైన్‌లపై పనిచేస్తున్న అనేక స్టార్టప్‌లను భారతదేశం నిర్వహిస్తోంది, ఇవి ఎంఈఐటివై ఫ్యూచర్డిజైన్ చొరవలో భాగమే. ఉదాహరణకు, ఇన్‌కోర్ సెమీకండక్టర్స్ కాన్ఫిగర్ చేయదగిన  ఆర్ఐఎస్సి-వి ప్రాసెసర్ కోర్‌లను అభివృద్ధి చేస్తోంది, మైండ్‌గ్రోవ్ టెక్నాలజీస్ ఫాల్ట్-టాలరెంట్ సిస్టమ్‌లపై పనిచేస్తోంది. మార్ఫింగ్ మెషీన్లు మల్టీ-కోర్ రీకాన్ఫిగరబుల్ సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తోంది, ”అని మంత్రి తెలిపారు.

రోడ్‌షోలో పాల్గొనే 1500 మందికి  డిఐఆర్-వి వెగా సిరీస్ ప్రాసెసర్‌లు, వాటి పర్యావరణ వ్యవస్థపై విలువైన అంతర్దృష్టులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది, డెవలప్‌మెంట్ బోర్డులు, ఎస్డికే, అప్లికేషన్ డెవలప్‌మెంట్‌తో సహా సైద్ధాంతిక, ఆచరణాత్మక అంశాలను కవర్ చేస్తుంది. అర్దుయినో-అనుకూలమైన అరీస్  డెవలప్‌మెంట్ బోర్డులను ఉపయోగించి హ్యాండ్-ఆన్ సెషన్‌లు నిర్వహించబడతాయి. ఇది సిఫైవ్‌లో చీఫ్ ఆర్కిటెక్ట్, యుసి బర్కిలీ ప్రొఫెసర్‌ క్రిస్ట్ అసానోవిక్, తో సహా ప్రముఖ గ్లోబల్ లీడర్‌ల ప్రసంగాలు కూడా దీనిలో ఉంటాయి. ఆర్ఐఎస్సి-వి  ఇంటర్నేషనల్ సీఈఓ కాలిస్టా రెడ్‌మండ్వెంటానా మైక్రో సిస్టమ్స్ సీఈఓ బాలాజీ బక్తా ; ఐఐటీ మద్రాస్ డైరెక్టర్,   డిఐఆర్-వి  ప్రోగ్రామ్ చీఫ్ ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్  కామకోటి కూడా ఈ జాబితాలో ఉన్నారు. 

ఈ ఈవెంట్ భారతదేశంలోని 15 విద్యాసంస్థలలో ఏకకాలంలో నిర్వహించబడుతోంది: అలయన్స్ యూనివర్సిటీ - బెంగళూరు, అమృత యూనివర్సిటీ - బెంగళూరు, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ - హైదరాబాద్, చండీగఢ్ యూనివర్సిటీ - పంజాబ్, కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - కేరళ, గురు తేగ్ బహదూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఢిల్లీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - మధ్యప్రదేశ్, కీట్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ - ఘజియాబాద్, కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం - ఆంధ్రప్రదేశ్, మోడీ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - రాజస్థాన్, నేతాజీ సుభాష్ ఇంజినీరింగ్ కాలేజ్ - పశ్చిమ బెంగాల్, పిఎస్జి కాలేజ్ టెక్నాలజీ ఆఫ్ టెక్నాలజీ - తమిళనాడు, ఠాకూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ - మహారాష్ట్ర, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ - తెలంగాణ మరియు వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) - తమిళనాడు.

***



(Release ID: 1977954) Visitor Counter : 99