వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో పాల్గొన్న శ్రీ పీయూష్ గోయల్


సురక్షిత, విశ్వసనీయం సరఫరా గొలుసుల అభివృద్ధికి ప్రపంచ దేశాలు కలిసి కృషి చేయాలి.. శ్రీ పీయూష్ గోయల్
దక్షిణ-దక్షిణ సహకారం భవిష్యత్ వాణిజ్యానికి పునాదిని బలోపేతం చేస్తుంది: శ్రీ గోయల్

Posted On: 17 NOV 2023 5:17PM by PIB Hyderabad

సురక్షిత, విశ్వసనీయం సరఫరా గొలుసుల అభివృద్ధికి దక్షిణ  దేశాలు కలిసి కృషి చేయాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ,  జౌళి శాఖ మంత్రి  శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. పటిష్ట సరఫరా గొలుసు అభివృద్ధికి అమలు చేయాల్సిన కార్యక్రమాలు,,ఆర్గాలపై ప్రపంచ దేశాల మధ్య చర్చలు జరగాలని ఆయన అన్నారు. . ఈరోజు జరిగిన 2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సులో  శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడారు.

కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం, వాతావరణ మార్పుల ప్రభావం,పెరుగుతున్న  భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో  ప్రపంచ సరఫరా వ్యవస్థ లోపాలు బయటపడ్డాయని  శ్రీ గోయల్ అన్నారు. ఈ లోపాలు ప్రపంచ ఆహారం, ఇంధన భద్రత, జీవన వ్యయం,  సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ప్రతికూల ప్రభావం చూపించాయని ఆయన పేర్కొన్నారు.దక్షిణ  దేశాల వల్ల సమస్యలు తలెత్తలేదని అయితే సమస్యలు దక్షిణ దెహస్లాపై ప్రభావం చూపిస్తున్నాయని  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్న మాటలను శ్రీ గోయల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి ప్రపంచ దేశాల మధ్య సమిష్టి కృషి జరగాలని ఆయన అన్నారు.  

దక్షిణ దేశాల సహకారంతో  "ఒక భూమి, ఒకే కుటుంబం,ఒక భవిష్యత్తు" అనే ఇతివృత్తంతో  సెప్టెంబర్‌లో న్యూ ఢిల్లీలో జరిగిన జీ- 20 సదస్సును  భారతదేశం విజయవంతంగా నిర్వహించిందని శ్రీ గోయల్ అన్నారు. జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారతదేశం నిర్వర్తించిన సమయంలో  ఆఫ్రికన్ యూనియన్‌ దేశాలకు జీ-20 లో  శాశ్వత సభ్యత్వం లభించిందని శ్రీ  గోయల్ వివరించారు.దీనివల్ల  దక్షిణ దేశాలు ప్రపంచంపై ప్రభావం చూపించే విధంగా పనిచేయడానికి అవకాశం కాలుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ మానవాళి భవిష్యత్తు  కోసం దక్షిణ దేశాలు మరింత పటిష్టం కావాల్సి ఉంటుందన్నారు.  

జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారతదేశం నిర్వర్తించిన  సమయంలో ప్రపంచ సరఫరా వ్యవస్థను  స్థితిస్థాపకంగా పటిష్టం  చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిందని శ్రీ గోయల్ తెలిపారు.ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో  దక్షిణ దేశాలు కీలక పాత్ర పోషించే విధంగా ప్రణాళిక రూపొందిందన్నారు.ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో దక్షిణ దేశాల పాత్ర పెరగడం వల్ల ఈ ప్రాంత ప్రజల ప్రయోజనం కలుగుతుందన్నారు. సంబంధిత వర్గాల మధ్య సహకారం, విశ్వాసం పెంపొందించి  పారదర్శకతతో వ్యవస్థ పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందిందన్నారు. నష్టాలను అంచనా వేయడానికి వ్యవస్థ అనుమతిస్తుందని శ్రీ గోయల్ తెలిపారు.  సమాచార విశ్లేషణ, ప్రాతినిధ్యం ఆధారంగా వ్యవస్థ పనిచేస్తుందని వివరించారు. ప్రతి దేశానికి అవసరమైన వ్యవస్థను గుర్తించి అభివృద్ధి చేయడానికి ఈ విధానం ఉపకరిస్తుందని శ్రీ గోయల్ వివరించారు..భాగస్వామ్య దేశాలు తమ సామర్థ్యాలనుపెంపొందించుకుని రంగాలు, ఉత్పత్తుల వారీగా అవకాశాలను గుర్తించి  జివిసిఎస్‌ ద్వారా ప్రయోజనం పొందడానికి కృషి చేయాలని ఆయన సూచించారు.అమలులోకి వచ్చిన తర్వాత . స్థితిస్థాపకత,చేరికకు సంబంధించి ఎదురవుతున్న నాలుగు కీలక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 

ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థ వల్ల   దక్షిణ దేశాలకు సంబంధించిన ప్రధాన అంశాలను శ్రీ గోయల్ ప్రస్తావించారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో  ప్రతి దేశం తమ భాగస్వామ్యాన్ని పెంచుకోవడమే కాకుండా, విలువ గొలుసులు పెంచడం ద్వారా తమ భాగస్వామ్య నాణ్యతను మెరుగు పరచుకోవడంపై దృష్టి సారించాల్సి ఉంటుందని  శ్రీ గోయల్ వ్యాఖ్యానించారు.దీనివల్ల  అధిక విలువ జోడించిన భాగాలలో అత్యధిక వాటా  పొందేందుకు సహాయపడుతుంది.  సహజ , మానవ ప్రేరేపిత సమస్యలు  తట్టుకోవడానికి జివిసిఎస్‌ సహాయపడుతుందని ఆయన అన్నారు.  అంతర్జాతీయ మార్కెట్లు, వాణిజ్యంలో  సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల మెరుగైన ఏకీకరణ.జరుగుతుందని రవాణా సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి పేర్కొన్నారు.  సమస్యల పరిష్కారం వల్ల  ప్రపంచ వాణిజ్యంలో దక్షిణ దేశాల పాత్ర, భాగస్వామ్యం మరింత పెరుగుతుందన్నారు. దక్షిణ దేశాలు  కలిసి పని చేస్తే, మొత్తం వృద్ధి ,శ్రేయస్సులో ప్రాంత వాటా పెరిగి, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రపంచ వాణిజ్య రంగంలో ఇప్పటికే  దక్షిణ దేశాలు ప్రభావం చూపుతున్నాయని శ్రీ గోయల్ అన్నారు.  దక్షిణ-దక్షిణ వాణిజ్యం ఆరు సంవత్సరాల కాలంలో ఆరు రెట్లు పెరిగిందన్నారు.  1995లో 600 బిలియన్ యుఎస్ డాలర్ల  వరకు సాగిన వాణిజ్యం  2021 నాటికి 5.3 ట్రిలియన్ యుఎస్ డాలర్లకు పెరిగిందన్నారు. 

జీ-20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో  అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ప్రయోజనం కలిగించే విధంగా  మెరుగైన స్థానిక విలువల కల్పనతో సహా ప్రపంచ వాణిజ్యంలో సమర్థవంతంగా పాల్గొనడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రాధాన్యతను గుర్తించిందని శ్రీ గోయల్ తెలిపారు. భారతదేశం చేసిన కృషి వల్ల అవసరమైన వనరులు అందించడానికి జీ-20 అంగీకరించిందని ఆయన తెలిపారు. భారతదేశం చేసిన కృషికి సహకారం అందించిన దక్షిణ దేశాలను ఆయన అభినందించారు. భారతదేశం ప్రారంభించిన కృషి కొనసాగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం  డిజిటల్ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని శ్రీ గోయల్ తెలిపారు. ప్రజలకు నేరుగా సేవలు అందించడానికి డిజిటల్ రంగం అవకాశం కల్పిస్తుందన్నారు.  . న్యాయమైన, సమానమైన ప్రపంచ వాణిజ్యాన్ని పెంపొందించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని  వాణిజ్య , పరిశ్రమల మంత్రి తెలిపారు. జీ-20 న్యూఢిల్లీ డిక్లరేషన్ రెండు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన అన్నారు.   ఆర్థిక వ్యవస్థల్లో ఎంఎస్ఎంఈ రంగం  పోషిస్తున్న పాత్రను న్యూఢిల్లీ డిక్లరేషన్ గుర్తించిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో  ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే అంశంలో  దేశాలు  ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లుగా వాణిజ్య సంబంధిత సమాచారం, మార్కెట్‌కు ప్రాప్యతను గుర్తించిందన్నారు.తగినంత సమాచారం అందుబాటులో  లేకపోవడం వల్ల  ఎంఎస్ఎంఈ  యూనిట్లు  మార్కెట్‌లను గుర్తించలేకపోతున్నాయి, వ్యాపార అవకాశాలు, కస్టమర్‌లు, పోటీదారులు, పంపిణీ విధానాలు, స్థానిక నియమాలు మరియు నిబంధనలు మరియు పన్నుల గురించి వారికి పరిమిత జ్ఞానం ఉందని ఆయన అన్నారు. దీనివల్ల ఎక్కువ పరిమాణంలో  స్థిరమైన నాణ్యత, జాతీయ ప్రమాణాలు,సాధారణ సరఫరా అవసరమయ్యే మార్కెట్ అవకాశాలను ఎంఎస్ఎంఈ ఉపయోగించుకోలేక పోతున్నాయి అని మంత్రి వివరించారు.   అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాల అప్‌గ్రేడేషన్‌లో  ఎంఎస్ఎంఈ  ల సమాచార ప్రాప్యతను మెరుగుపరచడానికి చర్య కోసం జైపూర్ తీర్మానాన్ని జీ-20 ఆమోదించిన అంశాన్ని శ్రీ గోయల్ గుర్తు చేశారు. వ్యాపారం  వాణిజ్య సంబంధిత సమాచారాన్ని కోరుకునే  ఎంఎస్ఎంఈ లకు   వన్ స్టాప్ హబ్‌గా పని చేస్తుంది. ప్రపంచ వాణిజ్యంలో  తమ ఎంఎస్‌ఎంఈలను మెరుగ్గా ఏకీకృతం చేసేందుకు అన్ని భాగస్వామ్య దేశాలు కృషి చేయాలని  ఆయన కోరారు.

 వాణిజ్య పత్రాల డిజిటలైజేషన్‌ను పెంచడం ద్వారా వాణిజ్య ఖర్చు తగ్గింపులపై దృష్టి సారించినట్లు శ్రీ గోయల్ తెలిపారు. దేశీయ అవసరాల కోసం డాక్యుమెంట్‌ల డిజిటలైజేషన్‌తో సంబంధం లేకుండా, అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన పత్రాలు ఇప్పటికీ డిజిటలైజేషన్‌  చేయలేదని ఆయన తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకంగా ఉండే  ఎలక్ట్రానిక్ బిల్ ఆఫ్ లాడింగ్ ను డిజిటలైజేషన్‌ చేయడం వల్ల  ప్రత్యక్ష ఖర్చులు తగ్గుతాయని,  అర బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని మంత్రి వివరించారు. వాణిజ్య పత్రాల డిజిటలైజేషన్ కోసం జీ-20 10 ఉన్నత స్థాయి విధానాలు  ఆమోదించింది. ఈ విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా కాగిత రహిత వాణిజ్య కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయని తెలిపిన శ్రీ గోయల్ దీనికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు.  వాణిజ్య వ్యయాన్ని తగ్గించడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ  ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు.

పని విధానం, భవిష్యత్తులో పని  ఎలా జరుగుతుంది అనే విషయంలో  ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని  శ్రీ గోయల్ అన్నారు.  పరిశ్రమ 4.0, ఎనర్జీ ట్రాన్సిషన్ మరియు న్యూ ఏజ్ టెక్నాలజీల ద్వారా పని  భవిష్యత్తుఆధారపడి ఉంటుందన్నారు. ,  ప్రపంచ కార్యస్థలం, శ్రామికశక్తి స్థాయిలో మార్పులు  వస్తున్నాయన్నారు.  సాంకేతిక విద్య, పరిశోధన,అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం,సంబంధిత సేవల విస్తరణలో గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారం అవసరమని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. 

****



(Release ID: 1977782) Visitor Counter : 44