గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

2014 నుంచి పట్టణ పథకాలపై వ్యయం గణనీయంగా పెరిగింది: గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పూరి


దేశంలోని పట్టణ ప్రాంతాల్లో వలయ ఆర్థిక వ్యవస్థను సాధించడంపై ప్రభుత్వం దృష్టిని హర్దీప్ ఎస్ పూరి నొక్కిచెప్పారు.

మన నగరాల్లో వ్యర్థ పదార్థాల నిర్వహణ విలువ గొలుసు అంతటా ఆవిష్కరణలను ప్రారంభించేందుకు సిటీస్ 2.0 చొరవ: హర్దీప్ ఎస్ పూరి

సిటీస్ 2.0 ఛాలెంజ్‌ను ఈరోజు హర్దీప్ ఎస్ పూరి ప్రారంభించారు

స్మార్ట్ సిటీ ఎస్ పీ వీలు తమ దరఖాస్తులను సిటీస్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా 28 ఫిబ్రవరి 2024లోపు సమర్పించాలి

Posted On: 16 NOV 2023 3:03PM by PIB Hyderabad

" మన నగరాల్లో వ్యర్థ పదార్థాల నిర్వహణ విలువ గొలుసు అంతటా ఆవిష్కరణలను ప్రారంభించేందుకు స్వచ్ఛ భారత్ మిషన్‌తో కలిసి సిటీస్ 2.0 స్మార్ట్ సిటీస్ మిషన్‌ను పూర్తి చేస్తుంది" అని గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాలు మరియు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి అన్నారు. సిటీస్ 2.0 ఛాలెంజ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  గోబర్ ధన్ మిషన్‌తో సంయుక్తం గా సేంద్రీయ వ్యర్థాల నుండి బయో-ఇంధనాలను ఉత్పత్తి చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఉన్న మొత్తం 100 స్మార్ట్ సిటీలను ఛాలెంజ్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు మరియు గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క పూర్తి మద్దతు మరియు మార్గదర్శకత్వం గురించి వారికి హామీ ఇచ్చారు.

 

సిటీస్ 2.0ని 31 మే 2023న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. సిటీస్ 2.0 ఛాలెంజ్‌ని కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఈరోజు అంటే 16 నవంబర్ 2023న ఇక్కడ ప్రారంభించారు. భారతదేశంలో యూరోపియన్ యూనియన్ రాయబారి శ్రీ హెర్వే డెల్ఫిన్ మరియు గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

సిఐటిఐఐఎస్ కార్యక్రమానికి, స్మార్ట్ సిటీస్ మిషన్‌కు సహకరించిన అంతర్జాతీయ భాగస్వాములకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సిటీస్ 2.0 కోసం మొత్తం నిధులు రూ.1,760 కోట్లు లేదా ఏ ఎఫ్ డి  మరియు కే ఎఫ్ డబ్ల్యూ  (ఒక్కొక్కటి ఈ యూ ఆర్  100 మిలియన్లు) నుండి  ఈ యూ ఆర్ 200 మిలియన్లు, ఈ కార్యక్రమానికి సాంకేతిక సహాయ గ్రాంట్  ఈ యూ  నుండి రూ.106 కోట్లు (ఈ యూ ఆర్ 12 మిలియన్లు) అందిస్తాయి.

 

సభను ఉద్దేశించి శ్రీ పూరి మాట్లాడుతూ సిటీస్ 1.0 సాధించిన విజయాలను హైలైట్ చేశారు, దీనిలో భాగంగా 1,000 కంటే ఎక్కువ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టారు; 100 కిలోమీటర్లకు పైగా మోటారు లేని రవాణా కారిడార్ల అభివృద్ధి; 750 ఎకరాలకు పైగా పచ్చని ఖాళీ స్థలాల సృష్టి; మరియు 1,400 సరసమైన గృహాల యూనిట్ల నిర్మాణం; 350 విద్యా సౌకర్యాలు మరియు 51 ఆరోగ్య సౌకర్యాల ఏర్పాటు జరిగాయి. హుబ్బళ్లి-ధార్వాడ్‌లోని సిటీస్ ప్రాజెక్ట్ ఇటీవల గౌరవ రాష్ట్రపతి నుండి ఇన్నోవేషన్ కేటగిరీ కింద స్మార్ట్ సిటీ అవార్డు–2022 గెలుచుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

 

భారతదేశంలో పట్టణీకరణ రంగం వృద్ధి మరియు అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని శ్రీ హర్దీప్ సింగ్ పూరి అన్నారు, దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ కార్యక్రమాన్ని చేపడుతోందని అన్నారు. 2004 మరియు 2014 మధ్య 10 సంవత్సరాల కాలంతో పోల్చితే 2014 నుండి, పట్టణ అభివృద్ధిలో మొత్తం పెట్టుబడులు 10 రెట్లు పెరిగి 18 లక్షల కోట్లకు పైగా చేరాయని ఆయన హైలైట్ చేశారు.

 

దేశంలోని పట్టణ ప్రాంతాల్లో వలయ ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇప్పటికే 112 బయో-మిథనేషన్ ప్లాంట్లు, 2,391 వ్యర్థాల నుండి కంపోస్ట్ ప్లాంట్లు, 55 వ్యర్థాల నుండి-విద్యుత్ ప్లాంట్లు, 2,281 మెటీరియల్ రికవరీ సౌకర్యాలు, 972 నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్లాంట్లు మరియు 335 ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు.. “అమృత్ మరియు అమృత్ 2.0 మన నగరాలను తాగునీటి భద్రతలో  పరివర్తనాత్మక పురోగతిని సాధించాయి. ఎస్ బీ ఎం -యూ 2.0 మన నగరాలను చెత్త రహితంగా మారుస్తుంది మరియు దేశంలోని గతం నుంచి పోగుబడ్డ వ్యర్థాలను తొలగిస్తుంది” అని ఆయన అన్నారు.

 

సిటీస్ 2.0:

 

వాతావరణ మార్పుల ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి భారతదేశం యొక్క హామీలు నెరవేర్చే దిశలో సిటీస్ 2.0 ఒక ముఖ్యమైన ముందడుగు. నవంబర్ 2021లో గ్లాస్గోలో జరిగిన వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్, కాప్ 26 సందర్భంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశ వాతావరణ చర్యల యొక్క ఐదు అమృత అంశాలను (పంచామృతం) సమర్పించారు, ఇందులో 2070 నాటికి భారత్ నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం కూడా ఉంది. ఈ దృక్పథాన్ని మరింతగా పెంచుతూ, ఎం ఒ హెచ్ యూ ఏ  కొనసాగుతున్న మిషన్‌ల ద్వారా వాతావరణ మార్పులను పరిష్కరించడానికి వివిధ చర్యలను చేపట్టింది, వీటిలో స్మార్ట్ సిటీస్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ మరియు అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ మొదలైనవి ఉన్నాయి. సిటీస్ 2.0 కార్యక్రమం భారత ప్రభుత్వం మరియు ఎం ఒ హెచ్ యూ ఏ యొక్క వాతావరణ సంరక్షణ కార్యక్రమాలను  మూడు స్థాయిలలోని ప్రభుత్వం దాని ప్రత్యేకమైన కృషి ద్వారా భర్తీ చేయాలని భావిస్తుంది.

 

సిటీస్ 2.0 అనేది సిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ (సిటీస్) ప్రోగ్రామ్ యొక్క రెండవ దశ. ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏ ఎఫ్ డి),  కే ఎఫ్ డబ్ల్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్ మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ ఐ యూ ఏ) సహకారంతో  ఎం ఎం ఒ హెచ్ యూ ఏ దీనిని రూపొందించింది:

 

సమీకృత వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించి వలయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే దిశలో పోటీతత్వం తో ఎంపికైన ప్రాజెక్ట్‌ల ద్వారా పట్టణ వాతావరణ చర్యలో పెట్టుబడులను సమకూర్చడం.

 

సాక్ష్యం-ఆధారిత విధానాల ద్వారా రాష్ట్రాలు మరియు నగరాల్లో వాతావరణ-సున్నితమైన ప్రణాళిక మరియు చర్యను ప్రోత్సహించడం.

 

భారతదేశంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల కోసం సంస్థాగత యంత్రాంగాలు, పరపతి భాగస్వామ్యాలు మరియు నాయకత్వ సామర్ధ్య నిర్మాణం ను రూపొందించడం లక్ష్యం 

 

సిటీస్ 2.0కి రూ.1,866 కోట్ల (ఈ యూ ఆర్ 212 మిలియన్లు) బాహ్య నిధుల ద్వారా నిధులు సమకూరుతాయి. ఇందులో ఏ ఎఫ్ డి మరియు  కే ఎఫ్ డబ్ల్యూ నుండి ఒక్కొక్కటి ఈ యూ ఆర్100 మిలియన్ల రుణం, అంటే, రూ. 1,760 కోట్ల (ఈ యూ ఆర్ 200 మిలియన్లు) మొత్తం రుణం మరియు ఈ యూ నుండి రూ. 106 కోట్ల (ఈ యూ ఆర్ 12 మిలియన్లు) సాంకేతిక సహాయం గ్రాంట్ గా అందిస్తారు. ఎన్ ఐ యూ ఏ లోని సిటీస్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్ ద్వారా ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది.

 

స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఉన్న మొత్తం 100 ఎస్ పీ వీలు సిటీస్ 2.0 ప్రోగ్రామ్ కింద సహాయం పొందేందుకు అర్హులు. సమగ్ర వ్యర్థ నిర్వహణ పై దృష్టి సారించి వలయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే 18 వరకు వినూత్న ప్రాజెక్టులు సహాయం కోసం ఎంపిక చేయబడతాయి.  ప్రతి ప్రాజెక్ట్ కోసం సిటీస్ గ్రాంట్  మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 80%, రూ.135 కోట్ల వరకు పరిమితం చేయబడుతుంది (ఈశాన్య మరియు గిరిజన రాష్ట్రాల  విషయంలో మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 90%). అదనపు నిధులు, అంటే, మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 20% రాష్ట్ర/స్థానిక ప్రభుత్వాలు (ఈశాన్య మరియు కొండ రాష్ట్రాల విషయంలో మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 10%)  ఎంపికైన నగరం సొంత మూలధన నిధులు సమీకరించబడతాయి.

 

స్మార్ట్ సిటీ ఎస్ పీ వీలు తమ దరఖాస్తులను సిటీస్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా 28 ఫిబ్రవరి 2024లోపు సమర్పించాల్సి ఉంటుంది.

 

***



(Release ID: 1977545) Visitor Counter : 43