ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

జమ్ము- కశ్మీర్ లోని డోడా లో బస్సు దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి

Posted On: 15 NOV 2023 2:56PM by PIB Hyderabad

జమ్ము- కశ్మీర్ లోని డోడా లో జరిగిన ఒక బస్సు దుర్ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలియజేశారు. ఈ బస్సు ప్రమాదం లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున మరియు ఈ బస్సు ప్రమాదం లో గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు.



ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘జమ్ము- కశ్మీర్ లోని డోడా లో జరిగిన బస్సు దుర్ఘటన దు:ఖదాయకం గా ఉంది. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు సాధ్యమైనంత త్వరలో పున:స్వస్థులు కావాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.


ఈ బస్సు ప్రమాదం లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున మరియు ఈ బస్సు ప్రమాదం లో గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది’’ అని తెలిపింది.

***

DS/TS



(Release ID: 1977138) Visitor Counter : 104