ప్రధాన మంత్రి కార్యాలయం
అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కి మరియు అమెరికా రక్షణ శాఖ మంత్రి కి స్వాగతం పలికిన ప్రధాన మంత్రి
విస్తృత ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యాని కి “2+2” ఫార్మేట్ రంగాన్ని సిద్ధం చేస్తుందంటూ హర్షాన్ని వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి
యు.ఎస్. కు ప్రధాన మంత్రి జరిపిన ఆధికారిక పర్యటన కుమరియు జి20 శిఖర సమ్మేళనం కోసం అధ్యక్షుడు శ్రీ బైడెన్ భారతదేశాన్ని సందర్శించినఘటనల కు తరువాయి గా ద్వైపాక్షిక సహకారం లో చోటుచేసుకొన్న పురోగతి ని గురించి వారుప్రముఖం గా ప్రస్తావించారు
పశ్చిమ ఆసియా సహా పరస్పర హితం ముడిపడ్డ వివిధప్రాంతీయ అంశాల ను గురించి మరియు ప్రపంచ అంశాల ను గురించి వారు చర్చించారు
అధ్యక్షుడు శ్రీజోసెఫ్ బైడెన్ తో సంభాషణ లను నిరంతరం కొనసాగించాలి అని ఆశపడుతున్న ప్రధాన మంత్రి
Posted On:
10 NOV 2023 8:22PM by PIB Hyderabad
యు.ఎస్. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఏంటనీ బ్లింకన్ మరియు యు.ఎస్. రక్షణ శాఖ మంత్రి శ్రీ లాయడ్ ఆస్టిన్ లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమయ్యారు.
భారతదేశం రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ తో మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ శ్రీ ఎస్. జయ్ శంకర్ తో వారు “2+2” ఫార్మేట్ లో జరిపిన చర్చల ను గురించి ప్రధాన మంత్రి కి వివరించారు.
- జూన్ లో ప్రధాన మంత్రి యు.ఎస్. ఆధికారిక యాత్ర కు మరియు న్యూ ఢిల్లీ లో జి20 శిఖర సమ్మేళనం జరిగినప్పుడు నేత లు ఇరువురి మధ్య జరిగిన సమావేశాని కి తరువాయి గా రక్షణ రంగం, సెమి కండక్టర్ స్ రంగం, క్రొత్త గా ఉనికి లోకి వస్తున్న సాంకేతిక విజ్ఞాన రంగం, అంతరిక్ష రంగం, ఆరోగ్య రంగం లు సహా ద్వైపాక్షిక సహకారాని కి సంబంధించినటుంటి వివిధ రంగాల లో చోటుచేసుకొన్న పురోగతి ని గురించి కూడాను వారు ప్రముఖం గా ప్రస్తావించారు.
అన్ని రంగాల లో సహకారం విస్తరిస్తూ ఉండడం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతదేశానికి మరియు యు.ఎస్. కు మధ్య గల విస్తృతమైన ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది నిజాని కి ప్రజాస్వామ్యాన్ని, బహుళ వాదాన్ని మరియు చట్ట ప్రధానమైనటువంటి పాలన ను గౌరవించుకోవడం పట్ల ఆధారపడి ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.
పశ్చిమ ఆసియా లో వర్తమాన ఘటన క్రమాల పైన, ఇంకా పరస్పర హితం ముడిపడ్డ వివిధ ప్రాంతీయ అంశాల పైన మరియు ప్రపంచ అంశాల పైన సైతం వారు వారి అభిప్రాయాల ను ఒకరి తో మరొకరు వెల్లడించుకొన్నారు. ఈ అంశాల పైన భారతదేశానికి మరియు యు.ఎస్. కు మధ్య సన్నిహిత సమన్వయం కొనసాగవలసిన అవసరం ఎంతయినా ఉంది అని వారు స్పష్టంచేశారు.
అధ్యక్షుడు శ్రీ బైడెన్ కు ప్రధాన మంత్రి స్నేహపూర్ణమైన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. శ్రీ బైడెన్ తో మాటామంతీ ని ఇక ముందు కూడా కొనసాగిస్తూ ఉండాలని తాను ఆశ పడుతున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు.
***
(Release ID: 1976676)
Visitor Counter : 127
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam