గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ మరియు ఎస్.ఐ.డి.బి.ఐ. కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం : మహిళల నేతృత్వంలోని సంస్థల ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది


మహిళా పారిశ్రామికవేత్తల సామర్థ్యాన్ని పెంపొందించడానికి విశ్వసనీయమైన, సున్నితమైన మద్దతు నిర్మాణాన్ని ఏర్పాటు చేసే క్షేత్ర స్థాయి కార్యకలాపాలను ప్రదర్శించడం - ఈ ఒప్పందం ప్రాథమిక ఉద్దేశ్యం

Posted On: 09 NOV 2023 1:23PM by PIB Hyderabad

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం) మరియు భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్.ఐ.డి.బి.ఐ) చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యు) పై సంతకం చేశాయి.  భారతదేశంలో మహిళల నేతృత్వంలోని సంస్థల ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.  గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ కుమార్ సింగ్ మరియు ఎస్.ఐ.డి.బి.ఐ. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివ సుబ్రమణియన్ రామన్ సమక్షంలో డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం. మరియు ఎస్.ఐ.డి.బి.ఐ. ఈ రోజు సంతకం చేసిన ఈ  ఒప్పందం రెండు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది.  డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం. తరఫున గ్రామీణ జీవనోపాధి శాఖ అదనపు కార్యదర్శి శ్రీ చరణ్‌జిత్ సింగ్ మరియు ఎస్.ఐ.డి.బి.ఐ. తరఫున వారి చీఫ్ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎస్.ఎస్.ఆచార్య ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.  కార్యక్రమంలో - గ్రామీణ జీవనోపాధి శాఖ సంయుక్త కార్యదర్శులు శ్రీమతి స్మృతి శరణ్; మరియు శ్రీమతి స్వాతి శర్మ ;  గ్రామీణ జీవనోపాధి శాఖ డైరెక్టర్ శ్రీ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్; ఎస్.ఐ.డి.బి.ఐ.  డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సౌరవ్ బాజ్‌ పాయ్ తో సహా పలువురు ఇతర ప్రముఖులు - పాల్గొన్నారు. 

 

 

డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం. మరియు ఎస్.ఐ.డి.బి.ఐ. లకు చెందిన నైపుణ్యాలను ఒకచోట చేర్చి, స్వయం సహాయక బృందాల (ఎస్.హెచ్.జి.ల) కు చెందిన అనుభవజ్ఞులైన సభ్యుల మధ్య మహిళా-నేతృత్వంలోని సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక పరివర్తన చొరవను రూపొందించింది.  మహిళా పారిశ్రామికవేత్తల (డబ్ల్యూ.ఈ.ల) సామర్ద్యాన్ని పెంపొందించడానికి విశ్వసనీయమైన, సున్నితమైన మద్దతు నిర్మాణాన్ని ఏర్పాటు చేసే క్షేత్ర స్థాయి కార్యకలాపాలను ప్రదర్శించడం ఈ సహకారం యొక్క ప్రాథమిక ఉద్దేశం.  ఇంకా, ఇది అధికారిక ఫైనాన్స్‌ కి క్రమబద్ధమైన యాక్సెస్ కోసం ప్రామాణిక ప్రోటోకాల్‌ లు, సిస్టమ్‌ లు, విధానాలను సంస్థాగతీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది, అలాగే కొత్త ఆర్థిక ఉత్పత్తులు, పథకాల కోసం సమగ్ర ఫ్రేమ్‌-వర్క్‌ ను అభివృద్ధి చేస్తుంది.

 

 

ఈ భాగస్వామ్యం నుంచి ఆశిస్తున్న ముఖ్య ఫలితాలు:

 

·      అనుభవజ్ఞులైన  ఎస్.హెచ్.జి. సభ్యుల గ్రాడ్యుయేషన్‌ ను  సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడానికి రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్‌ల (ఎస్.ఆర్.ఎల్.ఎం) బృందాల మెరుగైన శక్తి, సామర్ధ్యాల వినియోగం 

 

·      ఫీల్డ్ కేడర్లు, సలహాదారులు, నిపుణుల  నెట్‌-వర్క్‌ తో కూడిన మహిళా-నేతృత్వంలోని సంస్థల కోసం విశ్వసనీయ, సున్నితమైన మద్దతు నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం

 

·      మహిళల నేతృత్వంలోని సంస్థలకు మద్దతు ఇవ్వడానికి డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం. లో ప్రామాణిక ప్రోటో-కాల్‌ అమలు

 

·      ఆర్థిక సంస్థలు, ఫైనాన్షియర్ల నెట్‌-వర్క్‌ తో భాగస్వామ్యాల ఏర్పాటు

 

·      ఋణ హామీలు, వడ్డీ రాయితీలు వంటి కొత్త ఆర్థిక పథకాల రూపకల్పన, అమలు

 

·      మహిళా-నేతృత్వంలోని సంస్థలను ప్రోత్సహించడం కోసం స్పష్టమైన, నిర్ణీత నమూనాల సృష్టి, వీటిని దేశవ్యాప్తంగా ప్రతిరూపం చేయవచ్చు. 

 

 

ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మహిళల ఆర్థిక సాధికారత మరియు వ్యవస్థాపకత పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది, మహిళా నేతృత్వంలోని వ్యాపారాలకు వ్యవస్థాపక రంగం మరింత కలుపుకొని, మద్దతుగా చేయడంపై దృష్టి సారిస్తుంది.  డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం. మరియు ఎస్.ఐ.డి.బి.ఐ. యొక్క బలాలను కలపడం ద్వారా, ఈ చొరవ మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త మార్గాలను తెరవడానికి ప్రయత్నిస్తుంది,  అదే విధంగా, దేశం యొక్క ఆర్థిక వృద్ధి, శ్రేయస్సుకు దోహదం చేస్తుంది.

 

 

***



(Release ID: 1976046) Visitor Counter : 49