గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గృహ నిర్మాణ. పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అజాది కా అమృత్ మహోత్సవం


G20-భారతదేశం-2023

"నీరు కోసం మహిళలు, మహిళల కోసం నీరు" - అద్భుతమైన విజయంతో ముగిసిన జల్ దీపావళి ప్రచారం



దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 14,000 మంది మహిళలు పాల్గొన్నారు



నీటి పరిపాలనలో మహిళలను చేర్చడాన్ని ప్రోత్సహించే కార్యక్రమం

Posted On: 09 NOV 2023 5:58PM by PIB Hyderabad

జాతీయ పట్టణ జీవనోపాధి కార్యక్రమం, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ (NULM),  ఒడిశా అర్బన్ అకాడమీ భాగస్వామ్యంతో గృహనిర్మాణ -పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) చేపట్టిన "విమెన్ ఫర్ వాటర్, వాటర్ ఫర్ విమెన్" ప్రచారం మూడవ రోజు 9 నవంబర్, 2023న అద్భుత విజయంతో ముగిసింది. ,.ఈ ప్రతిష్టాత్మక అమలు కార్యక్రమం  అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) కింద ట్రాన్స్‌ ఫార్మేటివ్ క్యాంపెయిన్, వాటర్ గవర్నెన్స్‌ కార్యక్రమంలో మహిళలను చేర్చడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

మూడు రోజుల పాటు విస్తరించిన ఈ ప్రచారంలో , దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి (పోల్-బౌండ్ రాష్ట్రాలు మినహా) 14,000 మంది మహిళలు "జల్ దీపావళి"లో చురుకుగా పాల్గొన్నారు. ప్రచారం సందర్భంగా, ఈ సాధికారత పొందిన మహిళలు దేశవ్యాప్తంగా 530కి పైగా నీటి శుద్ధి కర్మాగారాలను (WTPs) సందర్శించారు -ఇంటింటికి పరిశుభ్రమైన -సురక్షితమైన త్రాగునీటిని పంపిణీ చేయడంలో ఉన్న క్లిష్టమైన ప్రక్రియల గురించి అమూల్యమైన ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందారు.

 

రాష్ట్ర అధికారులు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఘన స్వాగతం పలికారు, ప్రచారం విజయంలో వారి కీలక పాత్రను నొక్కి చెప్పారు. శిక్షణ మాన్యువల్, వాటర్ బాటిల్స్, సిప్పర్లు, పర్యావరణ అనుకూల బ్యాగులు -బ్యాడ్జ్‌లు వంటి అవసరమైన వస్తువులతో సహా ఫీల్డ్ విజిట్ కిట్‌లు పాల్గొనే వారందరికీ అందించారు.

 

ప్రచారం అంతటా, మహిళలు నీటి మౌలిక సదుపాయాల రంగాన్ని లోతుగా పరిశోధించారు, నీటి నాణ్యత పరీక్ష అంచెలంచెల విధానంపై నిపుణుల మార్గదర్శకత్వం పొందారు -ఈ పరీక్షలను స్వయంగా వారు  నిర్వహించారు. ఈ జ్ఞానం వారి కమ్యూనిటీలకు నీటి స్వచ్ఛత అత్యున్నత ప్రమాణాలను నిర్ధారించడానికి వారిని మరింత శక్తివంతం చేస్తుంది, ఇది నీటి మౌలిక సదుపాయాల పట్ల యాజమాన్యం -బాధ్యత లోతైన భావాన్ని ప్రతిబింబిస్తుంది.

 

"జల్ దీపావళి"- అమలు ప్రాంతాలలో అమృత్ పథకం కింద నిర్వహించే చర్యల్లో దాని విస్తృత ప్రభావం గురించి మహిళలకు అవగాహన కల్పించడం - నీటి శుద్ధి ప్లాంట్‌ల నిర్వహణ తీరు  సమగరంగా తెలియజెప్పడం  -మహిళా స్వయం-సహాయ బృందాలు (SHGలు) రూపొందించిన సావనీర్‌లు -కథనాల ద్వారా సమగ్రతను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. అదనంగా, పాల్గొనేవారు నీటి వనరులను వివేకంతో సంరక్షించడానికి -ఉపయోగించుకోవడానికి కట్టుబడి ఉన్నారు, ఇది స్థిరమైన నీటి నిర్వహణకు కీలకమైన దశ.

 

 

29 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన స్వయం సహాయక సంఘాలు -రాష్ట్ర అధికారుల సమిష్టి ప్రయత్నాలు నీటి మౌలిక సదుపాయాల-క్లిష్టమైన విభాగం లో  చేరిక -మహిళా సాధికారత వైపు గణనీయమైన పురోగతి సాధించాయి.

 

***


(Release ID: 1976034) Visitor Counter : 70