సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
54వ ఐఎఫ్ఎఫ్ఐలో 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో లో పాల్గొననున్న 19 రాష్ట్రాల సినీ నిర్మాతలు, ఆర్టిస్టులు
భారతదేశాన్ని ప్రపంచంలోనే కంటెంట్ ఉపఖండంగా మార్చడానికి చొరవ కీలకం: అనురాగ్ ఠాకూర్
Posted On:
09 NOV 2023 2:20PM by PIB Hyderabad
భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా- ఐఎఫ్ఎఫ్ఐ) 54 వ ఎడిషన్ కు 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ఇనిషియేటివ్ మూడవ ఎడిషన్ లో చేరడానికి భారతదేశం నలుమూలల నుండి 75 మంది ప్రతిభావంతులైన చిత్ర నిర్మాతలను, కళాకారులను ఎంపిక చేశారు.
సెలెక్షన్ జ్యూరీ, గ్రాండ్ జ్యూరీ ప్యానెల్స్ ఎంపిక చేసిన పార్టిసిపెంట్స్ జాబితాను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, జమ్ముకశ్మీర్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ మొదలైన 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సినీ రంగ ప్రతిభావంతులు ఇందులో ఉన్నారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఎంపిక కాగా, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, హరియాణా, తమిళనాడు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఈ ఎడిషన్ గురించి కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, విజేతలందరినీ అభినందించారు. "ఈ సంవత్సరం, 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారోలో భాగంగా భారతదేశం నలుమూలల నుండి 10 విభాగాలలో 75 మంది ప్రతిభావంతులైన యువ సృష్టికర్తలను మరోసారి కలిగి ఉన్నాము" అని అన్నారు. ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్ లో భాగంగా నిర్మించబోయే అద్భుతమైన లఘు చిత్రాల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. విజేతలందరూ ప్రత్యేకంగా ప్లాన్ చేసిన మాస్టర్ క్లాస్ లు, సెషన్ల ద్వారా విజ్ఞానాన్ని పొందవచ్చని, ఫిల్మ్ బజార్ లో జరిగే సినిమా వ్యాపారంలో పాల్గొనవచ్చనిటాలెంట్ క్యాంప్ ద్వారా విలువైన సంబంధాలను ఏర్పరుచుకుంటారని తాను ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. "ప్రపంచ కంటెంట్ ఉపఖండంగా అవతరించే భారతదేశ రేసులో ఈ చొరవ ఒక కీలకమైన పిట్ స్టాప్" అని ఆయన ముగించారు.
ఈ ఏడాది బిష్ణుపూర్ (మణిపూర్), జగత్సింగ్పూర్ (ఒడిశా), సదర్పూర్ (మధ్యప్రదేశ్) ప్రాంతాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొంటారు.
సినిమా రంగం, రాష్ట్రాల వారీగా విజేతల జాబితాను ఐఎఫ్ఎఫ్ఐ వెబ్ సైట్ లో చూడవచ్చు.
డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, ఎడిటింగ్, ప్లేబ్యాక్ సింగింగ్, మ్యూజిక్ కంపోజిషన్, కాస్ట్యూమ్ అండ్ మేకప్, ఆర్ట్ డిజైన్ అండ్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ (విఎఫ్ఎక్స్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఎఆర్), వర్చువల్ రియాలిటీ (విఆర్) విభాగాల్లో ప్రతిభ ఆధారంగా 600కు పైగా అప్లికేషన్ల నుంచి 75 మందిని ఎంపిక చేశారు. డైరెక్షన్ కేటగిరీ నుంచి 18 మంది, యానిమేషన్, విఎఫ్ఎక్స్, ఎఆర్ అండ్ విఆర్ కేటగిరీ నుంచి 13 మంది, సినిమాటోగ్రఫీ విభాగంలో 10 మంది ఆర్టిస్టులు ఉన్నారు.
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ (విఎఫ్ఎక్స్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఎఆర్), వర్చువల్ రియాలిటీ (విఆర్) కేటగిరీల నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇది భారతదేశ ఎవిజిసి-ఎక్స్ఆర్ రంగాన్ని వేగవంతం చేయాలనే భారత ప్రభుత్వ ప్రయత్నానికి అనుగుణంగా ఉంది.
మ్యూజిక్ కంపోజిషన్/ సౌండ్ డిజైన్ కేటగిరీలో పాల్గొన్న వారంతా 35 ఏళ్ల లోపు వారే. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 18 ఏళ్ల శశ్వత్ శుక్లా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
ఈ ఎడిషన్‌లోని 75 మంది సృజనాత్మక వ్యక్తులు ఐ ఎఫ్ ఎఫ్ ఐ రాబోయే ఎడిషన్‌లో క్రింది జోక్యాలకు హాజరవుతారు:
ఈ ఏడాది 75 మంది క్రియేటివ్ మైండ్స్ కోసం ప్రత్యేకంగా మాస్టర్ క్లాసులు నిర్వహించనున్నారు.
డైరెక్షన్ పై తన మాస్టర్ క్లాస్ లో శ్రీ. ఉమేశ్ శుక్లా ఓ మై గాడ్!, సినిమాకు స్క్రీన్ రైటింగ్, దర్శకత్వంపై ఒక కేస్ స్టడీని అందిస్తారు. బుల్లితెర, ఓటీటీ, సినిమాల్లో విస్తృతంగా పనిచేసిన చారుదత్ ఆచార్య సంప్రదాయ వేదికల నుంచి కొత్త టెక్నాలజీకి స్క్రిప్ట్ మార్పు పై మార్గనిర్దేశం చేయనున్నారు. యానిమేషన్ పై మాస్టర్ క్లాస్ లో, అవార్డు విన్నింగ్ క్రియేటర్, చారువి డిజైన్ ల్యాబ్స్ కు చెందిన శ్రీమతి చారువి అగర్వాల్ యానిమేషన్ , విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి భారతదేశ కథలను చెప్పడం గురించి తన ఆలోచనలను పంచుకోనున్నారు. దీనికి అదనంగా, ఎన్ ఎఫ్ డి సి బెర్లినేల్ టాలెంట్స్ ప్రోగ్రామ్ మేనేజర్ ఫ్లోరియన్ వెగ్ హార్న్ తో కలసి వర్చువల్ మాస్టర్ క్లాస్ నిర్వహిస్తుంది. "ఫిల్మ్ ఫెస్టివల్స్ ను లాంచ్ ప్యాడ్ ఫర్ న్యూ టాలెంట్" గా ఉపయోగించుకోవడంపై మార్గదర్శకత్వం అందిస్తారు”
చివరగా, ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేవారు తమ చిత్రాలకు ఫైనాన్సింగ్ చేసే చాలా ముఖ్యమైన అంశంపై ఒక సెషన్ లో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది. సెషన్ల సమయంలో వారు విజ్ఞానాన్ని పొందడానికి , ఈ రంగానికి చెందిన మాస్టర్లతో సంభాషించడానికి అవకాశం లభిస్తుంది.
'48 అవర్ ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్'లో భాగంగా లఘు చిత్రాలను రూపొందించే గ్రూప్ కాంపిటీషన్ లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. తమ చిత్రాల ద్వారా, పాల్గొనేవారు తమ "మిషన్ లైఫ్ " వివరణను 48 గంటల్లో ప్రదర్శిస్తారు.
షార్ట్ ఫిలిమ్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ అయిన యు కె కు చెందిన షార్ట్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ భాగస్వామ్యంతో ఎన్ఎఫ్ డి సి ఈ పోటీని రూపొందించింది. టీవీ, మొబైల్, ఆన్లైన్ , థియేటర్లలో లభించే అధిక-నాణ్యత లఘు సినిమాలు , సిరీస్ ల ప్రపంచంలోనే అతిపెద్ద కేటలాగ్ ను హోర్ట్స్ టీవీ కలిగి ఉంది. ప్రసారకర్తలు, బ్రాండ్ల కోసం ఒరిజినల్ షార్ట్ ఫిల్మ్ కంటెంట్ ను కూడా రూపొందిస్తారు.
ఫిల్మ్ బజార్ గైడెడ్ టూర్ ఫెస్టివల్ లో పాల్గొనే వారికి సినిమా వ్యాపారాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తుంది. కో ప్రొడక్షన్ మార్కెట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ల్యాబ్, వ్యూయింగ్ రూమ్, స్క్రీన్ రైటర్స్ ల్యాబ్, మార్కెట్ స్క్రీనింగ్స్, ప్రొడ్యూసర్స్ వర్క్ షాప్, నాలెడ్జ్ సిరీస్, బుక్ టు బాక్స్ ఆఫీస్ వంటి వివిధ అంశాలు ఫెస్టివల్ వ్యాపార విభాగమైన ఫిల్మ్ బజార్ లో ఉన్నాయి.
సృజనాత్మక రచయితలు తమ రచనలను సమర్పించడానికి , ఈ కథలను నిర్మాతలకు పరిచయం చేయడానికి ఒక వేదికను అందించడానికి ఈ సంవత్సరం బుక్ టు బాక్స్ ఆఫీస్ విభాగంలో 'ది స్టోరీ ఇంక్' భాగస్వామిగా ఉంటుంది.
ప్రొడక్షన్ హౌస్ లు, ఎవిజిసి కంపెనీలు, స్టూడియోలతో సహా భారతదేశ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో నెట్ వర్క్ చేయడానికి పాల్గొనేవారిని అనుమతించడానికి ఒక సి ఎమ్ ఒ టి టాలెంట్ క్యాంప్ ను నిర్వహిస్తారు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో, పాల్గొనేవారు తమ ఆలోచనలు/ భావనలు/ నైపుణ్యాలు/ మునుపటి పనిని ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖ పేర్లతో ఉద్యోగ అవకాశాన్ని పొందడానికి ముందుకు వస్తారు.
ఈ ఎడిషన్ కోసం 75 మంది పాల్గొనేవారిని ఈ క్రింది దిగ్గజాలతో కూడిన జ్యూరీ ప్యానెల్స్ ఎంపిక చేశాయి-
గ్రాండ్ జ్యూరీ-
శ్రేయా ఘోషల్ (నేపథ్య గానం)
ఎ.శ్రీకర్ ప్రసాద్ (ఎడిటింగ్)
మనోజ్ జోషి (యాక్టింగ్)
వీరకపూర్ (కాస్ట్యూమ్ అండ్ మేకప్)
ప్రియా సేథ్ (సినిమాటోగ్రఫీ)
సరస్వతి వాణి బల్గం (యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఏఆర్-వీఆర్)
సలీల్ కులకర్ణి (సంగీతం)
ఉమేష్ శుక్లా (దర్శకత్వం)
సాబు సిరిల్ (ఆర్ట్ డైరెక్టర్)
అసీమ్ అరోరా (స్క్రిప్ట్ రైటింగ్)
సెలక్షన్ జ్యూరీ:
మనోజ్ సింగ్ టైగర్ (నటన)
నిధి హెగ్డే (యాక్టింగ్)
అభిషేక్ జైన్ (దర్శకత్వం)
మనీష్ శర్మ (దర్శకత్వం)
చారుదత్ ఆచార్య (స్క్రిప్ట్ రైటింగ్)
దీపక్ కింగ్రానీ (స్క్రిప్ట్ రైటింగ్)
చారువి అగర్వాల్ (యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఏఆర్-వీఆర్)
దీపక్ సింగ్ (యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఏఆర్-వీఆర్)
నవీన్ నూలి (ఎడిటింగ్)
సురేష్ పాయ్ (ఎడిటింగ్)
ధరమ్ గులాటి (సినిమాటోగ్రఫీ)
సుభాన్సు దాస్ (సినిమాటోగ్రఫీ)
నచికేత్ బార్వే (కాస్ట్యూమ్ అండ్ మేకప్)
బిశాక్ జ్యోతి (నేపథ్య గానం)
అన్మోల్ భావే (సంగీత కూర్పు)
సవ్యసాచి బోస్ (ఆర్ట్ డైరెక్షన్)
"75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో" అనేది భారతదేశం అంతటా ఉన్న యువ సినిమా ప్రతిభావంతులను గుర్తించడానికి, ప్రోత్సహించడానికి , ప్రదర్శించడానికి కేంద్ర సమాచార l, ప్రసార మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ తీసుకున్న వినూత్న చొరవ, ఆలోచన. ఇందులో భాగంగా అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. ఐఎఫ్ఎఫ్ఐ 2021 ఎడిషన్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని దీనిని ప్రారంభించారు.
***
(Release ID: 1976030)
Visitor Counter : 82