రైల్వే మంత్రిత్వ శాఖ
స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0ని విజయవంతంగా అమలు చేసిన భారతీయ రైల్వే
Posted On:
09 NOV 2023 12:36PM by PIB Hyderabad
* 11.80 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని తిరిగి వినియోగంలోకి తెచ్చిన భారతీయ రైల్వే
* తుక్కు అమ్మకాల ద్వారా దాదాపు 224.95 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించిన భారతీయ రైల్వే * * కార్యక్రమంలో 2.88 లక్షలకు పైగా ప్రజా ఫిర్యాదులు పరిష్కరించిన భారతీయ రైల్వే
* రికార్డుల నిర్వహణ, తొలగించడానికి 1.70 లక్షలకు పైగా ఫైళ్లను సమీక్షించిన భారతీయ రైల్వే
... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0ని భారతీయ రైల్వే విజయవంతంగా అమలు చేసింది. పరిశుభ్రత, సుపరిపాలన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ భారతీయ రైల్వే 02.10.2023 నుంచి 31.10.2023 వరకు స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0ని నిర్వహించింది.
భారతీయ రైల్వేలో స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 విజయవంతంగా లక్ష్యాల మేరకు అమలు జరిగింది. కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వివిధ స్థాయిలలో నోడల్ అధికారులను నియమించింది. రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పని ప్రదేశాలలో పరిశుభ్రత పాటించడం, పెండింగ్ అంశాల పరిష్కారానికి నిర్వహించిన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నోడల్ అధికారుల కృషి, ఉద్యోగుల సహకారంతో రైల్వే కార్యక్రమంలో 100% లక్ష్యాలను సాధించింది.
రైల్వే జోనల్ కార్యాలయాలు, డివిజన్ కార్యాలయాలు,ప్రభుత్వ రంగ సంస్థలు, శిక్షణా సంస్థలు, రైల్వే వర్క్‌షాప్‌లు , స్టేషన్‌లలో 23,672 పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. పనికిరాని వస్తువులను తొలగించడానికి కార్యక్రమంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. పనికిరాని వస్తువులు తొలగించడం ద్వారా భారతీయ రైల్వే 11.80 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని తిరిగి వినియోగంలోకి తెచ్చింది. తుక్కు అమ్మకాల ద్వారా భారతీయ రైల్వే 224.95 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది. ప్రచార సమయంలో 2.8 లక్షలకు మించి ప్రజా ఫిర్యాదులను భారతీయ రైల్వే పరిష్కరించింది. కంటే ఎక్కువ పబ్లిక్ గ్రీవెన్స్‌లు పరిష్కరించబడ్డాయి.రికార్డుల నిర్వహణ, తొలగించడానికి 1.70 లక్షలకు పైగా ఫైళ్లను భారతీయ రైల్వే సమీక్షించింది. సమీక్షించిన ఫైళ్లలో 1.00 లక్షల కంటే ఎక్కువ రికార్డ్ చేయబడ్డాయి
స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 అమలు జరిగిన తీరును భారతీయ రైల్వే సోషల్ మీడియా (ట్విట్టర్, ఫేస్‌బుక్ మొదలైనవి) ద్వారా తెలియజేసింది. ఉద్యోగులు, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి దాదాపు . 6900 కం సోషల్ మీడియా పోస్ట్‌లు రైల్వే యొక్క వివిధ హ్యాండిల్‌ల నుంచి పోస్ట్ అయ్యాయి. ప్రచార సమయంలో రైల్వే జారీచేసిన 114 పత్రికా ప్రకటనలు ప్రచురితం అయ్యాయి. :
***
(Release ID: 1976029)
Visitor Counter : 63