పర్యటక మంత్రిత్వ శాఖ

లండన్ లో 2023 నవంబరు 6-8 తేదీల్లో జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యుటిఎం) 2023ని పాల్గొంటున్న భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ

Posted On: 07 NOV 2023 4:28PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆ రంగానికి చెందిన టూర్ ఆపరేటర్లు, రాష్ర్టాల పర్యాటక శాఖలు సహా విభిన్న భాగస్వాములతో కలిసి 2023 నవంబరు 6-8 తేదీల మధ్య లండన్  లో జరుగుతున్న డబ్ల్యుటిఎంలో పాల్గొంటోంది. డబ్ల్యుటిఎం 2023లో ఇంక్రెడిబుల్  ఇండియా పెవిలియన్  కోసం 650 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్రదేశాన్ని తీసుకుంది. విభిన్న పర్యాటక రంగ ఉత్పత్తులు ప్రదర్శించడంతో పాటు ‘‘ఇంక్రెడిబుల్ ఇండియా! విజిట్ ఇండియా ఇయర్ 2023’’ థీమ్  కింద భారతదేశాన్ని సందర్శించిన యాత్రికుల పరివర్తిత అనుభవాలు తెలియచేసే ఏర్పాటు కూడా చేసింది.

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి వి.విద్యావతి, యుకెలో భారత హై కమిషనర్  శ్రీ విక్రమ్  దొరైస్వామి గోవా పర్యాటక శాఖ మంత్రి శ్రీ రోహన్ ఖౌంటే సమక్షంలో ఈ పెవిలియన్  ను ప్రారంభించారు. రిబ్బన్  కత్తిరించడం, జ్యోతిప్రజ్వలనం, గణేశ వందనతో ఈ పెవిలియన్  ప్రారంభమయింది. పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, యుకెలో భారత హై కమిషనర్  ఈ సందర్భంగా స్వాగతోపన్యాసం చేశారు.  

ప్రారంభం అనంతరం భారత ప్రతినిధివర్గం,  కార్యక్రమంలో పాల్గొన్న ఇతర భాగస్వాములు భారత పెవిలియన్, వివిధ రాష్ర్టాలు, ఇతర భాగస్వాములు ఏర్పాటు చేసిన స్టాల్స్  వీక్షించారు. ఇంక్రెడిబుల్  ఇండియా రోజంతా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, హెన్నా, యోగా కార్యక్రమాలు నిర్వహించింది.  ఈ సందర్భంగా ‘‘యువత భాగస్వామ్యం, విద్య ద్వారా పర్యాటకం పరివర్తన’’ పేరిట ఉన్నతమైన వేదికపై నిర్వహించిన యుఎన్ డబ్ల్యుటిఓ-డబ్ల్యుటిటిసి  టూరిజం మంత్రుల సదస్సుకు  పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి హాజరయ్యారు. అలాగే పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోజంతా యుకె మార్కెట్  లోని ప్రధానమైన టూర్  ఆపరేటర్లు, మీడియా ప్రతినిధులు, ఇతర ముఖ్య భాగస్వాములతో సమావేశమయ్యారు.

టూర్ ఆపరేటింగ్ కంపెనీలు/డిఎంసిలు; ఢిల్లీ, ఉత్తరాఖండ్, జమ్ము&కశ్మీర్, బిహార్, మేఘాలయ, అరుణాచల్  ప్రదేశ్, ఒడిశా, అస్సాం రాష్ర్టాల పర్యాటక శాఖలు, భారతీయ రైల్వే కాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సిటిసి) డబ్ల్యుటిఎం 2023 సందర్భంగా జరిగిన ఇంక్రెడిబుల్ ఇండియాలో పాల్గొంటున్నాయి. వీటితో పాటు కేరళ,  కర్ణాటక, లదాఖ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గోవా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ర్ట, గుజరాత్  రాష్ర్టాల పర్యాటక శాఖలు తమ పర్యాటక ఉత్పత్తులు సేవలు ప్రదర్శించేందుకు, ఔత్సాహిక క్లయింట్లు, ఇతర భాగస్వాముల అనుసంధానం కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకున్నాయి.

పర్యాటక, ట్రావెల్  రంగాలకు చెందిన వృత్తి నిపుణులను ఒక్కచోట సమావేశపరిచేందుకు లండన్  డబ్ల్యుటిఎం 2023ను పర్యాటక మంత్రిత్వ శాఖ ఒక వేదికగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఈ సదస్సుకు ట్రావెల్ ఏజెన్సీలు, విమానయాన సంస్థలు, హోటల్ నిర్వాహకులు, క్రూయిజ్ లైన్ల నిర్వాహకులు, ట్రావెల్  టెక్నాలజీ ప్రొవైడర్లు, టూరిజం బోర్డులు; పర్యాటక, ఆతిథ్య రంగానికి చెందిన ఇతర వృత్తి నిపుణులు హాజరవుతున్న నేపథ్యంలో పర్యాటక మంత్రిత్వ శాఖ నెట్ వర్కింగ్, వ్యాపారావకాశాలు; ఆలోచనలు, సమాచార మార్పిడి కోసం ఈ వేదికను ఉపయోగించుకోనుంది.

విభిన్న టూరిజం ఉత్పత్తులతో పాటు ‘‘ఇంక్రెడిబుల్ ఇండియా! విజిట్ ఇండియా ఇయర్ 2023’’ థీమ్  కింద భారతదేశాన్ని సందర్శించిన పర్యాటకుల పరివర్తిత అనుభవాలను వెలుగులోకి తేవడంతో పాటు సుస్థిర పర్యాటకం ప్రోత్సాహానికి పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 2023 సెప్టెంబరు 27వ తేదీన పర్యాటక మంత్రిత్వ శాఖ ‘‘ట్రావెల్ ఫర్ లైఫ్’’ కార్యక్రమం ప్రారంభించింది. వాతావరణ మార్పులకు సంబంధించిన ప్రతికూల ప్రభావాలపై వ్యక్తులు, సమాజానికి అవగాహన కల్పించడం, తద్వారా ప్రజా ఉద్యమాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన కార్యక్రమం మిషన్ లైఫ్ (పర్యావరణ మిత్ర జీవనశైలి) కింద మంత్రిత్వ శాఖ ఈ చొరవలు తీసుకుంది. 

 

***



(Release ID: 1975812) Visitor Counter : 72