పార్లమెంటరీ వ్యవహారాలు
నెల రోజుల ప్రత్యేక ప్రచారం 3.0ను విజయవంతంగా పూర్తి చేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
Posted On:
08 NOV 2023 5:12PM by PIB Hyderabad
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నెల రోజుల ప్రత్యేక ప్రచారం 3.0ను అత్యంత ఉత్సాహంతో, సంపూర్ణంగా, విజయవంతంగా పూర్తి చేసింది. ప్రచారంలోని ప్రధాన అంశాలు - మంత్రిత్వ శాఖలోని పెండింగ్ అంశాలను పరిష్కరించడం, కార్యాలయ స్థలం నిర్వహణకు ప్రాధాన్యత, కార్యాలయంలో పని అనుభవాన్ని మెరుగుపరచడం, పరిశుభ్రత కార్యక్రమాలు. ప్రత్యేక ప్రచారం 3.0 సన్నాహక దశ 15 సెప్టెంబర్ 2023న ప్రారంభమైంది, ఆ సమయంలో వివిధ కార్యకలాపాల లక్ష్యాలను గుర్తించారు. ప్రధాన ప్రచారం 2 అక్టోబర్ 2023న ప్రారంభమైంది, 31 అక్టోబర్ 2023న ముగిసింది. గుర్తించిన కార్యకలాపాల్లో ప్రజా ఫిర్యాదులు, పార్లమెంటు సభ్యుల సూచనలను పరిష్కరించడం, పరిశుభ్రత కార్యక్రమాలు, దస్త్రాల తొలగింపు వంటివి ఉన్నాయి.
ప్రత్యేక ప్రచారం సమయంలో 263 భౌతిక దస్త్రాలను సమీక్షించారు, వాటిలో 47 దస్త్రాలను తొలగించారు. సమీక్ష కోసం గుర్తించిన 145 ఇ-దస్త్రాలను మూసివేశారు. మంత్రిత్వ శాఖలోని 60 చదరపు అడుగుల స్థలం ఖాళీ అయింది. తుక్కు అమ్మకం ద్వారా రూ.3,45,000 ఆదాయం వచ్చింది.
ప్రచార సమయంలో గుర్తించిన అన్ని లక్ష్యాలను మంత్రిత్వ శాఖ పూర్తి చేసింది. ప్రచారం పురోగతిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు, తాజా సమాచారాన్ని ఎస్‌సీడీపీఎం 3.0 పోర్టల్‌లో క్రమం తప్పకుండా ఉంచారు. అధికారులు, సిబ్బంది అందరూ స్వచ్ఛత ప్రచారంలో, పెండింగ్ పనులను పరిష్కరించడంలో హృదయపూర్వకంగా పాల్గొన్నారు.
తాను చేపట్టిన ప్రత్యేక ప్రచారం 3.0 కార్యకలాపాలను ప్రజలకు చేరువ చేయడానికి సామాజిక మాధ్యమాలను కూడా మంత్రిత్వ శాఖ ఉపయోగించింది, తన ప్రయత్నాలను ప్రత్యేకంగా చాటింది.
ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన కార్యాలయ అనుభవం కోసం ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
****
(Release ID: 1975807)
Visitor Counter : 75