సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
అక్టోబర్ నెలలో సిపిజిఆర్ ఎఎంఎస్‌పై కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల పనితీరుపై డిఎఆర్‌పిజి ప్రచురించిన 18వ నివేదిక
అక్టోబర్ 2023లో కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు మొత్తం 1,23,491 ఫిర్యాదులను పరిష్కరించాయి
సాంకేతికత స్వీకరణ, ప్రత్యేక ప్రచారం 3.0 ఫలితంగా అక్టోబర్ 2023 చివరి నాటికి కేంద్ర సెక్రటేరియేట్‌లో అత్యధిక తక్కువగా 0.57 లక్షల ప్రజా ఫిర్యాదుల పెండెన్సీ
వరుసగా 15వ నెలలో కేంద్ర సెక్రటేరియేట్‌లో సమస్యల పరిష్కారం 1 లక్ష కేసులను అధిగమించింది
అక్టోబర్ 2023లో గ్రూప్ ఎ లో అత్యంత బాగా రాణించిన విభాగాల ర్యాంకింగ్‌లలో అగ్రాన నిలిచిన న్యాయ విభాగం & ఆహారం & ప్రజా పంపిణీ, వ్యవసాయం & రైతాంగ సంక్షేమం
అక్టోబర్ 2023కు విడుదల చేసిన గ్రూప్ బి కేటగిరీ ర్యాంకింగ్‌లలో మొదటి స్థానంలో తాగునీరు & పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ, న్యాయ వ్యవహారాల విభాగం, నీతి ఆయోగ్
Posted On:
08 NOV 2023 4:48PM by PIB Hyderabad
పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఎఆర్‌పిజి) కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం & పర్యవేక్షణ వ్యవస్థ (సిపిజిఆర్ఎఎంఎస్) అక్టోబర్, 2023 నెలకు నెలసరి నివేదికను విడుదల చేసింది. ఇందులో ప్రజా ఫిర్యాదులు, పరిష్కార స్వభావపు వివరణాత్మక విశ్లేషణను అందిస్తుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలపై డిఎఆర్‌పిజి ప్రచురించిన 18వ నివేదిక.
అక్టోబర్ 2023లో కేంద్ర సెక్రటేరియేట్ అత్యంత తక్కువ ఫిర్యాదుల పెండెన్సీని నమోదు చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు 1,23,491 ఫిర్యాదుల పరిష్కారంతో అక్టోబర్ 2023కు పురోగతిని చూసింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు 2023వ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ వరకూ ఫిర్యాదుల పరిష్కారానికి పట్టిన సగటు సమయం 19 రోజులు. ఈ నివేదికలు 10 దశల సిపిజిఆర్ఎంఎస్ సంస్కరణల ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. పరిష్కార నాణ్యతను మెరుగుపరిచి, సమయాన్ని తగ్గించేందుకు డిఎఆర్‌పిజి వీటిని స్వీకరించింది.
అక్టోబర్ 2023లో బిఎస్ఎన్ఎల్ ఫీడ్‌బ్యాక్ కాల్ సెంటర్ 100815 ప్రతిపుష్టిని అందుకుంది. ఇది జులై 2022న ప్రారంభించినప్పటి నుంచీ సేకరించిన అత్యధిక సంఖ్య. మొత్తం అందుకున్న ఫీడ్‌బ్యాక్‌లలో 38% పౌరులు తమ తమ ఫిర్యాదులకు సంబంధించి అందించిన పరిష్కారం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇదే నివేదికలో, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా సిపిజిఆర్ ఎంఎస్ వ్యాప్తిని పెంచడం కోసం అక్టోబర్ 2023 నుంచి ప్రతి నెల 20వ తేదీన సిఎస్‌సి- సిపిజిఆర్ఎఎంఎస్ ఫిర్యాదుల దినాన్నినిర్వహించడాన్ని కామన్ సర్వీస్ సెంటర్లు ప్రారంభించినట్లు సమర్పించారు. డేటా షేరింగ్‌పై సహకరించుకునేందుకు ఒక భారీ ప్రాజెక్టులో భాగంగా 16 అక్టోబర్ 2023న మైక్రోసాఫ్ట్‌తో నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్‌డిఎ - బహిరంగం వెల్లడించరాని దస్తావేజు)ను డిఎఆర్‌పిజి సంతకం చేసినట్టు కూడా తెలిపింది.
కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలకు అక్టోబర్ 2023కు డిఎఆర్‌పిజి విడుదల చేసిన నెలవారీ సిపిజిఆర్ఎఎంఎస్ నివేదికలో కీలకాంశాలుః
ప్రజా ఫిర్యాదుల కేసులుః
అక్టోబర్ 2023లో సిపిజిఆర్ఎఎంఎస్ పోర్టల్‌పై 113323 ప్రజాఫిర్యాదుల కేసులను అందుకోగా, 123491 ఫిర్యాదులను పరిష్కరించగా, 31 అక్టోబర్ 2023 నాటికి ఇంకా 57211 ఫిర్యాదులకు సంబంధించిన కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి.
కేంద్ర సెక్రెటేరియేట్‌లో అపరిష్కృత కేసులు సెప్టెంబర్, 2023 నాటికి గల 66835 నుంచి అక్టోబర్ 2023 చివరకు 57211 ప్రజాఫిర్యాదులకు తగ్గించడం జరిగింది.
ప్రజా ఫిర్యాదుల అప్పీళ్ళుః
అక్టోబర్ 2023లో 23561 అప్పీళ్ళు అందుకోగా, 27696 అప్పీళ్ళను పరిష్కరించవచ్చు. కేంద్ర సెక్రటేరియేట్‌లో 20123 ప్రజాఫిర్యాదుల అప్పీళ్ళు అక్టోబర్ 2023 నాటికి అపరిష్కృతంగా ఉన్నాయి.
సెప్టెంబర్ 2023లో పెండింగ్‌లో ఉన్న 24258 అప్పీళ్ళ నుంచి అక్టోబర్ 2023 చివరకు 20213 అప్పీళ్ళకు తగ్గించడం జరిగింది.
ప్రజాఫిర్యాదుల పరిష్కారాల అంచనా & సూచీ (జిఆర్ఎఐ)- ఆగస్టు 2023
అక్టోబర్ 2023లో గ్రూప్ ఎ లో ప్రజాఫిర్యాదుల పరిష్కారాల అంచనా & సూచీ లో అత్యంత బాగా రాణించినవి న్యాయ విభాగం & ఆహారం & ప్రజా పంపిణీ విభాగాలు.
అక్టోబర్ 2023లో గ్రూప్ బిలో ప్రజాఫిర్యాదుల పరిష్కారాల అంచనా & సూచీ లో అగ్ర పనితీరును తాగునీరు & పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ, న్యాయ వ్యవహారాల విభాగం ఉన్నాయి.
***
(Release ID: 1975804)
Visitor Counter : 44