ప్రధాన మంత్రి కార్యాలయం

ఇరాన్ అధ్యక్షుని తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ


పశ్చిమ ఆసియా లో కఠిన స్థితి పై మరియు ఇజ్రాయల్-హమాస్ సంఘర్షణ పై ఇద్దరు నేతలు వారి వారి అభిప్రాయాల ను ఒకరి తో మరొకరువెల్లడి చేసుకొన్నారు

ఉద్రిక్తత ను తగ్గించవలసిన అవసరం, మానవీయ సహాయాన్ని కొనసాగించవలసిన అవసరం మరియు శాంతి-భద్రతల ను త్వరగా పునరుద్ధరించవలసిన అవసరం గురించి వారు స్పష్టం చేశారు

చాబహార్ నౌకాశ్రయం సహా ద్వైపాక్షిక సహకారం లోచోటుచేసుకొన్న పురోగతి ని నేత లు స్వాగతించారు

Posted On: 06 NOV 2023 6:25PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీ సైయ్యద్ ఇబ్రాహిమ్ రయీసీ తో ఈ రోజు న టెలిఫోన్ మాధ్యం ద్వారా సంభాషించారు.

నేత లు ఇరువురు పశ్చిమ ఆసియా ప్రాంతం లో తలెత్తిన కఠిన స్థితి మరియు ఇజ్ రాయల్-హమాస్ సంఘర్షణ పై వారి వారి ఆలోచనల ను ఒకరి దృష్టి కి మరొకరు తీసుకు వచ్చారు.


ఉగ్రవాద ఘటన ల పట్ల, హింస పట్ల, ఇంకా పౌరుల ప్రాణాల కు నష్టం జరుగుతూ ఉండడం పట్ల తీవ్ర ఆందోళన ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ఇజ్ రాయల్-పాలస్తీనా అంశం లో భారతదేశం అవలంబిస్తున్నటువంటి దీర్ఘకాలిక మరియు ఎప్పటికీ ఒకే రకం వైఖరి ని ఆయన పునరుద్ఘాటించారు.


స్థితి పట్ల అధ్యక్షుడు శ్రీ రయీసీ తన అంచనా ను వెల్లడించారు.

ఉద్రిక్తత ను తగ్గించవలసిన అవసరాన్ని గురించి, మానవతా పూర్వక సహాయాన్ని అందించడాన్ని కొనసాగించవలసిన ఆవశ్యకత ను గురించి మరియు శాంతి ని, ఇంకా భద్రత ను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించవలసిన అవసరాన్ని గురించి నేత లు నొక్కి పలికారు.


బహుళ పార్శ్వాలతో కూడిన ద్వైపాక్షిక సహకారం లో చోటు చేసుకొన్న పురోగతి ని కూడా నేత లు సమీక్షించడం తో పాటుగా పరస్పర సహకారాన్ని గురించి సకారాత్మకమైనటువంటి దృష్టి తో మదింపు చేశారు. ప్రాంతీయ సంధానాన్ని మెరుగు పరచడం కోసం ఇరాన్ లో చాబహార్ నౌకాశ్రయం విషయం లో శ్రద్ధ ను తీసుకోవడం తో పాటు ప్రాధాన్యాన్ని కట్టబెట్టడాన్ని వారు స్వాగతించారు.


ప్రాంతీయ శాంతి, భద్రత మరియు స్థిరత్వం లలో ఉమ్మడి ప్రయోజనాలు ఇమిడిపోయివున్నందువల్ల, పరస్పరం సంప్రదింపుల ను కొనసాగిస్తూ ఉండాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.

 

***



(Release ID: 1975373) Visitor Counter : 136