నీతి ఆయోగ్
2023 అక్టోబర్ 2 నుంచి 31 వరకు స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 ని అమలు చేసిన నీతి ఆయోగ్
Posted On:
06 NOV 2023 12:36PM by PIB Hyderabad
పరిపాలనలో పెండింగ్ సమస్యలు పరిష్కరించి, కార్యాలయాల ఆవరణలో పరిశుభ్రత మెరుగు పరచడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు 2023 అక్టోబర్ 2 నుంచి 31 వరకు స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 ని నీతి ఆయోగ్ అమలు చేసింది. పర్యావరణాన్ని పరిరక్షించి, ప్రభుత్వం అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను శుభ్రంగా నిర్వహించి, పచ్చదనాన్ని పెంపొందించడం లక్ష్యంగా స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 అమలు జరిగింది.
రెండు దశల్లో స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 ని నీతి ఆయోగ్ అమలు చేసింది. సమర్థవంతమైన పాలన అందించి ప్రజలకు సేవలు అందించడం లక్ష్యంగా కార్యక్రమం అమలు జరిగింది.
1. స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 సన్నాహక దశ ( 2023 సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు): స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 లో సమీక్షించడానికి 10103 ఫైళ్లను,పెండింగ్ లో ఉన్న 15 ప్రజా ఫిర్యాదులు, 9 పార్లమెంట్ హామీలను సన్నాహక దశలో నీతి ఆయోగ్ గుర్తించింది. కార్యాలయ స్థలాలను పరిశుభ్రత, నిర్వహణ మెరుగుపరచడం కోసం ప్రణాళిక సిద్ధం చేసింది. 2023 అక్టోబర్ 2 నుంచి 31 వరకు ప్రత్యేక ప్రచారం 3.0 ని నీతి ఆయోగ్ అమలు చేసింది.
2. అమలు దశ (2023 అక్టోబర్ 2 నుంచి 31 వరకు): స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 కార్యక్రమంలో భాగంగా నీతి ఆయోగ్ పెండింగ్ లో ఉన్న ప్రజా ఫైర్యాదులను 100% పరిష్కరించింది. పెండింగ్ లో ఉన్న పార్లమెంట్ హామీల్లో 2 హామీలను పరిష్కరించింది. మొత్తం 5075 ఫైళ్లను సమీక్షించిన నీతి ఆయోగ్ 3617 ఫైళ్ను తొలగించింది. కార్యాలయ స్థలాలు, బహిరంగ ప్రాంగణాలు, రికార్డు గది , డిపార్ట్‌మెంటల్ క్యాంటీన్‌లలో పరిశుభ్రత చర్యలు చేపట్టారు. పనికిరాని ఫైళ్లు, వస్తువులను తొలగించడం ద్వారా సుమారు 5124 చదరపు అడుగుల స్థలాన్ని వినియోగం లోకి తీసుకు వచ్చారు. వ్యర్థాలను తొలగించడం వల్ల పర్యావరణ అనుకూల పని స్థలం,పరిసరాలు అందుబాటులోకి వస్తాయి.
నీతి ఆయోగ్‌లో 2023 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం 2023 ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా క్రింది కార్యకలాపాలను చేపట్టారు.
i. నీతి ఆయోగ్ రికార్డ్ గదిని ఉన్నతాధికారులు పరిశీలించి ఫైళ్ళను సమీక్షించి పనికిరాని ఫైళ్ళను తొలగించి, డిజిటలైజేషన్ చేయడం , పనికిరాని వస్తువులను గుర్తించారు.
ii. నీతి ఆయోగ్ అధికారులు/సిబ్బందిలో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛత అవగాహన ప్రచారం నిర్వహించారు.
iii. నీతి ఆయోగ్ కార్యాలయ ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమాలు అమలు జరిగాయి.
iv. నీతి ఆయోగ్ డిపార్ట్‌మెంటల్ క్యాంటీన్‌ను శుభ్రం చేశారు.
v. నీతి ఆయోగ్ సిబ్బంది, అధికారులతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ (శ్రీ సుమన్ కే బెరీ) నేతృత్వంలో సిబ్బంది, అధికారులు సంస్థ కార్యాలయం ఆవరణలో శ్రమదానం చేసి పరిశుభ్రత కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యులు (శ్రీ వి.కే. సరస్వత్);, నీతి ఆయోగ్ సీఈఓ (శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం).తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1975090)
Visitor Counter : 96