మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర విద్యా శాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్‌, చైర్మన్‌, సిఇఒ, డిపివరల్డ్‌ సుల్తాన్‌ అహÊంద్‌బిన్‌ సులయేమ్‌ల సమక్షంలో ఎన్‌.ఎస్‌.డి.సి ఇంటర్నేషనల్‌, ఉయ్‌ వన్‌, డిపి వరల్డ్‌ల మధ్య ఒప్పంద సంతకాలు.


అంతర్జాతీయ ప్రతిభకు మరిన్ని అవకాశాలు కల్పించడం, నైపుణ్యం, భారతీయ యువతను విదేశాలలో గల ఉపాధి అవకాశాలతో అనుసంధానం చేయడానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుంది: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌.

భారతీయ సంతతి వారికి మరింత ప్రయోజనం కలిగించేందుకు,మెరుగైన నిర్వహణకు దుబాయ్‌లో సి.బి.ఎస్‌.ఇ
ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన శ్రీ ధర్మేంద్రప్రధాన్‌.

Posted On: 03 NOV 2023 4:56PM by PIB Hyderabad

కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌,శాఖమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌, గ్రూప్‌ ఛైర్మన్‌, సి.ఇ.ఒ డి.పి. వరల్డ్‌ , దుబాయ్‌ హిజ్‌ఎక్సలెన్సి సుల్తాన్‌ అహ్మద్‌ బిన్‌ సులయేమ్‌ను కలుసుకున్నారు. అక్కడ  వీరి సమక్షంలో ఎన్‌.ఎస్‌.డి.సి ఇంటర్నేషనల్‌, డిపి వరల్డ్‌ సబ్సిడరీ సంస్థ,ఉయ్‌ వన్‌  మధ్య  ఒప్పందంపై సంతకాలు జరిగాయి.  కొలాబరేషన్లకు సంబంధించిన అవకాశాలపై వారు చర్చించారు.
 ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ ప్రధాన్‌, ఈ ఒప్పందం అంతర్జాతీయంగా ప్రతిభగలవారు వివిధ ప్రాంతాలలో తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలుకల్పిస్తుందని, నైపుణ్యాలు పొందేందుకు వీలు కల్పిస్తుందని, విదేశాలలో ఉపాధి అవకాశాలు పొందడానికి భారతీయ యువతకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ప్రతిభకు భారతదేశం రిజర్వాయర్‌ వంటిదని అంటూ, భారతీయ యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు  తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు. భారతీయ యువత ఆర్థిక పురోగతికి కృషి చేయడం జరుగుతుందని, తద్వారా అది దేశ ఆర్థికపురోగతికే కాక ప్రపంచ ఆర్థిక పురోగతికి ఉపకరిస్తుందన్నారు. యుఎఇలో భారత రాయబారి,  శ్రీ సుంజయ్‌ సుధీర్‌ ,దుబాయ్‌లో భారత కాన్సుల్‌జనరల్‌ శ్రీ సతీష్‌కుమార్‌ శివన్‌, సి.ఇ.ఒ, ఎన్‌.ఎస్‌.డి.సి శ్రీ వేద్‌ మణి తివారి ఇతర సీనియర్‌ అధికారులు ,ఒప్పందంపై సంతకాలుజరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్‌.ఎస్‌.డి.సి ఇంటర్నేషనల్‌, అంతర్జాతీయంగా నైపుణ్యాల కల్పనకు సంబంధించిన పరిష్కారాలను కల్పిస్తుంది. డిపి వరల్డ్‌లో భాగమైన ఉయ్‌ వన్‌ లాజిస్టిక్‌ సొల్యూషన్స్‌కు సంబంధించి అంతర్జాతీయ లీడర్‌. వీరు ఈరోజు ఒప్పందంపై సంతకాలు చేశారు. నైపుణ్యాల అభివృద్ధి, ఫ్రంట్‌లైన్‌వర్క్‌ఫోర్స్‌కు ఉపాధి అవకాశాల కల్పనకు ఇది వీలు కల్పిస్తుంది.

2022 మే నెలలో ఎన్‌.ఎస్‌.డి.సి ఇంటర్నేషనల్‌, హిందూస్థాన్‌ పోర్ట్‌లు(డిపి వరల్డ్‌ కంపెనీ) మధ్య వారణాశిలో స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఏర్పాటుకు అవగాహనా ఒప్పందంపై జరిగిన సంతకాలకు కొనసాగింపుగా ప్రస్తుత ఒప్పందం కుదిరింది. స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌ నైపుణ్యాలకు అంతర్జాతీయ ఎక్సలెన్స్‌ కేంద్రంగా ఉంటుంది. ఇందుకు అనుగుణంగా డిపి వరల్‌నడ ఎన్‌.ఎస్‌.డి.సి సమన్వయంతో వారణాశిలో స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. ఇది నైపుణ్య శిక్షణ, కౌన్సిలింగ్‌, మొబిలైజేషన్‌, విదేశీ భాషలపై శిక్షణ, ప్లేస్‌మెంట్‌న, ఇమిగ్రేషన్‌, ప్లేస్‌మెంట్‌ అనంతర మద్దతు వంటి వాటికి ఇదిఉపకరిస్తుంది.

శ్రీ ధర్మేంద్రప్రధాన్‌, వి.ఎఫ్‌.ఎస్‌ గ్లోబల్‌, ట్రాన్స్‌వరల్డ్‌ టుడే తో కూడా ఫల ప్రదమైన చర్చలు జరిపారు. భారతదేశ యువతను , ఇతర దేశాలలోని అవకాశాలతో అనుసంధానం చేసేందుకు ఉపయోగకరమైన చర్చలు జరిగినట్టు ఆయన తెలిపారు. అలాగే, నైపుణ్య శిక్షణ కు సంబంధించి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, నైపుణ్యాభివృద్ధిలో కొలాబరేషన్లు, సామర్ధాల పెంపు వాటిపై కూడా చర్చించినట్టు తెలిపారు. నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి మరిన్ని అవకాశాలు కల్పించడం, ఉపాధి అవకాశాలు, భవిష్యత్‌ అవసరాలకు తగినట్టు యువతను సన్నద్ధం చేయడం, వంటివి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలలోనివని ఆయన తెలిపారు.విఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌, ట్రాన్స్‌వరల్డ్‌ గ్రూప్‌ ఇండియాలో క్రియాశీలక భాగస్వామిగా ఉంటూ యువతను భవిష్యత్తుకు సన్నద్ధం చేసేందుకు, నైపుణ్యాల కల్పనకు సంబంధించిన పరిస్థితులను మరింత చైతన్యవంతం చేసేందుకు ముందుకు వచ్చినందుకు ఆయన వీరికి అభినందనలు తెలిపారు.

కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ నిన్న యు.ఎ.ఇలో నడుస్తున్న 105 సి.బి.ఎస్‌.ఇ అనుబంధ పాఠశాలల Êప్రిన్సిపాళ్లతో ముఖాముఖి మాట్లాడారు. ఈ పాఠశాలలన్నీ నూతన విద్యావిధానం ఎన్‌.ఇ.పి 2020 ని అందిపుచ్చుకున్నట్టు తెలుసకుని సంతోషం వ్యక్తం చేశారు. దీనిని అవి క్షేత్రస్థాయిలో అమలుచేస్తున్నట్టు మంత్రికి తెలియజేశాయి. విదేశాలలో గల భారతీయ విద్యాసంస్థలు అంతర్జాతీయంగా గల అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకోవాలని, ఆ రకంగా మన విద్యార్థులు, టీచర్ల అవసరాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు.

.మన సంస్కృతి సంపప్రదాయాలు, విలువలు, విజ్ఞానానికి సంబంధించి మన విద్యావేత్తలు, మన భారతీయ సంతతి ప్రజలను శాశ్వత రాయబారులుగా చెప్పుకోవచ్చని అన్నారు. స్నేహ సంబంధాలకు విద్య ఒక ప్రధాన స్తంభంగా నిలవగలదని ఆయన తెలిపారు. యు.ఎ.ఇ లోని మన సిబిఎస్‌ఇ అనుబంధ పాఠశాలలు, నమ్మకంతో కూడిన స్నేహాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడగలవన్నారు.
ఇ.ఎఫ్‌.ఎస్‌పెసిలిటీస్‌ సర్వీసెస్‌ గ్రూప్‌కు చెందిన గ్రూప్‌ సి.ఇ.ఒ, కో ఫౌండరÊ తారిక్‌ చౌహాన్‌తో మంత్రి సమావేశం నిర్వహించారు. దేశంలో నైపుణ్యాభివృద్ధివాతావరణాన్ని మెరుగుపరిచేందుకు తారిక్‌ చౌహాన్‌ ప్రణాళికలను తెలసుకుని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అలాగే భారతీయ శ్రామికుల అంతర్జాతీయ మొబిలిటి కీ వీలు కల్పించనుండడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇఎఫ్‌ఎస్‌గ్రూపు సంస్థాగత సంబంధాలను ముందుకు తీసుకువెళ్లేందుకు, ఇండియాలో నైపుణ్యాల అభివృద్ధి వాతావరణాన్ని మరింత బలోపేతం చేసేందుకు, నైపుణ్యాలపెంపు, నైపుణ్యాల ఉన్నతీకరణ , భారతీయ యువతకు సాధికారత కల్పించేందుకు కట్టుబడి ఉండడంపట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

ఇఎఫ్‌ఎస్‌ ఫెసిలిటీస్‌ సర్వీసెస్‌ గ్రూప్‌, ఎన్‌.ఎస్‌.డి.సి ల మధ్య కేంద్ర మంత్రి శ్రీ ప్రధాన్‌ సమక్షంలో అవగాహనా ఒప్పందం కుదిరింది. భారత శ్రామికులు, అంతర్జాతీయంగా ఇతర దేశాలలో పని చేసేందుకు ప్రత్యేకించి జిసిసి దేశాలకు వెళ్లేందుకు వీలు కల్పించే అవగాహనా ఒప్పందం ఇది.
 ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ ప్రధాన్‌, ఈ ఎం.ఒ.యు పాఠ్య ప్రణాళిక అభివృద్ధి, సంయుక్తంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ, నైపుణ్య సంస్థల సహ బ్రాండిరగ్‌, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శ్రామికుల నైపుణ్యాల పెంపు, అంతర్జాతీయ అవకాశాలకు వారిని సన్నద్ధులను చేయడం, వంటి వాటికి ఈ ఎం.ఒ.యు మార్గం సుగమం చేస్తుందని అన్నారు.

 

***


(Release ID: 1974813) Visitor Counter : 65